• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • AFTER 150 YEARS GURU PURNIMA AND LUNAR ECLIPSE ARE COMING ON A SAME DAY WITH 8 HOURS GAP BA

ఆకాశంలో అద్భుతం.. 150 ఏళ్లకు ఓసారి వస్తోంది..

ఆకాశంలో అద్భుతం.. 150 ఏళ్లకు ఓసారి వస్తోంది..

చంద్రగ్రహణం

1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి.

  • Share this:
    చంద్రయాన్ 2 ప్రయోగం వాయిదాపడింది. అయితే, మంచి అవకాశాన్ని మిస్ అయ్యామే అని బాధపడొద్దు. అంతరిక్షంలో మరో అద్భుత సన్నివేశం కనిపించనుంది. ఈనెల 16న గురు పౌర్ణమి. వేదవ్యాసుని జయంతికి గుర్తుగా గురు పౌర్ణమి జరుపుకొంటారు. అయితే, ఆ తర్వాత ఎనిమిది గంటల వ్యవధిలో చంద్రగ్రహణం రాబోతోంది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే రెండు సందర్భాలు రావడం అరుదు. 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి. మళ్లీ ఇప్పుడు 150 ఏళ్ల తర్వాత అలాంటి సందర్భం వస్తుంది. 16వ తేదీ తెల్లవారుజామున 1.30 నుంచి మొదలై సాయంత్రం 4 గంటల వరకు గురుపౌర్ణమి ఘడియలు ఉన్నాయి. 17వ తేదీ తెల్లవారుజామున 12.13 గంటలకు మొదలై 5.47 వరకు చంద్రగ్రహణం ఉంది. ఈ రెండింటికి మధ్య తేడా కేవలం 8 గంటలు. మళ్లీ చంద్రగ్రహణం 2021 మేలో వస్తుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: