Home /News /technology /

AFTER FACEBOOK NOW SILVER LAKE TO INVEST IN JIO PLATFORMS KNOW SILVER LAKE JIO DEAL KEY HIGHLIGHTS SS

Jio-Silver Lake deal: రిలయెన్స్ జియో-సిల్వర్ లేక్ డీల్‌లో హైలైట్స్ ఇవే

Jio-Silver Lake deal: రిలయెన్స్ జియో-సిల్వర్ లేక్ డీల్‌లో హైలైట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio-Silver Lake deal: రిలయెన్స్ జియో-సిల్వర్ లేక్ డీల్‌లో హైలైట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Jio-Silver Lake deal | జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ 9.99 శాతం అంటే రూ.43,574 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టనుంది.

    అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ జియో ప్లాట్‌పామ్స్‌లో 1 శాతం వాటా తీసుకుంది. దీని విలువ 750 మిలియన్ డాలర్లు. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL డిజిటల్ యూనిట్ విలువ 65 బిలియన్ డాలర్లు. ఈ డీల్ గురించి రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ "భారతీయులందరి ప్రయోజనాల కోసం భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో, మార్చడంలో సిల్వర్ లేక్‌ను విలువైన భాగస్వామిగా స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సిల్వర్ లేక్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు విలువైన భాగస్వామిగా నిలిచింది. సిల్వర్ లేక్ టెక్నాలజీ, ఫైనాన్స్‌లలో అత్యంత గౌరవనీయమైనవాటిలో ఒకటి. ఇండియన్ డిజిటల్ సొసైటీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం వారి ప్రపంచ సాంకేతిక సంబంధాల నుంచి మరింత ముందుకెళ్లేందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.

    Jio-Silver Lake deal: హైలైట్స్ ఇవే...


    ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఇన్వెస్టర్ జియోలో ఇన్వెస్ట్ చేస్తోంది.
    జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్ లేక్ వాటా 1.15 శాతం. ఈ పెట్టుబడి విలువ రూ.5,656 కోట్లు.
    రిలయెన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తంలో ఈ ఈక్విటీ విలువ 52 శాతం.
    కోవిడ్ అనంతరం భారతీయ మార్కెట్లలో డిజిటైజేషన్ అవకాశాలను అందిపుచ్చుకుంటామని ఈ డీల్ ద్వారా జియో మరోసాలి వెల్లడించింది.
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, ఏఆర్, వీఆర్, బిగ్ డేటా లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను, సామర్థ్యాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
    ఇప్పటికే సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, ఆల్ఫాబెట్‌కు చెందిన వెరిలీ, డెల్ టెక్నాలజీస్, ట్విట్టర్ లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది.
    భారతదేశంలో సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ మొదటి పెట్టుబడి ఇది.
    ఏప్రిల్ 22న ఫేస్‌బుక్ ప్రకటించిన డీల్ కన్నా ఇది 12.5 శాతం ప్రీమియంలో ఉంది.
    జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ 9.99 శాతం అంటే రూ.43,574 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

    ఇవి కూడా చదవండి:

    JioMeet: జియో మీట్ వచ్చేసింది... వీడియో కాల్స్ చేయండి ఇలా

    Personal Loans: గుడ్ న్యూస్... కస్టమర్లకు కోవిడ్ 19 లోన్స్ ఇస్తున్న బ్యాంకులు

    Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Jio, Mukesh Ambani, Reliance Jio, RIL

    తదుపరి వార్తలు