Home /News /technology /

ACER SMART TV WITH HUGE DISPLAY IF YOU SEE THE PRICE YOU WILL BUY IT IMMEDIATELY UMG GH

Acer TVs: భారీ డిస్ ప్లే తో అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ధర చూస్తే వెంటనే కొనేస్తారు !

 భారీ డిస్ ప్లే తో అదిరిపోయే ఏసర్ స్మార్ట్ టీవీ .. ధర చూస్తే వెంటనే కొనేస్తారు

భారీ డిస్ ప్లే తో అదిరిపోయే ఏసర్ స్మార్ట్ టీవీ .. ధర చూస్తే వెంటనే కొనేస్తారు

ఏసర్(Acer) తాజాగా ఇండియన్ మార్కెట్లోకి నాలుగు 4K ఆండ్రాయిడ్ టీవీలను (4K Android TVs) విడుదల చేసింది. Acer I-సిరీస్ టీవీలు 32, 43, 50, 55 అంగుళాల వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను అందిస్తాయి.

ఇంకా చదవండి ...
టెక్ బ్రాండ్ ఏసర్ (Acer) నుంచి వచ్చిన ల్యాప్‌టాప్, పీసీలు చాలావరకు సక్సెస్ అయ్యాయి. గ్లోబల్ మార్కెట్లోకి వివిధ రకాల ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన సంస్థ ఇప్పటికే ఫేమస్ అయింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు స్మార్ట్ టీవీల తయారీపై దృష్టి సారించింది. ఏసర్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి నాలుగు 4K ఆండ్రాయిడ్ టీవీలను (4K Android TVs) విడుదల చేసింది. Acer I-సిరీస్ టీవీలు 32, 43, 50, 55 అంగుళాల వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను అందిస్తాయి. కొత్త ఏసర్ ఐ-సిరీస్ లైనప్‌ ధరలు రూ. 14,999 ($188) నుంచి ప్రారంభమవుతాయి. తాజాగా లాంచ్ అయిన డివైజ్‌లలో హై ఎండ్ వేరియంట్ ధర రూ.38వేల వరకు ఉంది. టీవీ సైజును బట్టి ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మారుతున్నాయి.

 డిజైన్ ఎలా ఉంది?
కొత్త ఏసర్ 4K ఆండ్రాయిడ్ TVలు ఫ్రేమ్‌లెస్ డిజైన్, ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. HDR 10+ సపోర్ట్‌తో టీవీ క్వాలిటీ ఇమేజ్‌ను అందిస్తుంది. సూపర్ బ్రైట్‌నెస్, 4K అప్‌స్కేలింగ్, ఇతర ఇన్‌బిల్ట్ ఫీచర్‌లతో ఇవి బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఏసర్ TVలు 1 బిలియన్ కంటే ఎక్కువ కలర్స్‌ డిస్‌ప్లే చేయగలవు. కంటి సంరక్షణ కోసం బ్లూ లైట్ రిడక్షన్ ఫీచర్ కూడా వీటిలో ఉంటుంది. 32-అంగుళాల మోడల్ హై-డెఫినిషన్ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉండగా, మిగిలిన మూడు అల్ట్రా హై-డెఫినిషన్ డిస్‌ప్లే రిజల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. ప్రతి మోడల్ 30W సౌండ్ సిస్టమ్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో పాటు డ్యుయల్ Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తున్నాయి.

ఇదీ చదవండి: Technical Bugs: వామ్మో.. ఆ అమెరికా కంపెనీ సాఫ్ట్ వేర్ లో బగ్.. రెచ్చిపోతున్న హ్యాకర్లు !


ఏసర్ టీవీల్లోని ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్.. నెట్‌ఫ్లిక్స్(Netflix), ప్రైమ్ వీడియో, గూగుల్ ప్లే, ఫాస్ట్‌కాస్ట్, డిస్నీ+హాట్‌స్టార్(Hot Star), స్మార్ట్ ప్లేయర్‌ సహా అనేక అప్లికేషన్‌లకు యాక్సెస్ అందిస్తుంది. ప్యాకేజీ వాయిస్ అసిస్టెంట్ ఫంక్షనాలిటీ కోసం వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్‌ను టీవీలతో అందించారు. 32-అంగుళాల మోడల్ 1.5GB/8GB RAM/స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉండగా, మిగిలినవి 2GB/16GB RAM/స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తున్నాయి.



ధర ఎంత?
32-అంగుళాల ఏసర్ ఆండ్రాయిడ్ TV ధర రూ. 14,999 ($188). 43 అంగుళాల మోడల్‌ రూ. 27,999 ($351), 50 అంగుళాల మోడల్ రూ. 32,999 ($413), 55- అంగుళాల టీవీ రూ. 37,999 ($476)కి లభిస్తాయి. కొత్త ఏసర్ TVలు ఇండియాలోని అనేక ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Acer, Android, Budget smart tv, Tech news

తదుపరి వార్తలు