హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel 5G Plus: ఎయిర్‌టెల్ 5G సేవలు ప్రారంభం.. మీ ఫోన్‌లో నెట్‌వర్క్‌ను ఇలా యాక్సెస్ చేసుకోండి

Airtel 5G Plus: ఎయిర్‌టెల్ 5G సేవలు ప్రారంభం.. మీ ఫోన్‌లో నెట్‌వర్క్‌ను ఇలా యాక్సెస్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎయిర్‌టెల్ తాజాగా 5G సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ (Airtel 5G Plus) పేరుతో ఎట్టకేలకు సంస్థ ఈ నెట్‌వర్క్‌ సర్వీస్‌ను ప్రారంభించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారత్‌లో నెక్స్ట్ జనరేషన్ టెలికాం నెట్‌వర్క్ అయిన 5G టెక్నాలజీ (5G Technology) అధికారికంగా లాంచ్ అయింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను అందిస్తామని టెలికాం కంపెనీలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తాజాగా 5G సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ (Airtel 5G Plus) పేరుతో ఎట్టకేలకు సంస్థ ఈ నెట్‌వర్క్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతానికి 8 నగరాల్లో 5G సేవలను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ అధికారికంగా వెల్లడించింది. ఇండియన్ 5G బ్యాండ్స్‌కు సపోర్ట్ చేసే 5G ఫోన్లు వాడేవారు ఈజీగా ఈ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. 5జీ కనెక్టివిటీ కోసం ప్రస్తుత సిమ్ కార్డ్‌ను మార్చాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ (Airtel) తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న 4G డేటా ప్లాన్లతోనే 5G సేవలను పొందవచ్చని పేర్కొంది. అయితే దేశంలో లేటెస్ట్ నెట్‌వర్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అసలైన ప్లాన్ల ధరలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ సేవలతో కస్టమర్లు ఇప్పుడు ఉపయోగిస్తున్న దానికంటే 30 రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. ఇది బెస్ట్ క్వాలిటీ వాయిస్ కాలింగ్ సేవలను అందిస్తుంది. ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌తో ఎలాంటి ల్యాగ్ లేకుండా 4K వీడియోలను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. VR/AR గేమింగ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసుకోవచ్చు.

ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేయాలి?

ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియాలో 5G ఫోన్లను లాంచ్ చేశాయి. ఇండియన్ 5G బ్యాండ్‌కు సపోర్ట్ చేసే అన్ని డివైజ్‌లలో ఈ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ఏయే మోడళ్లలో ఎయిర్‌టెల్ 5G కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుందనే వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. మీ 5G ఫోన్‌లో 5G నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా ఎలా లాంచ్ చేయాలో చూద్దాం.

ముందు మీ 5G ఫోన్‌ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎయిర్‌టెల్‌ సిమ్‌ ఆప్షన్ క్లిక్ చేసి, స్క్రోల్ చేయండి. వీటిలో 5G/4G/3G/2G/ఆటో ఆప్షన్లు కనిపిస్తాయి. వీటి నుంచి 5జీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాంతంలో 5G అందుబాటులో ఉంటే, ఎయిర్‌టెల్ 5G ఐకాన్ మెయిన్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

ఎయిర్‌టెల్ 5G అందుబాటులోకి వచ్చిన నగరాలు

ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ ఢిల్లీ , ముంబై, చెన్నై, బెంగళూరు, నాగపూర్, హైదరాబాద్ , సిలిగురి, వారణాసి వంటి ఎనిమిది నగరాల్లోనే 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తర్వాత విడతల వారీగా ఇతర నగరాల్లో ఈ టెక్నాలజీని కంపెనీ పరిచయం చేయనుంది.

పాత 4జీ ధరలకే..

ఎయిర్‌టెల్ ఇప్పటి వరకు 5G సేవల కోసం కొత్త ప్లాన్లను ప్రకటించలేదు. అయితే కస్టమర్లకు ప్రస్తుత ప్లాన్‌లతో ఈ లేటెస్ట్ కనెక్టివిటీని అందించడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇందులో ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. డేటా ప్లాన్ ధరలు మారనప్పటికీ, 5జీ డేటా యూజ్ చేస్తే, డౌన్‌లోడ్స్, స్ట్రీమింగ్ కోసం 5G డేటా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంటే కస్టమర్ల డేటా కోటా ఇంతకు ముందుతో పోలిస్తే త్వరగా అయిపోతుంది. ఇలా కస్టమర్లు వాడే అదనపు డేటా ద్వారా కంపెనీ ప్రయోజనం పొందనుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G, 5g technology

ఉత్తమ కథలు