హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ కస్టమర్లు, డీలర్ల ఆధార్ డేటా లీక్

Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ కస్టమర్లు, డీలర్ల ఆధార్ డేటా లీక్

Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ డీలర్లు, కస్టమర్ల ఆధార్ డేటా లీక్

Aadhar Data Leak: ఇండేన్ గ్యాస్ డీలర్లు, కస్టమర్ల ఆధార్ డేటా లీక్

Aadhar Data Leak | ఇండేన్ 67,91,200 మంది డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, కస్టమర్ల డేటా లీకైంది. వాస్తవానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉంటే తప్ప ఈ డేటా తెలుసుకోవడం కష్టం. కానీ ఆ డేటా లీక్ కావడం కలకలం రేపుతోంది.

  మీరు ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? ఆధార్ నెంబర్లతో సహా ఇతర వివరాలన్నీ ఇండేన్ గ్యాస్ డీలర్ దగ్గరున్నాయా? అయితే ఆ డేటా మొత్తం లీకైందంటూ ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చర్ బాంబు పేల్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) సొంత ఎల్‌పీజీ బ్రాండ్ అయిన ఇండేన్ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు లక్షలాది మంది కస్టమర్ల డేటా లీకైందని ఎథికల్ హ్యాకర్ ఎలియాట్ ఆల్డర్సన్ చెబుతున్నాడు. అతని అసలు పేరు రాబర్ట్ బాప్టిస్ట్. ఆధార్‌లో లోపాలతో పాటు ప్రభుత్వ వెబ్‌సైట్లల్లో ఉన్న సెక్యూరిటీ లోపాలను బయటపెట్టడంలో దిట్ట. గతంలో ఆధార్‌లో లోపాలు బయటపెట్టి UIDAIని సవాల్ చేశాడు. కొద్ది రోజుల క్రితం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెబ్‌సైట్ narendramodi.in హ్యాకైందని ఆధారాలతో సహా నిరూపించాడు. ఇప్పుడు ఇండేన్ గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్ల డేటా లీకైందని చెప్పడం సంచలనంగా మారింది.


  Read this: Ban TikTok: టిక్‌ టాక్ యాప్‌ను బ్యాన్ చేయండి... పెరుగుతున్న డిమాండ్లు


  మీడియం వెబ్‌సైట్‌లో రాబర్ట్ బాప్టిస్ట్ రాసిన బ్లాగ్‌పోస్ట్ ప్రకారం మొత్తం ఇండేన్ 67,91,200 మంది డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, కస్టమర్ల డేటా లీకైంది. వాస్తవానికి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉంటే తప్ప ఈ డేటా తెలుసుకోవడం కష్టం. కానీ ఆ డేటా లీక్ కావడం కలకలం రేపుతోంది. స్థానిక డీలర్లు ఆథెంటికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కస్టమర్ల పేర్లు, చిరునామాలు, ఆధార్ నెంబర్లు లీక్ అయ్యాయని అతని వాదన. ఇండేన్ అతని ఐపీ బ్లాక్ చేసే లోపే రాబర్ట్ 11,000 మంది డీలర్ల దగ్గరున్న కస్టమర్ల డేటాను సంపాదించగలిగాడు. డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు, కస్టమర్లందరివీ కలిపి 67,91,200 మంది డేటా లీక్ అయినట్టు తేల్చాడు. ఈ డేటా లీకేజీపై UIDAI, ఇండేన్ గ్యాస్ నుంచి ఇంకా స్పందించలేదు.


  Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే


  ఇవి కూడా చదవండి:


  Jobs: మీ దగ్గర ఈ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగాలు... భారీ జీతాలు...


  Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం


  Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు


   

  First published:

  Tags: AADHAR, DATA BREACH, Personal Data

  ఉత్తమ కథలు