స్మార్ట్ ఫోన్లపై దాడి చేస్తున్న 'ఏజెంట్ స్మిత్'.. యూజర్స్‌ను హడలెత్తిస్తున్న మాల్వేర్..

ఇంటర్నెట్‌లో కనిపించే పలు రకాల మోసపూరిత ప్రకటనల రూపంలో ఈ మాల్వేర్ ఉంటుందని అంటున్నారు.ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన యాడ్స్ రూపంలో ఇది ఉంటుండటంతో.. చాలామంది దీన్ని డౌన్ లోడ్ చేస్తున్నారని చెబుతున్నారు.

news18-telugu
Updated: July 11, 2019, 7:06 AM IST
స్మార్ట్ ఫోన్లపై దాడి చేస్తున్న 'ఏజెంట్ స్మిత్'.. యూజర్స్‌ను హడలెత్తిస్తున్న మాల్వేర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
'ఏజెంట్ స్మిత్' అనే ఓ కొత్త మాల్వేర్ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లపై దాడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.5కోట్ల స్మార్ట్ ఫోన్లు దీని బారిన పడగా.. ఇండియాలో 1.5కోట్ల స్మార్ట్ ఫోన్లు దీని బారిన పడ్డాయి.గూగుల్ సంబంధిత యాప్‌ రూపంలో స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించే ఈ యాప్.. ఫోన్‌లో అప్పటికే ఉన్న యాప్‌ను సైలెంట్‌గా అన్-ఇన్‌స్టాల్ చేసేస్తుంది. వాటి స్థానంలో ఫోన్‌కు హాని చేసే ఇతర వెర్షన్స్‌ను ప్రవేశపెడుతుంది. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ అయిన 9Apps ద్వారానే ఏజెంట్ స్మిత్ స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించిందంటున్నారు. హిందీ,అరబిక్,రష్యన్ మాట్లాడే యూజర్స్‌నే ఇది ఎక్కువగా టార్గెట్
చేసిందని చెబుతున్నారు.

ఇంటర్నెట్‌లో కనిపించే పలు రకాల మోసపూరిత ప్రకటనల రూపంలో ఈ మాల్వేర్ ఉంటుందని అంటున్నారు.ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన యాడ్స్ రూపంలో ఇది ఉంటుండటంతో.. చాలామంది దీన్ని డౌన్ లోడ్ చేస్తున్నారని చెబుతున్నారు. అలా యూజర్స్‌ను ఏమార్చి వారి స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశించే ఈ మాల్వేర్.. వారి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను కూడా తస్కరించే అవకాశం ఉందంటున్నారు.

పాకిస్తాన్,బంగ్లాదేశ్‌ సహా మరికొన్ని ఆసియా దేశాల స్మార్ట్ ఫోన్ యూజర్స్ కూడా దీని బారినపడ్డారు.అలాగే యూకె,ఆస్ట్రేలియా,అమెరికాల్లోనూ 'ఏజెంట్ స్మిత్' బారిన పడ్డ స్మార్ట్ ఫోన్ యూజర్స్ చాలామందే ఉన్నారు.First published: July 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...