మంచి నిర్ణయం తీసుకున్న SBI... ఆగస్ట్ 1 నుంచీ ఆ ఛార్జీల ఎత్తివేత...

SBI : బ్యాంకులు రూల్స్ మార్చేసుకుంటున్నాయా... మొన్నటి దాకా రకరకాల ఛార్జీలు బాదేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నాయా... SBI తీసుకున్న నిర్ణయం అలాంటిదే.

Krishna Kumar N | news18-telugu
Updated: July 13, 2019, 7:25 AM IST
మంచి నిర్ణయం తీసుకున్న SBI... ఆగస్ట్ 1 నుంచీ ఆ ఛార్జీల ఎత్తివేత...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచంలో ఎక్కువ బ్రాంచిలతో... దేశంలో ఎక్కువ మంది కస్టమర్లతో నడుస్తున్న బ్యాంక్... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల్ని బట్టీ... మిగతా బ్యాంకులు కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. అందువల్ల SBI తాజాగా తీసుకున్న నిర్ణయం కస్టమర్లకు కలిసొచ్చేదనే అనుకోవచ్చు. ఆగస్ట్ 1 నుంచీ SBI ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ కస్టమర్లకు IMPS ఛార్జీల భారం ఉండదు. రోజులో ఎప్పుడైనా సరే మనీ పంపేందుకు, ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు... IMPS (Immediate Payment Service) ఉపయోగపడుతుది. ప్రస్తుతం రూ.1000 పంపేందుకు ఏ ఛార్జీలూ లేవు. అదే రూ.1000 నుంచీ రూ.10 వేల వరకైతే... రూ.1+GST వసూలు చేస్తోంది. అలాగే రూ.10,001 నుంచీ రూ.లక్ష వరకూ... రూ.2+GST తీసుకుంటోంది. అలాగే... రూ.1,00,001 నుంచీ రూ.2లక్షల వరకు జరిగే ట్రాన్సాక్షన్లపై... రూ.3+GST వసూలు చేస్తోంది SBI... ఆగస్ట్ 1 నుంచీ ఈ ఛార్జీలు ఉండవు.


బడ్జెట్‌లో చేసిన ప్రకటనతో... ఇదివరకు NEFT, RTGS ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అన్ని బ్యాంకులకూ... ఈ రూల్ అమలైంది. జులై 1 నుంచీ SBI ఈ ఛార్జీలను ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం... ఈ ఛార్జీలను తొలగించాలని నిర్ణయించింది.2019 మార్చి చివరి నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్న SBI కస్టమర్ల సంఖ్య 6కోట్ల కంటే ఎక్కువే. ఇక మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్న SBI కస్టమర్ల సంఖ్య 1.41 కోట్లుగా ఉంది. మొత్తం మొబైల్ బ్యాంకింగ్ మార్కెట్‌లో తాము 18 శాతం వాటా కలిగివున్నట్లు SBI చెబుతోంది.
First published: July 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>