Acer Data Breach: ఏసర్​ ఇండియాపై సైబర్​ అటాక్​.. యూజర్ల డేటాను బహిరంగంగా ప్రదర్శించిన హ్యాకర్లు

ప్రతీకాత్మకచిత్రం

ఇటీవలి కాలంలో సామాన్యుల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్కరు హ్యాకర్ల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కంప్యూటర్ తయారీదారు ఏసర్ ఇండియాపై సైబర్ అటాక్ జరిగింది. హ్యాకర్లు ఈ సైబర్ దాడి ద్వారా ఏసర్ యూజర్లకు సంబంధించి 60జీబీ డేటాను దొంగలించారు.

  • Share this:
Acer Data Breach: ఇటీవలి కాలంలో సామాన్యుల నుంచి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్కరు హ్యాకర్ల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కంప్యూటర్ తయారీదారు ఏసర్ Acer ఇండియాపై సైబర్ అటాక్ జరిగింది. హ్యాకర్లు ఈ సైబర్ దాడి ద్వారా ఏసర్ యూజర్లకు సంబంధించి 60జీబీ డేటాను దొంగలించారు. ఇది అత్యంత సున్నితమైన డేటాగా తైవాన్‌కు చెందిన ఏసర్ Acer కంపెనీ పేర్కొంటోంది. అయితే కంపెనీ చెప్పిన 60జీబీ కంటే ఎక్కువ డేటాను చోరీ చేసామని నిరూపించడానికి హ్యాకర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరు తాము హ్యాక్ చేసిన అకౌంట్లను పబ్లిక్‌లో ప్రదర్శనకు పెట్టారు. దీంతో ఏసర్ Acer వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఏసర్ Acer కంపెనీపై ఇంతకు ముందు కూడా ఓ రాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. తైవానీస్ కంప్యూటర్ తయారీదారు ఏసర్ Acer ఇండియాపై హ్యాక్ జరిగిన కొన్ని రోజుల తర్వాత 60జీబీ విలువైన సున్నితమైన డేటా చోరీకి గురైంది. కంపెనీ సర్వర్‌ల నుంచి భారతీయ యూజర్లతో సహా మిలియన్ల మంది వినియోగదారుల డేటా చోరీ అయినట్లు సమాచారం. ఐతే అక్టోబర్ 5న జరిగిన హ్యాక్‌ను హ్యాకర్ గ్రూప్ డెసోర్డెన్ (Desorden) చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Flipkart Big Diwali Sale: Apple MacBook Air ల్యాప్‌టాప్‌లపై ఫ్లాట్ రూ .20,000 డిస్కౌంట్..


డేటా ఉల్లంఘన/చోరీ (data breach) అక్టోబర్ 13న జరిగినట్లు ప్రైవసీ అఫైర్స్ తొలిసారిగా నివేదించింది. ఇండియా అంతటా ఉన్న 3,000 కంటే ఎక్కువమంది ఏసర్ రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్ల లాగిన్ డీటెయిల్స్ హ్యాకర్ల గ్రూపు కలిగి ఉన్నట్లు ప్రైవసీ అఫైర్స్ పేర్కొంది. టామ్స్ హార్డ్‌వేర్ నివేదిక ప్రకారం.. డెసోర్డెన్ గ్రూప్ తాము హ్యాక్ చేసిన వేలాది మంది వ్యక్తుల డేటాను ప్రజల కోసం బహిరంగంగా ప్రదర్శించింది. ఇందులో సున్నితమైన ఖాతాలు, ఆర్థిక ఆడిట్ డేటా, వ్యక్తిగత, కార్పొరేట్ డేటా ఉన్నాయని టామ్స్ హార్డ్‌వేర్ నివేదిక వెల్లడించింది.

ఆందోళనలో ఏసర్​ వినియోగదారులు..

తన కంపెనీ అధికారులతో కలిసి పనిచేస్తోందని.. భారతదేశంలో ప్రభావితమైన కస్టమర్లకు సమాచారం అందిస్తోందని ఏసర్ ప్రైవసీ అఫైర్స్ కు తెలియపరిచింది. "ఇండియాలోని లోకల్ ఏసర్ సర్వీస్ సిస్టమ్ పై తాజాగా దాడి జరిగినట్టు గుర్తించాం. తర్వాత, మేము వెంటనే మా భద్రతా ప్రోటోకాల్‌లను ప్రారంభించి మా సిస్టమ్‌లపై పూర్తి స్కాన్‌ను నిర్వహించాం. భారతదేశంలోని ప్రభావిత వినియోగదారులందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ సంఘటన గురించి స్థానిక లా ఎన్ఫోర్స్మెంట్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు తెలియజేశాం. ఈ ఘటన వల్ల మా కార్యకలాపాలు, వ్యాపార కొనసాగింపుపై ఎటువంటి ప్రభావం పడదు" అని ఏసర్ ప్రతినిధి ప్రైవసీ అఫైర్స్ కు చెప్పారు. నివేదికల ప్రకారం, మార్చిలో ఏసర్ పై రాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది.

Acer Spin 7: ఎసర్​ నుంచి మొట్టమొదటి 5జీ ల్యాప్​టాప్​​.. ఫీచర్లు చూస్తే వావ్​ అనాల్సిందే..


50 మిలియన్ల డబ్బులు ఇస్తే తిరిగి మీ డేటా మీకు ఇస్తామని రాన్సమ్‌వేర్‌ హ్యాకర్లు కంపెనీకి తెలిపినట్లు సమాచారం. ఈ దాడి తర్వాత మళ్లీ ఈ సంవత్సరంలోనే తాజా దాడి జరిగింది. డెసోర్డెన్ వేలాది మంది వినియోగదారుల డేటా ప్రివ్యూను ఎగ్జిబిషన్‌లా పెట్టింది. ఇది ఆన్‌లైన్‌లో యూజర్ల సమాచారాన్ని విక్రయించాలని యోచిస్తోంది. ఈ ప్రివ్యూలో 10,000 మంది యూజర్ల డేటా మాత్రమే కనిపించినప్పటికీ.. డేటాను విక్రయించిన తర్వాత మొత్తం వినియోగదారుల డేటా ప్రమాదంలో పడుతుంది. ఎక్కువ రేటుకి కొనుగోలు చేసే వారు ముందుకు వస్తే హ్యాకర్ గ్రూప్ డేటాని అమ్ముకునే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published: