సేల్స్‌లో దుమ్మురేపుతున్న 'ఏఐ' ఫోన్స్!

2018లో అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్లల్లో సగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం ఉన్నవేనని ఓ అధ్యయనం తేల్చింది. 2017లో గూగుల్ అసిస్టెంట్ టాప్ ప్లేస్‌లో ఉంటే, యాపిల్‌కు చెందిన సిరి రెండో స్థానంలో ఉంది.

news18-telugu
Updated: July 30, 2018, 12:15 PM IST
సేల్స్‌లో దుమ్మురేపుతున్న 'ఏఐ' ఫోన్స్!
Image:Shutterstock
  • Share this:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... టెక్నాలజీలో ఇదో విప్లవం. ఇప్పుడు ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్లల్లో సగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం ఉన్నవే. స్ట్రాటజీ అనలిటిక్స్ ఇంక్ తేల్చిన లెక్క ఇది. గతేడాది అమ్ముడుపోయిన ఏఐ ఫీచర్ ఉన్న స్మార్ట్‌ఫోన్లు 36.6 శాతం అమ్ముడుపోతే, ఈ ఏడాది 47.7 శాతమని తేలింది. ఈ ఏడాది చివరి నాటికి 51.3 శాతానికి చేరొచ్చని అంచనా.

2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే స్మార్ట్‌ఫోన్లల్లో ఏఐ ఫీచర్ ఉన్నవి 90 శాతం ఉంటాయని అంచనా. ఇన్-బిల్ట్ ఏఐ అసిస్టెంట్‌తో స్మార్ట్‌ఫోన్లు వస్తాయని స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక సారాంశం. 2017లో గూగుల్ అసిస్టెంట్‌ 46.7 మార్కెట్ షేర్ సాధించింది. దాని తర్వాత యాపిల్‌కు చెందిన సిరి 40.1 శాతంతో రెండో స్థానంలో ఉంది.

First published: July 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు