Home /News /technology /

AIRTEL ANNOUNCED NEW POSTPAID PLANS FOR CORPORATE AND RETAIL CUSTOMERS KNOW BENEFITS SS

Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే

Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel Plans: కొత్త ప్లాన్స్ ప్రకటించిన ఎయిర్‌టెల్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Plans | ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్ ప్రకటించింది.

    ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ మామూలైపోయింది. డేటా వినియోగం కూడా పెరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌టెల్ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. కార్పొరేట్ కస్టమర్లతో పాటు రీటైల్ కస్టమర్లకు వేర్వేరుగా పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది. బెనిఫిట్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్స్ రూపొందించడం విశేషం. మరి కొత్తగా ప్రకటించిన పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఏవీ, వాటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటీ? తెలుసుకోండి.

    కార్పొరేట్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ వివరాలు చూస్తే రూ.299, రూ.349, రూ.399, రూ.499, రూ.1599 ప్లాన్స్ ప్రకటించింది. రూ.299 ప్లాన్‌కు 30జీబీ, రూ.349 ప్లాన్‌కు 40జీబీ, రూ.399 ప్లాన్‌కు 60జీబీ, రూ.499 ప్లాన్‌కు 100జీబీ, రూ.1599 ప్లాన్‌కు 1500జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ కాల్ మేనేజర్ ట్రేస్‌మేట్, గూగుల్ వర్క్‌స్పేస్ లంటి బిజినెస్ టూల్స్ యాక్సెస్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ఆఫర్‌లో భాగంగా వింక్ మ్యూజిక్ యాప్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం, షా అకాడమీ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్, వీఐపీ సర్వీస్, ఎయిర్‌టెల్ సెక్యూర్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ఎయిర్‌టెల్ కార్పొరేట్ కస్టమర్లను కొత్త ప్లాన్స్‌కు మైగ్రేట్ చేయనుంది ఎయిర్‌టెల్.

    YouTube: యూట్యూబ్‌లో ఇలా కూడా డబ్బులు సంపాదించొచ్చు

    Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే

    ఇక రీటైల్ కస్టమర్లకు రూ.399, రూ.499, రూ.999, రూ.1599, రూ.299 యాడ్ ఆన్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.399 ప్లాన్‌పై 40జీబీ డేటా, రూ.499 ప్లాన్‌పై 75జీబీ డేటా లభిస్తుంది. రూ.999 ప్లాన్‌తో 3 కనెక్షన్స్ తీసుకోవచ్చు. ప్రైమరీ నెంబర్‌కు 150జీబీ డేటా, యాడ్ ఆన్ నెంబర్లకు 30జీబీ చొప్పున డేటా లభిస్తుంది. రూ.1599 ప్లాన్‌కు 2 కనెక్షన్స్ తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇక రూ.299 యాడ్ ఆన్ ప్లాన్‌కు 30జీబీ డేటా లభిస్తుంది. అన్ని ప్లాన్స్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వింక్ మ్యూజిక్ యాప్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, షా అకాడమీ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలోట్యూన్స్, అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి.

    Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

    Dual WhatsApp: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్‌ మారిస్తే రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోవచ్చు

    ఇక కొత్త కస్టమర్లకు రూ.749 ఫ్యామీలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తొలగించింది ఎయిర్‌టెల్. ఇకపై అదనపు బెనిఫిట్స్‌తో రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పొందొచ్చు. ఇక ఇప్పటికే పోస్ట్‌పెయిడ్ కస్టమర్లుగా ఉన్నవారు రూ.299 చెల్లించి 30జీబీ అదనపు డేటా పొందొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు