Home /News /technology /

AADHAAR THIS AADHAR CARD SERVICE HAS BEEN DISCONTINUED BY UIDAI HERE FULL DETAILS NS GH

Aadhar Card - UIDAI: ఆధార్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూఐడీఏఐ ఓ తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకుంది. ఆధార్ కు సంబంధించిన ఓ సేవను నిలిపిస్తున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్​లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు ఆధార్​. బ్యాంకు అకౌంట్ దగ్గరి నుంచి మరే ఇతర సేవ పొందాలన్నా ఆ కార్డు ఉండాల్సిందే. అలాగే ప్రభుత్వం నుంచి ఏ పథకం కావాలన్నా ఆధార్​ తప్పనిసరి. విద్యార్థుల నుంచి వయోజనుల వరకు అందరికీ ఈ విశిష్ట గుర్తింపు కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి ఆధార్​కార్డులో తప్పులు ఉంటే సరి చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో అవకాశాలు కల్పిస్తోంది. అడ్రస్​, బయోమెట్రిక్, ఫొటో, మొబైల్ నంబర్ ఇలా ఏ మార్పు కావాలన్నా సరైన ధ్రువపత్రాలు సబ్మిట్ చేస్తే సరిచేస్తోంది. అలాగే ఆధార్​ సేవలకు సంబంధించిన వివరాలను యూఐడీఏఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటుంది. ఆ తరుణంలో ఓ తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకుంది. ఓ సేవను నిలిపిస్తున్నట్టు తెలిపింది. దానికి ప్రత్యా​మ్నాయాన్ని సైతం తెలిపింది.
ICICI: ఐసీఐసీఐ సూపర్ ఫీచర్​.. వాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు.. పూర్తి వివరాలివే..

ఆధార్ రీ ప్రింట్ సేవను నిలిపివేస్తున్నట్టు ఇటీవల యూఐడీఏఐ స్పష్టం చేసింది. అధికారిక వెబ్​సైట్​లో ఆధార్ రీప్రింట్​ ఆప్షన్ కనిపించకపోయే సరికి ఇటీవల ఓ కస్టమర్ యూఐడీఏఐకి ట్విట్టర్​ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎందుకు ఇలా జరిగిందంటూ ప్రశ్నించాడు. దీనికి ఆధార్ హెల్ప్ సెంటర్ సమాధానమిచ్చింది. “ఆధార్​ రీప్రింట్ సర్వీస్​ను నిలిపివేశాం. దాని బదులు ఇప్పుడు ఆల్​లైన్ ద్వారా పీవీసీ కార్డును ఆర్డర్ చేయవచ్చు. కావాలంటే మీరు ఆన్​లైన్​లో ఈ-ఆధార్ ప్రింట్ తీసుకొని వినియోగించుకోవచ్చు’ అని చెప్పింది. ఇంతవరకు ఆధార్ కార్డు మళ్లీ కావాలంటే రీప్రింట్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు మళ్లీ పొందేవారు. అయితే మరింత నాణ్యతతో.. పేపర్​లా కాకుండా పీవీసీతో ఆధార్ కార్డులను పంపిణీ చేస్తోంది.

ఆధార్ పీవీసీ (PVC) కార్డు అంటే?
ఆధార్​కార్డు రీప్రింట్ సర్వీసును పీవీసీ కార్డు పంపిణీగా యూఐడీఏఐ మార్చింది. పేపర్​గా కాకుండా ఏటీఎం కార్డులా పీవీసీతో తయారు చేసిన కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా కార్డు బలంగా ఉండడంతో వాలెట్స్​లో పెట్టుకున్నా నగిలిపోకుండా ఉంటుంది. ఏటీఎం కార్డులాగా దళసరిగా ఉంటుంది.

పీవీసీ కార్డు ఫీచర్లు..
-మంచి ప్రింటింగ్ క్వాలిటీతో పాటు దళసరిగా ల్యామినేషన్ ఉంటుంది.
-వాలెట్​తో పాటు వెంట తీసుకెళ్లేందుకు చాలా అనువుగా ఉంటుంది. చినిగిపోయే అవకాశామే ఉండదు.
-కొత్తగా తెచ్చిన ఆధార్ వీపీసీలో సెక్యూరిటీ ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. హోలోగ్రామ్, గులోచీ పాటెర్న్​, ఘోస్ట్ ఇమేజ్​, మైక్రోటెక్ట్స్​ ఉన్నాయి.
-ఆధార్ పీవీసీ కార్డు వెదర్ ప్రూఫ్​. ఎలాంటి వాతావరణంలోనైనా ఏమీ కాదు. వర్షానికి తడిసినా.. ఎండకు ఉన్నా చెడిపోసే సమస్యే లేదు.
-ఆఫ్​లైన్​లో తక్షణమే వెరిఫై చేసేందుకు క్యూఆర్​ కోడ్ కూడా ఉంటుంది.

-కొత్త వీపీసీ కార్డుపై ఆధార్ జారీ చేసిన తేదీతో పాటు ప్రింట్ చేసిన తేదీ కూడా ఉంటుంది.
-మరింత ఆకర్షణీయంగా ఎంబెడ్ అయిన ఆధార్​లోగో పీవీసీ కార్డుపై ఉంటుంది.
-యూఐడీఏ వెబ్​సైట్​లో రూ.50ల రుసుము చెల్లిస్తే వారం పది రోజుల్లో ఆధార్ పీవీసీ కార్డు ఆధార్​లో ఉన్న అడ్రస్​కు డెలివరీ వచ్చేస్తుంది. ఏటీఎం కార్డులా ఎంతో పటిష్టంగా ఉండే ఈ పీవీసీ కార్డును ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. అలాగే వెంట తీసుకెళ్లేందుకు సౌకర్యంగా, ఆకర్షణీయంగా కూడా ఉంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Aadhaar, Aadhaar card, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు