మీరు సెల్ఫీలు ఎక్కువగా దిగుతుంటారా? మొబైల్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? ఫోటోలు తీయాలన్న ఆసక్తి ఉంటేనే సరిపోదు. ఫోన్‌లో మంచి కెమెరాతో పాటు మంచి కెమెరా యాప్ కూడా ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే యాప్ మాత్రమే కాదు... యాప్ స్టోర్‌లో కెమెరా యాప్స్ చాలా ఉంటాయి. అలాంటిదే అడోబ్ ఫోటోషాప్ కెమెరా యాప్. ఈ యాప్ 2019 నవంబర్‌లో లాంఛైంది. కానీ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఉచితంగా ఈ యాప్ వాడుకోవచ్చు. అడోబ్ ఫోటోషాప్ కెమెరా యాప్‌లో బ్లూ స్కైస్, రివరీ ఫిల్టర్స్ లాంటి క్రియేటీవ్ లెన్సెస్ ఉంటాయి. యూజర్లు ఈ ఫిల్టర్లు, లెన్సులను తమకు తగ్గట్టుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఫిల్టర్లతో బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ చేయొచ్చు. పాప్ ఆర్ట్, స్పెక్ట్రమ్, ఫుడ్, కలర్ ఈకో లాంటి ఎఫెక్ట్స్ ఇవ్వొచ్చు. 'బిల్లీ ఈలిష్' ఫిల్టర్‌తో వేర్వేరు కలర్స్ ట్రై చేయొచ్చు.
ఈ కెమెరా యాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మీరు మీ ఫోటోను ఎడిట్ చేయడానికి, ఫినిషింగ్ టచెస్ ఇవ్వడానికి ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ అవసరం లేదు. ఫోన్‌లోనే మీకు కావాల్సినట్టుగా ఫోటోను ఎడిట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోను ఎడిట్ చేయొచ్చు. కావాల్సిన ఫిల్టర్ అప్లై చేయొచ్చు. ఇప్పటికే వేర్వేరు కెమెరా యాప్స్, ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్ ట్రై చేసి మీకు బోర్ కొట్టినట్టైతే అడోబ్ ఫోటోషాప్ కెమెరా యాప్ ఓసారి ట్రై చేసి చూడండి.
ఇవి కూడా చదవండి:
Tata Sky: టాటా స్కై యూజర్లకు శుభవార్త... తగ్గనున్న ప్యాక్ ధరలు
Samsung Tab: సాంసంగ్ నుంచి కొత్త ట్యాబ్ వచ్చేసింది... ధర ఎంతంటే
Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Android 10, Information Technology, Ios, Mobile App, Playstore, Technology