WhatsApp: "అడిడాస్ నుంచి 700 షూస్, 7000 టీషర్ట్స్ ఉచితం"... ఈ మెసేజ్ నమ్మితే మోసపోవాల్సిందే

WhatsApp | "అడిడాస్ 93వ వార్షికోత్సవం సందర్భంగా 3,000 జతల షూస్ ఉచితంగా ఇస్తోంది" అని గతంలో మెసేజ్‌ సర్క్యులేట్ అయింది.

news18-telugu
Updated: September 30, 2019, 1:11 PM IST
WhatsApp:
WhatsApp: "అడిడాస్ నుంచి 700 షూస్, 7000 టీషర్ట్స్ ఉచితం"... ఈ మెసేజ్ నమ్మితే మోసపోవాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 30, 2019, 1:11 PM IST
"అడిడాస్ కంపెనీ 70వ వార్షికోత్సవం సందర్భంగా 700 జతల షూస్, 7000 టీషర్ట్స్ ఉచితంగా ఇస్తోంది" అనే మెసేజ్ మీకు వాట్సప్‌లో వచ్చిందా? ఆ మెసేజ్ నమ్మేశారా? ఆ మెజేస్‌లో ఉన్న లింక్ క్లిక్ చేశారా? దారుణంగా మోసపోతారు జాగ్రత్త. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి మెసేజ్‌లు వాట్సప్‌లో సర్క్యులేట్ అయ్యాయి. "అడిడాస్ 93వ వార్షికోత్సవం సందర్భంగా 3,000 జతల షూస్ ఉచితంగా ఇస్తోంది" అని గతంలో మెసేజ్‌ సర్క్యులేట్ అయింది. ఇప్పుడు నెంబర్ మారింది కానీ... మోసం మాత్రం అదే. ఆ మెసేజ్‌లు ఉన్న లింక్ క్లిక్ చేసి, మీ వివరాలు వెల్లడిస్తే మాత్రం మోసపోతారు జాగ్రత్త. మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే అసలు అడిడాస్‌కు ఏమాత్రం సంబంధం లేని వెబ్‌సైట్ ఓపన్ అవుతుంది. అందులో మీ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాదు... మీరు ఆ మెసేజ్‌ను మరికొందరికి పంపాలన్న కండీషన్ ఉంటుంది.

వాస్తవానికి అడిడాస్ కంపెనీ ఎవరికీ ఉచితంగా షూస్, టీషర్ట్స్ ఇవ్వదు. ఇవ్వట్లేదు. కానీ... కొందరు క్లిక్స్ కోసం ఇలాంటి మెసేజ్‌లు క్రియేట్ చేసి వైరల్ చేస్తుంటారు. మీ వ్యక్తిగత వివరాలు సేకరించి అమ్ముకుంటారు. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్ వస్తే డిలిట్ చేయడం మంచిది. ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు వెల్లడించొద్దు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి ఇలాంటి బహుమతులు ఇస్తామన్నా నమ్మొద్దు. మీ అకౌంట్ వివరాలు చెప్పొద్దు. ఒక్క అడిడాస్ మాత్రమే కాదు... ప్రముఖ కంపెనీల పేర్లు చెప్పి ఇలాగే మెసేజ్‌లను వైరల్ చేస్తుంటారు కేటుగాళ్లు. అందుకే... వాట్సప్‌లో వచ్చే ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త.

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Dussehra Sale: మీకు సెల్ఫీలు ఇష్టమా? దసరా సేల్‌లో ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్

Smartphone offer: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ 20 స్మార్ట్‌ఫోన్లు ఇవే...
Loading...
Redmi offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు ఇవే...
First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...