హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

CatGPT: చాట్‌జీపీటీని పోలిన ఏఐ చాట్‌బాట్.. ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షిస్తోన్న క్యాట్‌జీపీటీ

CatGPT: చాట్‌జీపీటీని పోలిన ఏఐ చాట్‌బాట్.. ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షిస్తోన్న క్యాట్‌జీపీటీ

CatGPT: చాట్‌జీపీటీని పోలిన ఏఐ చాట్‌బాట్.. ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షిస్తోన్న క్యాట్‌జీపీటీ

CatGPT: చాట్‌జీపీటీని పోలిన ఏఐ చాట్‌బాట్.. ఇంటర్నెట్ యూజర్లను ఆకర్షిస్తోన్న క్యాట్‌జీపీటీ

CatGPT: మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ చాట్‌బాట్‌లను తీసుకొచ్చాయి. ‘బార్డ్’ అనే చాట్‌బాట్‌ని గూగుల్ ఇంట్రడ్యూస్ చేయగా, ఓపెన్ ఏఐ సంస్థ ‘చాట్‌‌జీపీటీ’(ChatGPT)ని అందుబాటులోకి తెచ్చింది. అయితే, తాజాగా క్యాట్‌జీపీటీ(CatGPT) అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త విప్లవం నడుస్తోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏఐ చాట్‌బాట్‌లను తీసుకొచ్చాయి. ‘బార్డ్’ అనే చాట్‌బాట్‌ని గూగుల్ ఇంట్రడ్యూస్ చేయగా, ఓపెన్ ఏఐ సంస్థ ‘చాట్‌‌జీపీటీ’(ChatGPT)ని అందుబాటులోకి తెచ్చింది. అయితే, తాజాగా క్యాట్‌జీపీటీ(CatGPT) అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది. అచ్చం చాట్‌జీపీటీ ల్యాండింగ్ పేజీని ఈ క్యాట్‌జీపీటీ పోలి ఉండటం గమనార్హం.

* పిల్లుల గురించి చాట్‌బాట్

క్యాట్‌జీపీటీ ఏఐ చాట్‌బాట్ పిల్లుల గురించి వివరిస్తోంది. పిల్లి జాతుల గురించిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తోంది. లింక్‌ను క్లిక్ చేయగానే హోం పేజీలో క్యాట్‌జీపీటీ చాట్‌బాట్ అందించే సర్వీసుల గురించి చూపిస్తోంది. ఈ చాట్‌బాట్‌ని ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చో కొన్ని ఉదాహరణలను అందులో పొందుపర్చింది. అదే విధంగా కేపెబిలిటీస్, లిమిటేషన్స్ గురించి కూడా ఈ చాట్‌బాట్ వివరిస్తోంది. పిల్లులపై విస్తృత అవగాహన కల్పించడం, మద్దతు కూడగట్టడమే తమ లక్ష్యమని హోంపేజీలోని బాటమ్ లైన్‌లో రాసి ఉంది.

* ఒకటే సమాధానం

చాట్‌జీపీటీ మాదిరిలా ఇది పరీక్షలేమీ పాస్ అవలేదు. కానీ, అడిగిన ప్రశ్నకు వెంటనే రెస్పాండ్ అవుతోంది. అయితే, ఏమడిగినా ఒకే తరహా సమాధానం ఇస్తోంది. ఏ ప్రశ్న వేసినా ‘మియావ్ మియావ్’ అంటూ నాలుగైదు లైన్ల సమాధానాన్ని చెబుతోంది. పైగా, వివిధ వేరియేషన్స్ కలిగిన క్యాట్ GIF ఫైల్స్‌‌ని డిస్‌ప్లే చేస్తుంది. పిల్లి నీళ్లు తాగుతున్నట్లు, సొమ్మసిల్లి పడిపోయినట్లు, కాళ్లను నేలకు రుద్దుతున్నట్లు ఉన్న GIFలను ప్రతి సమాధానంతో పాటు చూపిస్తోంది.

ఇది కూడా చదవండి : ఐపీఎల్-2023 అఫిషియల్ పార్టనర్‌గా టియాగో ఈవీ.. కారుకు బాల్ తగిలితే రూ. 5 లక్షలు!

* హోం పేజీలో ఇలా..

పిల్లులకు సంబంధించి కొన్ని ఉదాహరణలు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. క్వాంటం మెకానిక్స్‌ని ఉపయోగించి పిల్లులు ఎలా వేటాడుతాయి? పిల్లుల 10వ పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి ఏమైనా క్రియేటివ్ ఐడియాలు ఉన్నాయా? క్యాట్ స్క్రిప్ట్‌ని ఉపయోగించి HTTP రిక్వెస్ట్‌లను క్యాట్స్ ఎలా చేస్తాయి? వంటి ఉదాహరణలు హోం పేజీలో ఉన్నాయి. ఇక లిమిటేషన్స్‌లో ‘అప్పుడప్పుడూ ఒక టాయ్ ఎలుకను జనరేట్ చేయగలదు’, ‘అప్పుడప్పుడూ ఫర్బాల్స్‌ని ప్రొడ్యూస్ చేయగలదు’, ‘ప్రపంచం గురించి పరిమిత నాలెడ్జ్, 2021 తర్వాత క్యాట్ వీడియోలు’ అని ఉన్నాయి. వీటితో పాటు కేపెబిలిటీస్ సెక్షన్‌లో ‘ట్రైన్‌డ్ టు డిక్లైన్ వాక్స్ అండ్ బాత్ రిక్వెస్ట్స్’, ‘రిమెంబర్ వేర్ యూజర్ బరీయ్‌డ్ ఆల్ ద ట్రీట్స్’ వంటి వాటిని వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

* మరొక చాట్‌బాట్

క్యాట్‌జీపీటీ. డీవోజీ(CatGPT.dog) పేరుతో మరో చాట్‌బాట్ కనిపిస్తోంది. ఈ చాట్‌బాట్ వెరైటీ సమాధానాలను ఇస్తోంది. ఇంగ్లిష్‌లో ‘హాయ్’ అని టైప్ చేస్తే.. ‘మియావ్.. మియావ్.. హలో దేర్ హౌ కెన్ ఐ అసిస్ట్ యు?’(మీకు ఏ విధంగా సహాయపడగలను) అంటూ రెస్పాన్స్ ఇస్తోంది. దీంతో ఇంటర్నెట్ యూజర్లు వీటితో కాసేపు కాలక్షేపం చేస్తున్నారు.

* చైనా కంపెనీ సైతం

టెక్నాలజీ రంగంలో మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ , ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్‌లు చాట్‌బాట్‌లను తీసుకొచ్చాయి. చైనీస్ దిగ్గజం బైడు కూడా ఏఐ చాట్‌బాట్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

First published:

Tags: Chatgpt, Latest Technology, Tech news

ఉత్తమ కథలు