పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్... బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్... ఇవన్నీ పాత నిబంధనలే. ఇప్పుడు వాట్సప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్‌ను లింక్ చేయాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఇలా చెప్పింది ఎవరో కాదు... తమిళనాడు ప్రభుత్వమే ఈ ఆదేశాలు జారీ చేసింది. అసాంఘిక చర్యలకు, అశ్లీల కంటెంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించడం సంచలనం సృష్టించింది. దీంతో ఫేస్బుక్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. ఇవే డిమాండ్లతో మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ విచారించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఫేస్బుక్. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు యూజర్ల ప్రైవసీకి భంగకరం అంటూ ఫేస్బుక్ వాదిస్తోంది. అయితే ఓ మెసేజ్ ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకునేందుకు సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం అవసరం అని, ప్రొఫైల్స్ ట్రాక్ చేయడం సులువు అవుతుందన్నది పిటిషనర్ల వాదన. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు భారత ప్రభుత్వానికి, తమిళనాడు పోలీసులకు, గూగుల్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 13 లోగా అభిప్రాయాలు తెలపాలని ఆదేశించింది.
సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ లింక్ చేయాలా?
కొన్నేళ్లుగా భారతదేశానికి ఫేక్ న్యూస్ పెద్ద సమస్యగా మారింది. ఎవరు సృష్టిస్తున్నారో, ఎవరు వైరల్ చేస్తున్నారో గుర్తించడం అసాధ్యం అవుతోంది. ప్రభుత్వాలతో పాటు సోషల్ మీడియా సంస్థలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫేక్ న్యూస్‌కు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట మాత్రం పడట్లేదు. ఫేక్ న్యూస్, బ్లూవేల్ లాంటి గేమ్స్, జాతి వ్యతిరేక, అభ్యంతరకరమైన పోస్టులు, అశ్లీల కంటెంట్‌ను అడ్డుకోవాలంటే సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ నెంబర్లను అనుసంధానించడమే మార్గం అని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. మొబైల్ కనెక్షన్స్, మొబైల్ వ్యాలెట్స్, బ్యాంకింగ్ యాప్స్‌కి కేవైసీ ఎలా తప్పనిసరో, సోషల్ మీడియా అకౌంట్లకూ అలాగే కేవైసీ ఉంటే తప్పేం లేదన్న అభిప్రాయం ఉంది.
సోషల్ మీడియా అకౌంట్ల వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలను అడ్డుకోవడానికి ఆధార్ నెంబర్లతో లింక్ చేయాలన్న వాదన సమంజసంగానే అనిపించినా... అసలు ఇది సాధ్యం అవుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎలా స్పందిస్తాయో చూడాలి. ఎందుకంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, యాప్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లున్నారు. ఏ దేశంలోనూ ఆన్లైన్ ప్రొఫైల్స్‌కి ఐడీ ప్రూఫ్ లింక్ చేయాలన్న నిబంధన లేదు.
Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Good News: రెడ్మీ స్మార్ట్ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించిన షావోమీ... లేటెస్ట్ రేట్స్ ఇవే
Realme 5: మార్కెట్లోకి మరో బడ్జెట్స్మార్ట్ఫోన్ 'రియల్మీ 5'... ధర రూ.9999
LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇవ్వొచ్చు తెలుసా