Home /News /technology /

AIRTEL AND VI TARIF CHARGES ARE INCREASED KNOW PRICES OF PREPAID PLANS GH EVK

Airtel, Vi New Prices: ఎయిర్‌టెల్, వీఐ ప్రీపెయిడ్ టారిఫ్‌ల ధరలు పెంపు.. వివిధ ప్లాన్ల కొత్త ధరలివే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Airtel and VI New Tariff Plans: ప్రతి యూజర్‌పై యావరేజ్ రెవిన్యూని (ARPU) పెంచడానికి, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి భారాన్ని తగ్గించుకునేందుకు టారిఫ్‌ను పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్‌, వీఐ తెలిపాయి. ఇప్పటికే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చినందున.. ప్రస్తుతం వీఐ, ఎయిర్‌టెల్‌ రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇంకా చదవండి ...
ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా (VI), ఎయిర్‌టెల్‌ (Airtel) తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను 20 నుంచి 25 శాతం వరకు పెంచాయి. నవంబర్ 25 నుంచి వీఐ ప్లాన్‌లు కొత్త రేట్ల (New Rates)తో అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ల ధరలు నవంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు వీఐ, ఎయిర్‌టెల్‌ రెండింటికీ కనీస రీఛార్జ్‌ ప్లాన్ (Recharge Plan) ధర రూ.99గా ఉంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి యూజర్‌ (User)పై యావరేజ్ రెవిన్యూని (ARPU) పెంచడానికి, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి భారాన్ని తగ్గించుకునేందుకు టారిఫ్‌ను పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్‌, వీఐ (VI) తెలిపాయి. ఇప్పటికే కొత్త ధరలు అందుబాటులోకి వచ్చినందున.. ప్రస్తుతం వీఐ, ఎయిర్‌టెల్‌ రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఎయిర్‌టెల్‌ కొత్త ధరలు
- ధరల పెంపు తరువాత ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్‌లు నెలవారీ ప్లాన్‌ (Monthly Plan)ల కోసం కనీసం రూ.50 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

- రెండు, మూడు నెలలు లేదా ఇంకా ఎక్కువగా వ్యాలిడిటీ ప్లాన్‌లకు రూ.50 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

- 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ కోసం కనీసం రూ. 479 చెల్లిస్తే.. 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ కోసం రూ.455 చెల్లించాలి.

- అపరిమిత కాలింగ్, 6జీబీతో 84 రోజుల వ్యాలిడిటీ (Validity)గల ప్లాన్ ధర గతంలో రూ.379 ఉండేది. అది ఇప్పుడు రూ.455కి పెరిగింది. టాప్-అప్ ప్లాన్‌ల ధర కూడా పెరిగింది.

IBPS Clerk 2021: ఐబీపీఎస్ క్ల‌ర్క్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌.. ప‌రీక్ష విధానం


- యాక్టీవ్ ప్యాక్ వ్యాలిడిటీతో 3జీబీ డేటా అందించే టాప్-అప్ ప్లాన్‌ రూ.48 ధర రూ.58కి పెరిగింది. రూ.98 ప్లాన్ ధర రూ.118కి పెరగగా.. రూ.251 రీఛార్జ్ ధర రూ.301కి పెరిగింది.

- మొన్నటిదాకా రూ.75గా ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.99 కి పెరిగింది. రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 179 కి ఎగబాకింది.

- రూ.219 ప్లాన్ ధర రూ. 265... రూ.249 ప్లాన్ ధర రూ. 299.. రూ.298 ప్లాన్ ధర రూ. 359కి పెరిగింది. 56 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రెండు ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధర ఇప్పుడు రూ. 479, రూ. 549గా ఉంది.

- గతంలో 56 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 1.5జీబీ డేటా అందించే ప్లాన్ ధర రూ.399గా, అదే వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2జీబీ డేటా అందించే ప్లాన్ ధర రూ.449గా ఉండేది. ఇప్పుడు వాటిపై వరుసగా రూ.80, రూ.100 పెరిగాయి.

- 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధర ఇప్పుడు కనిష్టంగా రూ. 455 అవుతుంది. రూ. 598 ప్లాన్ ధర రూ. 719.. రూ.698 ప్లాన్ రూ.839కి పెరిగాయి.

- వార్షిక ప్లాన్‌లలో, 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.1,498 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.1,799కి పెరిగింది. రూ.2,498 ప్లాన్ ధర ఇప్పుడు రూ.2,999కి పెరిగింది.

కొత్త వీఐ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరల వివ‌రాలు
- 28 రోజుల వ్యాలిడిటీని అందించే బేసిక్ రూ. 75 ప్లాన్ ధర ఇప్పుడు రూ.99కి పెరిగింది.

- అపరిమిత వాయిస్, డేటా ప్రీపెయిడ్ కేటగిరీలో, రూ. 149 ప్లాన్ ధర రూ.179, రూ.219 ప్లాన్ ధర రూ.269.. రూ.249 ప్లాన్ ధర రూ.299.. రూ.299 ప్లాన్ ధర రూ.359కి పెరిగింది.

- రూ.379గా ఉన్న ప్లాన్ కాస్ట్ రూ.459కి పెరిగింది.

- రూ. 399 ప్లాన్ ఇప్పుడు రూ.479.. రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.539కి పెరిగింది.

- ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లన్నీ ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తాయి. అయితే వ్యాలిడిటీ, ఇంటర్నెట్ డేటా లిమిట్ మాత్రం మారుతుంది.

RRB Group-D: ఆర్ఆర్‌బీ-గ్రూప్‌డీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. అప్లికేష‌న్‌కు మ‌రో అవ‌కాశం


- రూ.699 ధర ఉన్న వీఐ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.839 అయ్యింది. 365 రోజుల వ్యాలిడిటీ వార్షిక ప్లాన్‌లలో రూ.1,499 ప్లాన్ ధర రూ.1,799 పెరగగా.. రూ.2,399 ప్లాన్ ధర రూ.2,899కి పెరిగింది.
Published by:Sharath Chandra
First published:

Tags: Airtel recharge plans, Mobile News, Recharge, Vodafone Idea

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు