చీకట్లో మెరిసే షూస్.. లాంచ్ చేసిన ‘అడిడాస్’..

adidas shoes | ఫేమస్ కంపెనీ అడిడాస్ సరికొత్త ‘షూ’ని లాంచ్ చేసింది. లైటింగ్ షూ పేరుతో వస్తున్న ఈ ఫుట్‌వేర్ చీకట్లో మెరుస్తుంటాయి.

news18-telugu
Updated: April 20, 2019, 5:05 PM IST
చీకట్లో మెరిసే షూస్.. లాంచ్ చేసిన ‘అడిడాస్’..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 20, 2019, 5:05 PM IST
ఉదయాన్నే లేచి జాగింగ్, వాకింగ్ చేసేవారు ఖచ్చితంగా షూ వాడతారు. అయితే, మరీ చీకటిగా ఉంటున్న సమయంలో జాగింగ్ చేసినప్పుడు వారు కనిపించక ప్రమాదాలు జరిగుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకే సరికొత్తగా లైటింగ్ షూని లాంచ్ చేసింది అడిడాస్ కంపెనీ. లైట్ వెయిట్‌తో అట్రాక్టింగ్ లుక్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ షూ.. యూత్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవి వేసుకున్నప్పటికీ పాదాలకు గాలి ఆడడం ఇందో మరో స్పెషాలిటీ.

అసలు ఈ షూ ఎలా మెరుస్తాయంటే.. వెలుగు ప్రాంతంలోని కాంతిని గ్రహించి చీకట్లో మెరుస్తుంటాయి. దీని ద్వారా.. చీకట్లో వీటిని వేసుకుంటే దూరంగా ఉన్నవారికి కన్పిస్తుంది. నిజానికి ఇలాంటి షూ.. 1980లోనే అడిడాస్ సోల్‌లో బ్యాటరీ పెట్టి తయారు చేసింది. అయితే.. ఇప్పుడు మరింత క్రియేటివిటీగా లైటింగ్ షూస్ ‘అడిడాస్ నైట్ జాగర్స్’ పేరిట వచ్చేశాయి. ఈ షూలో లేస్, పట్టీలో సోల్‌లోని కొన్ని ప్రదేశాల్లో రాత్రుల్లో మెరుస్తుంటాయి.

లేటెస్ట్‌గా డిజైన్ అయిన ఈ మూవీ ఏప్రిల్ 11న భారత్ మార్కెట్లో అడుగుపెట్టింది.. అప్పట్నుంచీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...