ACCORDING TO MARK ZUCKERBERG INDIA IMPORTANT FOR THE SUCCESS OF HIS NEXT BIG TECH DREAM GH SRD
Mark Zuckerberg’s Dream: తన ఆశయం కోసం భారత్ నే నమ్ముకున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకంటే..
Mark Zuckerberg
Mark Zuckerberg’s Dream: మార్క్ జుకర్‌బర్గ్ కి భారతదేశం లేకపోతే తన నెక్స్ట్ డ్రీమ్ నెరవేర్చుకోవడం సాధ్యం కాదా..? తన ఆశయం కోసం భారత్ నే ఎందుకు నమ్ముకున్నాడు..?
ఫ్యూయల్ ఫర్ ఇండియా-2021 (Fuel For India 2021 ) అనే వర్చువల్ సదస్సును మెటా (ఫేస్బుక్) సంస్థ బుధవారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ లైవ్ వర్చువల్ ఈవెంట్లో ఇండియా గురించి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) మాట్లాడారు. భారతదేశం లేకపోతే తన నెక్స్ట్ డ్రీమ్ నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నట్లుగా జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జుకర్‌బర్గ్ మెటావర్స్ (MetaVerse) అనే ఓ ఫ్యూచర్ సోషల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్లాట్‌ఫాం క్రియేట్ చేయాలనే పెద్ద లక్ష్యంతో ముందడుగులు వేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫాం వేదికగా ప్రజలు వర్చువల్‌గా ఇంటరాక్ట్ కావచ్చు. అయితే ఈ మెటావర్స్ అభివృద్ధిలో ఇండియా కీలక పాత్ర పోషించబోతోందని జుకర్‌బర్గ్ వర్చువల్ ఈవెంట్లో చెప్పడం విశేషం.
“ఈ మెటావర్స్‌ను అభివృద్ధి చేయడంలో భారతదేశం పోషించే పాత్ర గురించి నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఇంజనీర్లు, డెవలపర్లు, క్రియేటర్లు, అలాగే ఇండియాలోని స్టార్ట్-అప్ ఎకో-సిస్టమ్ ఫ్యూచర్ ఇంటర్నెట్ మెటావర్స్‌ను రూపొందించడంలో భారీ పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం 2024 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద యాప్ డెవలపర్ బేస్‌ని కలిగి ఉంటుంది. ఇప్పటికే ఓ అతిపెద్ద స్పార్క్ AR డెవలపర్ కమ్యూనిటీని కలిగి ఉంది. భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం గత కొన్నేళ్లుగా చాలా వృద్ధిని సాధించింది. ఇండియాలో గేమింగ్‌లో మన పెట్టుబడి పెరుగుతూనే ఉంది. మరి మెటావర్స్‌లో ఇది ఎలా రూపుదిద్దుకోబోతుందో మనం చూడాలి” అని ఆయన అన్నారు.
* మెటావర్స్ గురించి
మెటావర్స్ అనేది లీనమయ్యే ఇంటర్నెట్ లేదా కొత్త వర్చువల్ ప్రపంచమని జుకర్‌బర్గ్ చెప్పారు. ‘దీన్ని మీరు చూడటం కంటే ఎక్కువగా దానిలోనే ఉంటారు. ఇది మీరు వేరే ప్రపంచంలో ఉన్నారన్న భావన కల్పించే ఇంటర్నెట్ అవుతుంది. ఇది వేరే వ్యక్తులతో, ఇతర ప్రదేశాలలో ఉన్నారనే అనుభూతిని అందిస్తుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూ వస్తున్న టెక్నాలజీ ట్రెండ్స్ కు కొనసాగింపు అని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. భారతదేశంలోని ఇంటర్నెట్ ఎకానమీ తనను ఉత్తేజపరుస్తుందని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : మీ ఐఫోన్ పిన్ మర్చిపోయారా?.. ఐఓఎస్ 15.2 లేటెస్ట్ వెర్షన్‌తో డివైజ్‌ను ఇలా రీసెట్ చేసుకోండి
* భారత్ ప్రస్తావన ఎందుకంటే..
ఇండియా అనగానే ఎగ్జైట్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇప్పటికే భారతదేశంలో ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ బాగా వృద్ధి చెందిందని చెప్పారు. ఇలాంటి ఆలోచన, స్ఫూర్తి మెటావర్స్ అభివృద్ధికి దోహదపడుతుందని విశ్లేషించారు. మెటావర్స్ నిర్మాణంలో భారతీయ క్రియేటర్లు, డెవలపర్లు కచ్చితంగా సింహభాగం కానున్నారని భావిస్తున్నట్లు తెలిపారు జుకర్‌బర్గ్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.