Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్ వివరాలివే

Reliance Jio New Plans | కేవలం రూ.75 ధర నుంచే ఈ ప్లాన్ ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా పొందొచ్చు. ఫీచర్ ఫోన్‌లో జియో అన్‌లిమిటెడ్ సర్వీసుల్ని అందిస్తుంది.

news18-telugu
Updated: October 25, 2019, 5:03 PM IST
Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్ వివరాలివే
Jio New Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ప్లాన్స్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
టెలికామ్ సెక్టార్‌లో జియో సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.222, రూ.333, రూ.444, రూ.555 ధరతో ఈ ప్లాన్స్ ఉన్నాయి. వాటి బెనిఫిట్స్ వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రిలయెన్స్ జియో ఫోన్ ఉపయోగించేవారి కోసం కొత్త ప్లాన్స్ ప్రకటించింది కంపెనీ. ఒకే ప్లాన్‌లో అన్ని సేవల్ని అందించబోతుంది. రూ.30 చెల్లిస్తే డబుల్ డేటాను పొందొచ్చు. డేటాతో పాటు వాయిస్ కాల్స్, వ్యాల్యూ యాడెడ్ సర్వీసెస్‌ను పొందొచ్చు. సులువుగా గుర్తుంచుకునేలా ఈ ప్లాన్స్‌న్ రూపొందించింది రిలయెన్స్ జియో. కేవలం రూ.75 ధర నుంచే ఈ ప్లాన్ ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా పొందొచ్చు. ఫీచర్ ఫోన్‌లో జియో అన్‌లిమిటెడ్ సర్వీసుల్ని అందిస్తుంది. జియో ఫోన్ వాడేవారి కోసం రూ.75, రూ.125, రూ.155, రూ.185 ప్లాన్స్ ప్రకటించింది కంపెనీ. ఇతర కంపెనీల ప్లాన్స్‌తో పోలిస్తే జియో ప్లాన్స్‌తో లాభాలు ఎక్కువ. ఇతర కంపెనీల ప్లాన్స్, జియో ప్లాన్స్ మధ్య ఉన్న తేడాను ఈ చార్ట్‌లో చూడండి.

Reliance Jio new plans, Reliance Jio All-in-One plans, Jio Phone All-in-One plans, Reliance Jio offers, Reliance Jio plans, రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్, రిలయెన్స్ జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్, జియో ఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్, రిలయెన్స్ జియో ఆఫర్స్, రిలయెన్స్ జియో ప్లాన్స్
Source: Reliance Jio


Jio New Plans: జియో ఫోన్‌ యూజర్లకు ప్లాన్స్ ఇవే...


రూ.75 ప్లాన్: జియో నుంచి జియో కాల్స్ ఉచితం. 500 నిమిషాలు ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్స్ ఉచితం. 3 జీబీ డేటా ఉచితం.
రూ.125 ప్లాన్: జియో నుంచి జియో కాల్స్ ఉచితం. 500 నిమిషాలు ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్స్ ఉచితం. 14 జీబీ డేటా ఉచితం.
రూ.155 ప్లాన్: జియో నుంచి జియో కాల్స్ ఉచితం. 500 నిమిషాలు ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్స్ ఉచితం. 28 జీబీ డేటా ఉచితం.
రూ.185 ప్లాన్: జియో నుంచి జియో కాల్స్ ఉచితం. 500 నిమిషాలు ఇతర నెట్‌వర్క్స్‌కు కాల్స్ ఉచితం. 56 జీబీ డేటా ఉచితం.Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Google Apps: స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడేస్తున్నారా? ఈ 5 యాప్స్ ట్రై చేయండి

ATM: ఏటీఎంలో డబ్బులు లేవా? ఈ టిప్స్ పాటించండి

Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా
First published: October 25, 2019, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading