Home /News /technology /

ACT Fibernet: హైదరాబాద్​ యాక్ట్​ ఫైబర్​నెట్ యూజర్లకు గుడ్​న్యూస్​.. ఉచితంగా డేటా స్పీడ్​, లిమిట్​ పెంచుకునే ఛాన్స్​

ACT Fibernet: హైదరాబాద్​ యాక్ట్​ ఫైబర్​నెట్ యూజర్లకు గుడ్​న్యూస్​.. ఉచితంగా డేటా స్పీడ్​, లిమిట్​ పెంచుకునే ఛాన్స్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ACT Fibernet: యాక్ట్ ఫైబర్​నెట్​ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్​ కింద ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా డేటా స్పీడ్​, లిమిట్​ అప్​గ్రేడ్​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ వివ‌రాలు తెలుసుకోండి.

నేటి టెక్​ యుగంలో అంతటా ఇంటర్నెట్ (Internet)​ హవా నడుస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు ఇంటర్నెట్​ చుట్టే తిరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్​లేని ప్రస్తుత ప్రపంచాన్ని ఊహించుకోవడమే కష్టంగా మారింది. కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. కరోనా (Corona) ప్రేరేపిత లాక్​డౌన్​ కారణంగా వర్క్​ ఫ్రమ్​ హోమ్​, ఆన్​లైన్​ క్లాసెస్ (Online Classes)​ కల్చర్ పెరగడంతో ప్రతి ఇంట్లో ఇంటర్నెట్​ కనెక్షన్ తప్పనిసరిగా మారింది.​ అందుకే, దేశంలో అనేక ఇంటర్నెట్ సర్వీస్​ ప్రొవైడర్లు​ (Service Providers) పుట్టుకొచ్చాయి. ఇవి కేవలం నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో వరుసగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే నంబర్​ 1 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (Inter Service Provider) ​గా కొనసాగుతోన్న యాక్ట్ ఫైబర్​నెట్​ (Act Fibernet) తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

ఈ ఆఫర్​ కింద ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా డేటా స్పీడ్ (Data Speed)​, లిమిట్​ అప్​గ్రేడ్​ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ అవకాశం కేవలం హైదరాబాద్​లోని యాక్ట్ ఫైబర్​ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

Female education: బ‌డిబాట ప‌డుతున్న బాలిక‌లు.. పాఠశాలల్లో పెరిగిన విద్యార్థినుల‌ సంఖ్య‌!


ఈ స్పీడ్​ బూస్ట్​ ఆఫర్​ గురించి తెలిసేలా తన కస్టమర్లందరికీ ఈ–మెయిల్ (E-Mail)​ ద్వారా సమాచారమిస్తోంది. హైదరాబాద్​ పరిధిలోని యాక్ట్​ ఫైబర్​ పాత, కొత్త కస్టమర్లు (New Customers)ఈ ఆఫర్​ను ఉపయోగించుకోవాలని కోరుతోంది.

“కరోనా మహమ్మారి తర్వాత ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అందుకే, మా కస్టమర్లు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ ఇంటర్నెట్ ఎక్స్​పీరియన్స్​ కోసం ఉచితంగా డేటా స్పీడ్​, లిమిట్​ పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. యాక్ట్​ ఫైబర్‌నెట్ హైదరాబాద్ (Hyderabad) కస్టమర్లు తమ ప్రస్తుత ప్లాన్‌ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అప్​గ్రేడ్​ చేసుకోవచ్చు.” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Infinix Note 11 series: ఇన్ఫినిక్స్ నోట్ 11 సిరీస్​ నుంచి ఒకేసారి రెండు స్మార్ట్​ఫోన్‌లు లాంచ్​.. ధర, ఫీచ‌ర్స్ వివ‌రాలు


ఉచితంగా అదనపు డేటా, స్పీడ్​ అప్​గ్రేడ్​..

ఆఫర్ విషయానికి వస్తే.. యాక్ట్​ మాక్స్​ 500 ప్లాన్​లో ఉన్న కస్టమర్లకు గతంలో నెలకు 500 జీబీ లభిస్తుండగా.. ఇప్పుడు ఈ డేటా లిమిట్​ను 1,000 జీబీకి పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. యాక్ట్​ మాక్స్​ 700 , యాక్ట్ మాక్స్ 1075 రెండు ప్లాన్ల కింద వరుసగా 75Mbps, 150Mbps వేగంతో 1000 జీబీ, 2000 జీబీ డేటా లభిస్తుండగా.. ఇప్పుడు అన్​లిమిటెడ్​ డేటా (Unlimited Data) ను పొందే అవకాశం కల్పిస్తోంది. 2021 ఏప్రిల్​, మే నెలల్లో ఇన్​మొబి పల్స్​ నిర్వహించిన సర్వేలో యాక్ట్ ఫైబర్‌నెట్ హైదరాబాద్​లో నంబర్​ 1 బ్రాడ్​బ్యాండ్​ సర్వీస్​ ప్రొవైడర్​గా నిలిచింది. యాక్ట్​ ఫైబర్​ ప్రస్తుతం 19 నగరాల్లో సర్వీసులు అందిస్తోంది. ఇది మొత్తం 1.8 మిలియన్ల కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది.
First published:

Tags: Hyderabad, Internet, Latest Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు