హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Disney+Hotstar: డిస్నీ+ హాస్ట్ స్టార్ వినియోగదారులకు షాక్.. ఇక ఆ కంటెంట్ ఉండదు.. వివరాలివే

Disney+Hotstar: డిస్నీ+ హాస్ట్ స్టార్ వినియోగదారులకు షాక్.. ఇక ఆ కంటెంట్ ఉండదు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హాలీవుడ్ సినిమాలు అందించే HBO కంటెంట్ ను మార్చి 31 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి, Disney + Hotstar ట్వీట్ చేసింది, "మార్చి 31 నుండి, HBO షోలు ఇకపై Disney + Hotstarలో అందుబాటులో ఉండవని తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

డిస్నీ+ హాస్ట్ స్టార్ (Disney+Hotstar) వినియోగదారులకు ఓ బ్యాడ్ న్యూస్. ఇప్పటికే ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఐపీఎల్ ప్లాట్ ఫామ్ ప్రసరాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా హాలీవుడ్ సినిమాలు అందించే HBO కంటెంట్ ను మార్చి 31 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి, Disney + Hotstar ట్వీట్ చేసింది, "మార్చి 31 నుండి, HBO షోలు ఇకపై Disney + Hotstarలో అందుబాటులో ఉండవని తెలిపింది. ఇప్పటికే 10 వేల భాషల్లో లక్ష గంటలకు పైగా అందుబాటులో ఉన్న టీవీ షోలు, ప్రధాన స్పోర్ట్స్ ఈవెంట్స్, సినిమాలను చూసి ఆనందించవచ్చని హాట్ స్టార్ ట్వీట్ చేసింది. HBOలో ప్రసారం అయ్యే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కు ఇండియాలో భారీగా అభిమానులు ఉన్నారు. ఈ ప్రకటన తర్వాత డిస్నీ + హాట్‌స్టార్ చందాదారులు తమ అభిమాన OTT ప్లాట్‌ఫారమ్‌పై చాలా కోపంగా ఉన్నారు. చాలా మంది వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని కంపెనీని సోషల్ మీడియా ఖాతా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.

చాలా సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌, HBO మధ్య ఉన్న డీల్ కొనసాగుతూ వస్తోంది. ఆ ఒప్పందం కారణంగా HBO నెట్ వర్క్‌ కంటెంట్‌ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ప్రతీ సంవత్సరం కూడా ఒప్పందాన్ని రెన్యూవల్‌ చేసుకుంటూ కంటెంట్‌ను కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి ఆ ఒప్పందం రెన్యూవల్‌ కాలేదు. దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఉండే HBO కంటెంట్‌ ను పూర్తిగా తొలగిస్తున్నారు.

First published:

Tags: Disney+ Hotstar, Ott