హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

QCOs: త్వరలో చైనా ఎలక్ట్రిక్ ఫ్యాన్, స్మార్ట్ మీటర్ల దిగుమతులపై QCOs.. కేంద్రం కీలక నిర్ణయం..!

QCOs: త్వరలో చైనా ఎలక్ట్రిక్ ఫ్యాన్, స్మార్ట్ మీటర్ల దిగుమతులపై QCOs.. కేంద్రం కీలక నిర్ణయం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ ఫ్యాన్, స్మార్ట్ మీటర్లు క్షుణంగా తనిఖీ చేయడానికి..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, నాణ్యమైన ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ ఫ్యాన్, స్మార్ట్ మీటర్లు క్షుణంగా తనిఖీ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్(QCOs)ను త్వరలో జారీ చేయనుంది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి అవుతున్న బొమ్మల(టాయ్స్)పై కఠినమైన క్వాలిటీ తనిఖీలను నిర్వహించడం ద్వారా సక్సెస్‌పుల్‌గా వాటి దిగుమతులను నియంత్రించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సీలింగ్ ఫ్యాన్‌ల దిగుమతి 132 శాతం పెరిగి 6.22 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో చైనా వాటా 5.99 మిలియన్ డాలర్లుగా ఉంది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు దిగుమతి విలువ 3.1 మిలియన్ల డాలర్లు కాగా, చైనా నుంచే 1.32 మిలియన్ల డాలర్ల వ్యాపారం జరిగింది.

స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఓ అధికారి మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు, సీలింగ్ ఫ్యాన్‌ల వంటి భారీ ఉత్పత్తి వస్తువుల కోసం QCOలను తీసుకురావాలని చూస్తున్నామన్నారు. దీంతో మన దేశంలోని పరిశ్రమలకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న అన్ని రకాల ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్‌ను ఎగ్జామిన్ చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రొడక్ట్ మాన్యువల్స్, స్టాండరైజేషన్ ప్రాసెస్, టెస్టింగ్ లేబొరేటరీస్ వంటివి అందుబాటులో ఉన్న చోట QCOలను పరిచయం చేయడానికి భారీ కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

44.6 బిలియన్ల డాలర్ల వాణిజ్య లోటు

మరోపక్క 2022 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో చైనాకు ఎగుమతులు 36.2 శాతం తగ్గి 7.8 బిలియన్ల డాలర్ల కు చేరాయి. అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 23.6 శాతం పెరిగి 52.4 బిలియన్ల డాలర్ల కు చేరాయి. దీంతో ఇది రికార్డు స్థాయిలో 44.6 బిలియన్ల వాణిజ్య లోటుకు దారితీసింది.

2020లో బొమ్మల దిగుమతులపై క్యూసీఓ

బొమ్మల దిగుమతులపై 2020లో క్వాలిటీ కంట్రోల్‌ ఆర్డర్ జారీ చేసిన తరువాత, గత మూడేళ్లలో వాటి దిగుమతి 70 శాతం పడిపోయాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో బొమ్మల దిగుమతి విలువ 371 మిలియన్ల డాలర్లు ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరానికి అది 110 మిలియన్లకు పడిపోయింది.

గత రెండు దశాబ్దాల చర్యలకు భిన్నం

కరోనా కాలం నుంచి అనవసరమైన దిగుమతులను అరికట్టడానికి, దేశీయ పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్స్ విధించడం ప్రారంభించింది. కేంద్ర వాణిజ్య- పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2020 నుంచి దాదాపు 20 QCOలకు నోటిఫై చేసింది. ఈ చర్య గత రెండు దశాబ్ధాలతో పోల్చితే భిన్నంగా ఉంది. 2000-2019 మధ్య కాలంలో 18 నుంచి 19 QCOలను జారీ చేసింది.

క్యూసీఓలు జారీ అయిన ఉత్పత్తులు

2020 ప్రారంభంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) అనేక రకాల ఉత్పత్తులపై క్యూసీఓలను జారీ చేసింది. ప్రధానంగా స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్, రసాయనాలు, ఎరువులు, పాలిమర్స్ అండ్ టెక్స్‌టైల్స్, ఎయిర్ కండిషనర్స్, ప్లగ్స్ అండ్ సాకెట్స్, డొమెస్టిక్ గ్యాస్ స్టవ్స్, ట్రాన్స్పరెంట్ ఫ్లాట్ గ్లాస్, ప్రెషర్ కుక్కర్, కేబుల్స్, అల్యూమినియం ఫాయిల్, బొమ్మలు, కాపీయర్ పేపర్, పశువుల దాణా, ఫుట్ వేర్, హెల్మెట్లు, కుట్టు యంత్రం వంటి వాటిపై క్యూసీఓలను నోటిఫై చేసింది.

First published:

Tags: China

ఉత్తమ కథలు