హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone Next: జియో ఫోన్​ నెక్స్‌ట్ ఎలా ఉంది? ఫోన్‌తో పాటు బాక్సులో ఏమేం వస్తాయి?

JioPhone Next: జియో ఫోన్​ నెక్స్‌ట్ ఎలా ఉంది? ఫోన్‌తో పాటు బాక్సులో ఏమేం వస్తాయి?

JioPhone Next: జియో ఫోన్​ నెక్స్‌ట్ ఎలా ఉంది? ఫోన్‌తో పాటు బాక్సులో ఏమేం వస్తాయి?
(Image: Soumyadip Choudhury / News18)

JioPhone Next: జియో ఫోన్​ నెక్స్‌ట్ ఎలా ఉంది? ఫోన్‌తో పాటు బాక్సులో ఏమేం వస్తాయి? (Image: Soumyadip Choudhury / News18)

JioPhone Next | స్మార్ట్‌ఫోన్ యూజర్లలో జియోఫోన్ నెక్స్‌ట్ మొబైల్ ఎలా ఉందన్న ఆసక్తి నెలకొంది. ఈ స్మార్ట్‌ఫోన్ (JioPhone Next) బాక్సులో ఏమేం వస్తాయి? ఫోన్ చూడటానికి ఎలా ఉందన్న సందేహాలు యూజర్లలో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకోండి.

భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జియో ఫోన్ నెక్ట్స్ (JioPhone Next) దీపావళి రోజు విడుదలకు సిద్ధమవుతోంది. అత్యంత చవకైన ధరకే దీన్ని లాంచ్ చేస్తుండటం గమనార్హం. మిలియన్ల మంది భారతీయులకు ఇంటర్నెట్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతో దీన్ని మార్కెట్లోకి తెస్తుంది. ఈ జియో ఫోన్ నెక్స్ట్‌ను (JioPhone Next) జూన్‌లో జరిగిన కంపెనీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ ప్రకటించారు. గూగుల్ భాగస్వామ్యంతో దీన్ని తయారు చేశారు. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫస్ట్ ఇంప్రెషన్ విడుదలైంది. ఈ ఫస్ట్ ఇంప్రెషన్ ప్రకారం, జియో ఫోన్ నెక్ట్స్ లుక్ ఎలా ఉంది? దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి? వంటి కీలక విషయాలను తెలుసుకుందాం.

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ధర విషయానికి వస్తే.. ఇది కేవలం రూ. 6,499 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. రూ. 1,999 (డౌన్ పేమెంట్) కట్టి ఈ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని 18 లేదా 24 నెలల సులభమైన ఈఎంఐ ఆప్షన్లలో చెల్లించవచ్చు. తద్వారా మీ నెలవారీ ఈఎంఐ కేవలం రూ. 300 నుంచే ప్రారంభం అవుతుంది. ఈఎంఐ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.300 చాలు

jiophone next camera, jiophone next emi, jiophone next features, jiophone next price, jiophone next sale, jiophone next specs, jiophone next unboxing, జియోఫోన్ నెక్స్‌ట్ అన్‌బాక్సింగ్, జియోఫోన్ నెక్స్‌ట్ ధర, జియోఫోన్ నెక్స్‌ట్ ఫీచర్స్, జియోఫోన్ నెక్స్‌ట్ ఫోటోస్, జియోఫోన్ నెక్స్‌ట్ బ్యాటరీ
జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ (Image: Soumyadip Choudhury / News18)

బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్, యూఎస్‌బీ కేబుల్


జియో ఫోన్ నెక్ట్స్ లుక్ అచ్చం ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను పోలి ఉంది. మార్కెట్లో లభిస్తున్న ఇతర బడ్జెట్ ఫోన్లలోని కీలక సమస్యలకు చెక్ పెట్టేలా ఆకర్షణీయమైన ఫీచర్లను ఇందులో అందించారు. దీనిలో 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు ఆండ్రాయడ్ గో ఎడిషన్ వంటివి చేర్చారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ QM215 చిప్‌సెట్‌ను సంస్థ అందించింది. ఇది ఆండ్రాయిడ్ గో ఆధారిత ప్రగతి ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్-సిమ్ నానో-సిమ్ కార్డ్‌ సపోర్డ్ను కలిగి ఉంది. అయితే, స్మార్ట్‌ఫోన్‌ బాక్స్‌తో పాటు ఎటువంటి ఇయర్‌ఫోన్లను అందించలేదు. కానీ బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్, యూఎస్బీ మైక్రో-బి కేబుల్ వంటివి చేర్చింది.

WhatsApp: అలర్ట్... ఈరోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

jiophone next camera, jiophone next emi, jiophone next features, jiophone next price, jiophone next sale, jiophone next specs, jiophone next unboxing, జియోఫోన్ నెక్స్‌ట్ అన్‌బాక్సింగ్, జియోఫోన్ నెక్స్‌ట్ ధర, జియోఫోన్ నెక్స్‌ట్ ఫీచర్స్, జియోఫోన్ నెక్స్‌ట్ ఫోటోస్, జియోఫోన్ నెక్స్‌ట్ బ్యాటరీ
జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ (Image: Soumyadip Choudhury / News18)

ప్రగతి ఓఎస్‌తో జియో ఫోన్ నెక్ట్స్


ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కామ్ చిప్‌సెట్‌ను రిలయన్స్ అందించింది. మరోవైపు, వాయిస్ అసిసెంట్, రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్ ఫీచర్లను చేర్చింది. దీని వెనుక వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ప్రీలోడెడ్ గూగుల్, జియో యాప్స్ వంటివి అందించింది. పొట్రెంట్ మోడ్, సరౌండింగ్ ది డిస్‌ప్లే ను కూడా చేర్చింది. జియో ఫోన్ నెక్స్ట్‌లో కొన్ని ప్రీలోడెడ్ యాప్‌లను అందించింది. సాధారణ గూగుల్ యాప్‌లతో పాటు, జియో సినిమా, జియో గేమ్స్, జియో మార్ట్, జియో మీట్, జియో సావన్, జియో టీవీ, మై జియో వంటి జియో యాప్స్‌ను అందించింది. వీటితో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్రీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఈ ఫోన్ 3500mAh బ్యాటరీతో వస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Google, Jio, JioPhone Next, Mobile News, Mobiles, Reliance Jio, Smartphone

ఉత్తమ కథలు