హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Vodafone Idea: వొడాఫోన్ ఐడియా యూజర్లకు షాక్... ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి (ప్రతీకాత్మక చిత్రం)

Vodafone Idea Prepaid Plans | వొడాఫోన్ ఐడియా (Vi) కూడా ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరల్ని పెంచింది. నవంబర్ 25 నుంచి కొత్త ప్లాన్స్ అమలులోకి వస్తాయి. ఏ ప్లాన్‌పై ఎంత పెరిగిందో తెలుసుకోండి.

ఎయిర్‌టెల్ దారిలోనే వొడాఫోన్ ఐడియా (Vi) కూడా అడుగులు వేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరల్ని ఎయిర్‌టెల్ (Airtel) పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా (Vi) కూడా టారిఫ్ పెంచుతున్నట్టు ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్ల (Prepaid Plans) ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం రూ.79 నుంచి రూ.2,399 వరకు ఉన్న అన్ని ప్లాన్లను సవరించింది వొడాఫోన్ ఐడియా. వీటి ధరల్ని 25 శాతం వరకు పెంచింది. ఈ కొత్త ప్లాన్లు నవంబర్ 25 నుంచి అమలులోకి వస్తాయి. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

రూ.79 ప్లాన్‌ను రూ.99 కి పెంచింది వొడాఫోన్ ఐడియా. రూ.99 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రూ.99 టాక్‌టైమ్ వస్తుంది. సెకన్‌కు ఒక పైసా చొప్పున టారిఫ్ వర్తిస్తుంది. 200 ఎంబీ డేటా లభిస్తుంది.

WhatsApp Tips: మీ వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

రూ.149 ప్లాన్‌ను రూ.179కి పెంచింది. రూ.179 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 300ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. 2జీబీ డేటా లభిస్తుంది.

రూ.219 ప్లాన్‌ను రూ.269 కి పెంచింది. రూ.269 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 1జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.249 ప్లాన్‌ను రూ.299 కి పెంచింది. రూ.299 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.299 ప్లాన్‌ను రూ.359 కి పెంచింది. రూ.359 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా వాడుకోవచ్చు.

Truecaller: ఫోన్ కాల్స్ రికార్డ్ చేయాలా? ట్రూకాలర్ యాప్‌లో చేయొచ్చు ఇలా

రూ.399 ప్లాన్‌ను రూ.479 కి పెంచింది. రూ.479 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.449 ప్లాన్‌ను రూ.539 కి పెంచింది. రూ.539 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.379 ప్లాన్‌ను రూ.459 కి పెంచింది. రూ.539 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు, 6జీబీ డేటా లభిస్తుంది.

రూ.599 ప్లాన్‌ను రూ.719 కి పెంచింది. రూ.719 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ డేటా వాడుకోవచ్చు.

WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయిన 'సెల్ఫ్​ చాట్' ఫీచర్​... మీరూ వాడుకోండి ఇలా

రూ.699 ప్లాన్‌ను రూ.839 కి పెంచింది. రూ.839 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.1499 యాన్యువల్ ప్లాన్‌ను రూ.1799 కి పెంచింది. రూ.1799 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 3600 ఎస్ఎంఎస్‌లు, 24జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.2399 యాన్యువల్ ప్లాన్‌ను రూ.2899 కి పెంచింది. రూ.2899 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ డేటా వాడుకోవచ్చు.

రూ.48 డేటా టాప్ అప్ ప్లాన్‌ను రూ.58 కి పెంచింది. రూ.58 రీఛార్జ్ చేస్తే 28 రోజులకు 3జీబీ డేటా లభిస్తుంది. రూ.98 డేటా టాప్ అప్ ప్లాన్‌ను రూ.118 కి పెంచింది. రూ.118 రీఛార్జ్ చేస్తే 28 రోజులకు 12జీబీ డేటా లభిస్తుంది. రూ.251 డేటా టాప్ అప్ ప్లాన్‌ను రూ.298 కి పెంచింది. రూ.298 రీఛార్జ్ చేస్తే 28 రోజులకు 50జీబీ డేటా లభిస్తుంది. రూ.351 డేటా టాప్ అప్ ప్లాన్‌ను రూ.418 కి పెంచింది. రూ.418 రీఛార్జ్ చేస్తే 56 రోజులకు 100జీబీ డేటా లభిస్తుంది.

First published:

Tags: Vodafone Idea

ఉత్తమ కథలు