భారతదేశంలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము కూడా టిక్‌టాక్ సహా చైనా సోషల్ మీడియా యాప్స్‌ని బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. టిక్‌టాక్ యూజర్ డేటాను హ్యాండిల్ చేస్తున్న విషయంలో జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా చట్ట సభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కూడా అందుబాటులో లేని ఈ యాప్ ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ని ఆకర్షిస్తోంది. రెండేళ్లుగా ట్రేడ్ వార్, హాంకాంగ్‌లో చైనా చర్యలు, మరోవైపు కరోనా వైరస్ మహమ్మారిని హ్యాండిల్ చేయడం విషయంలో అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్స్ బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నామని యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.