ప్రముఖ టెక్ కంపెనీలు గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రేస్ నడుస్తోంది. ఏఐ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి రెండు సంస్థలు పోటాపోటీగా అప్‌డేట్‌లు ఇస్తున్నాయి. గత సంవత్సరం చాట్‌జిపిటి రిలీజ్ అయినప్పటి నుంచి మైక్రోసాఫ్ట్ వార్తల్లో నిలుస్తోంది. ఆ తర్వాత గూగుల్ కంపెనీ బార్డ్ చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను అందించడంలో ముందుంటే యాపిల్ ఏఐ రేస్‌లో ఎందుకు లేదని ఎప్పుడైనా అనిపించిందా? పాపులర్ AI చాట్‌బాట్‌కు పోటీగా యాపిల్ సిరి వస్తుందా? ఈ ప్రశ్నలకు కష్టమే అని సమాధానం చెబుతున్నారు యాపిల్ మాజీ ఇంజనీర్ ఒకరు.
యాపిల్ మాజీ ఇంజనీర్ జాన్ బుర్కీ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ, AI సర్క్యూట్‌లో అగ్రగామిగా మారాలనే లక్ష్యం ఉంటే, యాపిల్ కంపెనీకి సిరి పెద్దగా ఉపయోగపడదని చెప్పారు. యాపిల్ కంపెనీలో ఉన్నవారికంటే, బయటున్న అందరికంటే సిరి గురించి జాన్ బుర్కీకి ఎక్కువ తెలుసు. చాట్‌జిపిటికి సిరి ఎందుకు పోటీగా నిలవలేదనే అంశాలను ఆయన వివరించారు.
* పోటీలో యాపిల్ ఉందా?
సిరి సాధారణ ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలదని బుర్కీ పేర్కొన్నారు. కొత్త ప్రశ్నలకు సిరి సమాధానం ఇవ్వాలంటే, యాపిల్‌లోని ఇంజనీర్లు దాని డేటాబేస్‌కు కొత్త వర్డ్స్‌ను యాడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాసెస్ అంతటినీ పూర్తి చేయడానికి చాలా సమయం పట్టవచ్చని బుర్కీ అన్నారు.
ఇది కూడా చదవండి : మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్.. వర్డ్, ఎక్సెల్, ఔట్‌లుక్‌కు చాట్‌జిపిటి లాంటి AI పవర్..
ChatGPT తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్‌ను యాపిల్ తీసుకురావడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పనులకు ఇండస్ట్రీ పరంగా చాలా సమయం పడుతుందన్నారు. ఆయన సిరి కోడ్‌ని తప్పుబట్టారు. వేగంగా వాయిస్ అసిస్టెంట్‌కి కొత్త టూల్స్, ఫీచర్‌లను యాడ్ చేయడానికి అనుకూలంగా ఉండదని పేర్కొన్నారు. బుర్కీ 2014లో సిరిని మెరుగుపరచాలనే లక్ష్యంతో యాపిల్‌లో చేరారు. కానీ యాపిల్ వాయిస్ అసిస్టెంట్‌తో సమస్యలను వివరిస్తూ 2016లో కంపెనీని వీడారు.
* చాట్‌జిపిటి దూకుడు
ఈ వారం OpenAI కంపెనీ ChatGPT 4.0 వెర్షన్ లాంచ్ చేసింది. వినియోగదారులందరికీ బింగ్ సెర్చింగ్ ద్వారా మెరుగైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దాని AI మోడల్‌ను ఉపయోగిస్తోంది. ఈ సమయంలో బుర్కీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ChatGPT వాయిస్ అసిస్టెంట్‌లను పాత టెక్నాలజీలగా మార్చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ , అమెజాన్ వంటి కంపెనీలు చర్యలను వేగవంతం చేశాయి. ఇవే ప్రయత్నాలను సరైన మార్గంలో తీసుకెళ్లకపోతే పోటీలో వెనుకపడే అవకాశం ఉంది.
* కొత్త అప్‌డేట్స్ ఉంటాయా?
ఏఐ టెక్నాలజీ వినియోగంలో గూగుల్ మెరుగ్గా రాణించింది. అయినా ChatGPT కచ్చితత్వానికి దగ్గరగా రాలేకపోయింది. యాపిల్ ఇప్పటివరకు ఈ విషయంలో పోటీలోకి రాలేదు. అయితే రాబోయే కొద్ది నెలల్లో ఈ రెండు కంపెనీలు తమ డెవలపర్ కాన్ఫరెన్స్‌లను హోస్ట్ చేయనున్నాయి. ఈ వేదికలపై నుంచి మరిన్ని ఏఐ అప్‌డేట్‌లను వినియోగదారులు ఆశిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.