ISRO : సూర్యుడే ఇస్రో టార్గెట్... ఆదిత్య మిషన్ రెడీ... పూర్తి వివరాలు

Aditya-L1 : చంద్రయాన్-2 పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వకపోయినా... నిరాశ చెందకుండా నెక్ట్స్ ప్రాజెక్టుకి రెడీ అయిపోతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆ ప్రాజెక్టు పేరే ఆదిత్య-L1. వచ్చే సంవత్సరం రాకెట్ ప్రయోగం జరగబోతోంది. ఆ ప్రాజెక్టు వివరాలు ఫటాఫట్ తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 9:20 AM IST
ISRO : సూర్యుడే ఇస్రో టార్గెట్... ఆదిత్య మిషన్ రెడీ... పూర్తి వివరాలు
ISRO : సూర్యుడే ఇస్రో టార్గెట్... ఆదిత్య మిషన్ రెడీ... పూర్తి వివరాలు (File - Source - NASA)
  • Share this:
ISRO Aditya-L1 : తెల్లారి లేస్తే... మనందరికీ కనిపించే సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల వేడి ఉంటుందని మనకు తెలుసు. సూర్యుడి మధ్యలో 11వేల డిగ్రీల వేడి ఉంటుందని కూడా తెలుసు. ఐతే... సూర్యుడిపై అక్కడక్కడా మచ్చలున్నాయి. వాటిలో కొన్ని భూమి కంటే చాలా పెద్దవి. అవి ఎందుకున్నాయి? అక్కడ ఎందుకు మంట లేదు? అసలు అక్కడ ఏముంది? ఇలాంటి డౌట్లు నాసాతోపాటూ... ఇస్రో శాస్త్రవేత్తలకూ ఉన్నాయి. అంటే... దీనర్థం సూర్యుడి గురించి మనకు తెలిసించి చాలా తక్కువే. తెలుసుకోవాల్సిందే అనుకుంటూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో (ISRO)... 2020లో సూర్యుడి చెంతకు రాకెట్‌ను పంపబోతోంది. ఇందులో 400 కేజీల ఆదిత్య-L1 అనే శాటిలైట్ ఉంటుంది.

భూమి నుంచీ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో... హాలో కక్ష్యలో శాటిలైట్‌ను ఉంచబోతోంది ఇస్రో. ఆ కక్ష్యలో ఉంచడం వల్ల... అది సూర్యుణ్ని నిరంతరం గమనిస్తూ ఉండగలదు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి ఏవి వచ్చినా... ఆ సమయంలో కూడా ఆ శాటిలైట్ సూర్యుణ్ని చూడగలదు. శాటిలైట్ ప్రధాన లక్ష్యం... సూర్యుడి బాహ్య పొర (కొరొనా)ని పరిశోధించడం. అసలు కొరొనా ఎందుకు అంత వేడిగా ఉంటోంది అన్న విషయాన్ని ఇస్రో... ఈ శాటిలైట్ ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది.

ఆదిత్య-L1 శాటిలైట్‌లో ఉండే పరికరాలు :
- విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ (VELC)
- సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)
- ఆదిత్య సోలార్ విండ్ పార్టికిల్ ఎక్స్‌పెరిమెంట్ (ASPEX)
- ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య (PAPA)- సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ (SoLEXS)
- హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ X-రే స్పెక్ట్రోమీటర్ (HEL1OS)
- మాగ్నెటోమీటర్

పై పరికరాలు ఎలా పనిచేస్తాయో, ఏం చేస్తాయో... అంత వివరంగా మనకు తెలియాల్సిన అవసరం లేదు. అవన్నీ శాస్త్రవేత్తలు చూసుకుంటారు. మొత్తంగా ఆదిత్య-L1 ద్వారా సూర్యుడికి సంబంధించి ఇప్పటివరకూ తెలియని కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నది స్పష్టమైన విషయం. ఆదిత్యను ఎప్పుడు ప్రయోగించేదీ త్వరలో తేదీ ప్రకటించనుంది. ఇది సక్సెస్ అయిన తర్వాత... సూర్యుడిపై భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చెయ్యనుంది ఇస్రో.
Published by: Krishna Kumar N
First published: September 20, 2019, 9:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading