ఏసర్ నుంచి కొత్త ల్యాప్ టాప్ భారత మార్కెట్‌లోకి వచ్చింది. అత్యాధునికమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ గేమర్స్ స్పెషల్‌గా రూపొందింది. ఈ ల్యాపీ పేరు ప్రిడేటర్ హీలియోస్ 300. గేమ్స్ ఆడేటప్పుడు తక్కువ శబ్దం రావడం, వేడెక్కకుండా ఉండటం లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ఉత్తమ శబ్ద నాణ్యత కోసం కూడా ఏసర్ కొత్త శబ్ద సాంకేతికతను ఇందులో తీసుకొస్తోంది. ప్రిడేటర్ హీలియోస్ 300లో ఇంటెల్ కోర్ ఐ7 పదో జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. సరికొత్త ఎన్‌వీడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 30 సిరీస్ జీపీయూ ఉంటుంది. ఈ ల్యాపీలో 240 హెర్జ్ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుంది. దీని రెస్పాన్స్ టైమ్ 3ఎంఎస్‌గా ఉంటుంది. నాణ్యమైన ఆడియో కోసం డీటీఎస్ - ఎక్స్ అల్ట్రా 360 డిగ్రీల సాంకేతికను అందిస్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు సౌండ్స్ దీంతో సూపర్‌గా వస్తాయని ఏసర్ చెబుతోంది. గేమ్స్ ఆడేటప్పుడు ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండటానికి ఏరో బ్లేడ్ త్రీడీ ఫ్యాన్స్‌ను ఇస్తున్నారు. ఇందులో నాలుగో తరం ఫ్యాన్స్ ఉంటాయట. ల్యాపీ ఓవర్ హీట్ అవ్వకుండా ఈ ఫ్యాన్స్ చూసుకుంటాయి.
Moto G60: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటోరోలా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.13,999 నుంచి
Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే
ప్రిడేట్ హీలియోస్ 300 ల్యాపీలో గరిష్ఠంగా 32 జీబీ డీడీఆర్4 ర్యామ్, 2 టీబీ ఎస్‌ఎస్‌డీ హార్డ్ డిస్క్ ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు ల్యాప్‌టాప్ నుండి శబ్ధం రాకుండా కూల్ బూస్ట్ సిస్టమ్‌ను ఇస్తున్నారు. ఇందులో కీ బోర్డుకు వాస్డ్ కీ క్యాప్స్/ 4 జోన్ అనే కొత్త సాంకేతికత అందిస్తున్నారు. దీని కోసం ల్యాప్‌టాప్‌లో యుటిలిటీ యాప్‌ను అందిస్తున్నారు. దీంతో మొత్తం ల్యాపీని కంట్రోల్ చేయొచ్చట. విండోస్ 10 హోం ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్ వస్తుంది. ఎథర్ నెట్ కోసం ఈ2600 చిప్‌సెట్ వాడుతున్నారు. వైఫై 6 టెక్నాలజీ ఉన్న ఏఎక్స్ 1650 చిప్ సెట్ కూడా ఉంటుంది. ఇందులో హెచ్‌డీఎంఐ 2.0, మినీ డీపీ, యూఎస్‌బీ 3.2 పోర్టులు ఉంటాయి. యూఎస్‌బీ పోర్టు జనరేషన్ 1, జనరేషన్ 2ను సపోర్టు చేస్తుంది.
Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే
WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు
ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 ల్యాప్ టాప్‌లను ఫ్లిప్‌కార్ట్, ఏసర్ అధీకృత స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని ధర ₹1,19,999. ఈకామర్స్ వెబ్‌సైట్లలో ఈ ల్యాపీపై కొన్ని బ్యాంకు ఆఫర్లు, ఈఎంఎఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.