హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్​లో స్పెషల్​ అట్రాక్షన్​.. ఏసీ జాకెట్స్‌తో బరిలోకి దిగనున్న యూఎస్ టీమ్..!

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్​లో స్పెషల్​ అట్రాక్షన్​.. ఏసీ జాకెట్స్‌తో బరిలోకి దిగనున్న యూఎస్ టీమ్..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈ జాకెట్స్‌ ని ప్రముఖ యూఎస్ ఫ్యాషన్ కంపెనీ "రాల్ఫ్‌ లొరెన్‌ కార్పొరేషన్" డిజైన్ చేసింది. రాల్ఫ్‌ లొరెన్‌ సంస్థ తమ బ్రాండెడ్ జాకెట్స్ లో పర్సనల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను అమర్చింది. "ఆర్ఎల్ కూలింగ్" గా పిలవబడే ఈ జాకెట్స్‌ మెడ వెనుక భాగంలో బ్యాటరీతో నడిచే ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ అత్యంత వేడి వాతావరణంలో కూడా చల్లదనాన్ని అందిస్తుంది.

ఇంకా చదవండి ...

మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రీడాకారులు, క్రీడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఒలంపిక్స్ కి సంబంధించి వస్తున్న అనేక వార్తలు క్రీడా అభిమానులను ఆశ్చర్య పరుస్తున్నాయి. తాజాగా మరొక ఆసక్తికరమైన వార్త క్రీడా ప్రియులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అదేంటంటే, టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికా జెండాని మోసే యూఎస్ టీమ్ సభ్యులు ఏసీ కలిగివున్న జాకెట్స్‌ ధరించనున్నారట. ఈసారి యూఎస్ టీమ్ వైట్ కలర్ ఏసీ జాకెట్స్‌ ని పరేడ్ యూనిఫాంలుగా ఎంపిక చేసుకోవడం విశేషం కాగా.. ఈ జాకెట్స్‌ ని ప్రముఖ యూఎస్ ఫ్యాషన్ కంపెనీ "రాల్ఫ్‌ లొరెన్‌ కార్పొరేషన్" డిజైన్ చేసింది.

రాల్ఫ్‌ లొరెన్‌ సంస్థ తమ బ్రాండెడ్ జాకెట్స్ లో పర్సనల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను అమర్చింది. "ఆర్ఎల్ కూలింగ్" గా పిలవబడే ఈ జాకెట్స్‌ మెడ వెనుక భాగంలో బ్యాటరీతో నడిచే ఒక డివైస్ ఉంటుంది. ఈ డివైస్ అత్యంత వేడి వాతావరణంలో కూడా చల్లదనాన్ని అందిస్తుంది.

ఈ జాకెట్ ధరించిన వారికి వేడి ప్రదేశాల్లో కూడా ఎటువంటి చెమట పట్టదు.పెద్ద కంప్యూటర్లలో పుట్టే వేడిని కూల్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తారో అచ్చం అదే టెక్నాలజీని ఆర్ఎల్ కూలింగ్ జాకెట్స్ లో ఉపయోగించారు. ఈ టెక్నాలజీ.. జాకెట్ మెడ వెనుక భాగంలో అమర్చిన ఒక ఫ్యాన్ సహాయంతో ధరించిన వారి చర్మం యొక్క వేడిని తగ్గిస్తుంది. ఈ ఫ్యాన్ బ్యాటరీతో నడిచే తేలికైన డివైస్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ జాకెట్ లో వాడిన కూలింగ్ టెక్నాలజీ ఎన్నో సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీ, సైంటిఫిక్ థియరీస్ ఆధారంగా పని చేస్తుందని కంపెనీ బోర్డు వైస్ చైర్మన్, ఇన్నోవేషన్ ఆఫీసర్ డేవిడ్ లొరెన్‌ జూమ్ ద్వారా చెప్పుకొచ్చారు. కూలింగ్ టెక్నాలజీని దుస్తులతో జోడించి అద్భుతమైన ఏసీ జాకెట్స్ సృష్టించినందుకు తాము చాలా గర్వంగా ఫీలవుతున్నానని ఆయన తెలిపారు. 2008వ సంవత్సరం నుంచి అమెరికన్ టీమ్ దుస్తులను రాల్ఫ్‌ లొరెన్‌ డిజైన్ చేస్తూ వస్తోంది. ఇకపోతే ప్రారంభోత్సవ వేడుకలలో అమెరికన్ జండా మోసే టీమ్ ఏసీ జాకెట్స్ ధరించనుండగా.. మిగతా టీమ్ ఉన్నితో తయారు చేసిన నేవీ బ్లేజర్లు ధరించనున్నారు. ఈ దుస్తులలో ఛాతి భాగంలో ఒకవైపు ఎరుపు రంగు గల ఒలింపిక్ ముద్ర ఉంటుంది.. మరొక వైపు "పోలో" కంపెనీ చిహ్నం ఉంటుంది. అలాగే, నేవీ బ్లేజర్లతో సహా బ్లూ డెనిమ్ ప్యాంటు.. బ్లూ అండ్ వైట్ చారల టీ-షర్టు ధరిస్తారు.

Published by:Krishna Adithya
First published:

Tags: Tokyo Olympics

ఉత్తమ కథలు