హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Aarogya Setu: కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి

Aarogya Setu: కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి

Aarogya Setu: కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి
(ప్రతీకాత్మక చిత్రం)

Aarogya Setu: కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)

Aarogya Setu App | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇకపై కొత్త స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ కనిపించనుంది. ఎందుకో తెలుసుకోండి.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ను ఇప్పటికే కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇకపై కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా రానుంది. అంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్, ప్లే స్టోర్ లాంటి యాప్స్ ముందే ఉన్నట్టే ఇకపై ఆరోగ్య సేతు యాప్ కూడా కనిపించనుంది. ఈ విషయాన్ని న్యూస్18 కు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత భారతదేశంలో అమ్మే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా రానుంది. కేవలం యాప్ ఉండటమే కాదు కొత్త స్మార్ట్‌ఫోన్ వాడటం ప్రారంభించాలంటే యూజర్లు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకునేలా మార్పులు ఉండబోతున్నాయి.

ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీని నియమించనుంది. ఆ ఏజెన్సీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలను సంప్రదించి కొత్త మొబైల్స్‌లో ఆరోగ్య సేతు యాప్ ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ అయిన తర్వాతే కొత్త స్మార్ట్‌ఫోన్ ఆన్ అయ్యేలా సెట్టింగ్స్ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు ఫీచర్ ఫోన్‌లో కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ సాధ్యమయ్యేలా ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆరోగ్య సేతు యాప్‌ను ఇప్పటికే 7.5 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేయడం విశేషం. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆరోగ్య సేతు యాప్ 5 కోట్ల మార్క్‌ను దాటింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఆరోగ్య సేతు కాంటాక్ట్ ట్రేసింగ్ అప్లికేషన్. యూజర్ లొకేషన్ డేటా, స్మార్ట్‌ఫోన్ జియోలొకేషన్ సెన్సార్, బ్లూటూత్ సాయంతో కరోనావైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్‌ను ట్రాక్ చేస్తుంది. కోవిడ్ 19 పేషెంట్లను ట్రాక్ చేయడంతో పాటు వారి లొకేషన్ హిస్టరీ, ట్రావెల్ హిస్టరీ గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి:

Smartphones: లాక్‌డౌన్ తర్వాత మార్కెట్లోకి వచ్చే 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Fact Check: మే 3 వరకు ఇంటర్నెట్ ఫ్రీ... మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

WhatsApp: వాట్సప్‌లో ఒకేసారి 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేయొచ్చు ఇలా

First published:

Tags: Aarogya Setu, Mobile App, Playstore, Technology

ఉత్తమ కథలు