Home /News /technology /

AFFORDABLE 110CC BIKES WITH ADDED SAFETY FEATURES IN INDIA HERE IS THE DETAILS SU GH

Affordable Bikes: సరికొత్త సెఫ్టీ ఫీచర్స్‌తో 110cc బైకులు.. ఊరిస్తున్న టూ వీలర్ మోడల్స్..

;ప్రతీకాత్మక చిత్రం

;ప్రతీకాత్మక చిత్రం

మనదేశంలో టూ వీలర్ మార్కెట్ బ్రహ్మాండంగా పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేనంత సేల్స్ నమోదు చేసుకుంటూ దూసుకుపోతుంది.

మనదేశంలో టూ వీలర్ మార్కెట్ బ్రహ్మాండంగా పుంజుకుంది. గతంలో ఎన్నడూ లేనంత సేల్స్ నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్న టూ వీలర్స్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో సూపర్ మోడల్స్, అఫోర్డబుల్ రేట్స్, సరికొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన మోడల్స్ తో కూడిన అత్యాధునిక బైకులు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. సామాన్యులంతా టూ వీలర్లపై అత్యధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో ఏడాదంతా బైకుల మార్కెట్ కళకళలాడుతోంది. ఇక 100-110 సీసీ బైకులే ఇండియాలో హాట్ కేక్స్ కనుక వీటికి అదనపు హంగులను చేర్చటంపై కంపెనీలు ఎక్కువ శ్రద్ధపెడుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉన్న ప్రస్తుత తరుణంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకంటే వ్యక్తిగత వాహనంపై వెళ్లటానికే మనవారు ప్రాధాన్యత ఇస్తున్నందున టూ వీలర్ సేల్స్ మరింత జోరందుకున్నాయి. సేఫ్టీకి పెద్ద పీటవేస్తున్న కంపెనీలు ఇందుకు అనుగుణంగా డిస్క్ బ్రేకులు, కంబైన్డ్ బ్రేక్ సిస్టం (CBS) వంటివి అన్ని బైకుల్లోనూ అందుబాటులోకి తెస్తున్నాయి. డిస్కుబ్రేకులున్న మోటర్ సైకిళ్లకు గిరాకీ పెరుగుతోంది. డిస్క్ బ్రేకును చక్కగా వాడగలిగితే ప్రమాదాలబారిన పడకుండా బైకర్లు తమ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చన్నమాట. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బైకుల మోడల్స్ లో .. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్న అత్యంత అఫోర్డబుల్ గా ఉన్న మోటర్ సైకిళ్లలో బైక్ గురూలు సూచిస్తున్నవి ఏంటో మీరే చెక్ చేయండి..

Bajaj Platina 110 H-Gear
సరసమైన ధరల్లో వివిధ మోడళ్ల బైకులను రిలీజ్ చేయటంలో బజాజ్ తో ఎవరూ పోటీ పడలేరు. అన్ని బడ్జెట్లకు అనుగుణమైన మోడల్స్, కలర్ కాంబోలతో బజాజ్ మోటర్ సైకిళ్లు ఊరించేలా ఉంటాయి. 2019 నుంచి H-Gear వేరియంట్ ను అందుబాటులోకి తెచ్చిన బజాజ్ ఫైవ్ గేర్ బళ్లను మనకు చేరువ చేసింది. ఎక్కువ మైలేజ్ ఇస్తాయన్న పేరు సంపాదించుకున్న బజాజ్ మోడల్స్ లో ప్లాటినా బైక్ చాలా మార్కెట్లో బాగా క్లిక్ అయింది. ఫ్రంట్ డిస్క్ తో ఉన్న ఈ బజాజ్ ప్లాటినా 110 సీసీ ధర కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. ప్రస్తుతం మనకు ఇండియాలో దీని ఎక్స్ షోరూం ధర 64,301 రూపాయలు.

TVS Radeon
TVS Radeon కమ్యూటర్ ఆఫ్ ది ఇయర్ (COTY ) వర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. COTY ఎడిషన్ లో డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంది. దీని ఎక్స్ షోరూం ధర 68,037 రూపాయలుగా ఉంది. ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టంతో ఉన్న ఈ బైక్ 2018లో లాంచ్ కాగా అతి తక్కువ టైమ్ లోనే మూడు లక్షల మైల్ స్టోన్ దాటి హాట్ కేకులో అమ్ముడుబోతోంది. బీఎస్ 6 కాంప్లియంట్, డ్యూరాలైఫ్ ఇంజిన్ తో ఇది ఆకట్టుకునే మోడల్ గా ఉంది.

Hero Splendor i-Smart
మనదేశంలో లాంచ్ అయిన మొట్టమొదటి బీఎస్ 6 బైక్ గా Hero Splendor i-Smart పేరుగాంచింది. ప్రీమియం కేటగెరీలోనే నిలిచిన హీరో ప్యాషన్ ప్రో మోటర్ సైకిల్ అంటే అన్ని వర్గాల వారికి ఫేవరెట్ గా నిలిచింది. ఇక సరసమైన ధరలోనే నిలవటం దీని మరో ప్రత్యేకత .. దీని ఎక్స్ షోరూం ధర 68,850 రూపాయలు మాత్రమే కావటం హైలైట్.

Hero passion Pro
2020లో మోటర్ సైకిల్ మార్కెట్లో ఆల్ న్యూ బైక్ గా Hero passion Pro లాంచ్ అయింది. ఆటో సెయిల్, i3Sవంటి ఆకర్షణీయమైన ఫీచర్లు దీని సొంతం. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వర్షన్ తో ఉన్న Hero passion Proమోడల్ ఎక్స్ షోరూం ధర 69,600 రూపాయలు. మనం చెప్పుకుంటున్న లిస్ట్ లో ఇది అత్యధిక ధర ఉన్న రెండవ బైక్ ఇదే.

Honda Livo
హోండా Honda ప్రీమియం వర్షన్ గా Honda Livo అందుబాటులోకి వచ్చింది. బీఎస్ 6 ఫీచర్ తో లాంచ్ అయిన Honda Livoలో బోలెడన్ని అప్ డేట్స్ కూడా వచ్చాయి. కాస్ట్లీ 110సీసీ బైక్ డిస్క్ బ్రేక్ వర్షన్ ఎక్స్ షోరూం ధర 75,748 రూపాయలుగా ఉంది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Bikes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు