మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ప్రతీ అవసరానికి ఆధార్ సెంటర్‌కో, ఆధార్ సేవా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం లేదు. చాలావరకు సేవలు ఆన్లైన్లో లభిస్తాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రూపొందించిన ఎంఆధార్ యాప్‌లో 35 రకాల సేవలు పొందొచ్చు. ఇటీవల ఎంఆధార్ యాప్‌ను అప్డేట్ చేసింది యూఐడీఏఐ. ఈ యాప్ అప్డేట్ చేస్తే ఇంటర్ఫేస్ సౌకర్యవంతంగా ఉంటుంది. mAadhaar App ఆండ్రాయిడ్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో లభిస్తుంది. ఈ యాప్‌ను 13 భాషల్లో ఉపయోగించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది.
ఒక యాప్‌లో ఐదుగురి ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఒకరు ఎంఆధార్ యాప్ డౌన్లోడ్ చేస్తే ఐదుగురి ఆధార్ నెంబర్లకు ఉపయోగించుకోవచ్చు. ఎంఆధార్ యాప్‌లో 35 రకాల సేవలు లభిస్తాయి. వాటిలో ముఖ్యమైన సేవలు ఇవే.
Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి
Aadhaar Card: ఆధార్ నెంబర్ మర్చిపోయారా? సింపుల్‌గా 3 నిమిషాల్లో తెలుసుకోండి ఇలా
mAadhaar App: ఎంఆధార్ యాప్‌లో లభించే సేవలు ఇవే
ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయొచ్చు.
ఆధార్ రీప్రింట్ కోసం ఆర్డర్ చేయొచ్చు.
ఆధార్ నెంబర్ మర్చిపోతే తిరిగి పొందొచ్చు.
ఆధార్ కార్డును ఆఫ్‌లైన్ మోడ్‌లో చూడొచ్చు. ఐడీ ప్రూఫ్‌గా చూపించడానికి ఉపయోపడుతుంది.
ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేయొచ్చు.
ఒకే మొబైల్లో ఐదుగురి ప్రొఫైల్స్ మెయింటైన్ చేయొచ్చు.
పేపర్‌లెస్ ఇకేవైసీ షేర్ చేయొచ్చు.
క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ కార్డు షేర్ చేయొచ్చు.
ఆధార్ లేదా బయోమెట్రిక్స్ లాక్ చేయొచ్చు.
ఆఫ్‌లైన్‌లో ఆధార్ ఎస్ఎంఎస్ సర్వీస్‌లు పొందొచ్చు.
డ్యాష్‌బోర్డులో ఆధార్ అప్డేట్ స్టేటస్, ఆధార్ రీప్రింట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లేందుకు అపాయింట్మెంట్ బుక్ చేయొచ్చు.
ఆధార్ ఆన్లైన్ సేవలకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ పొందొచ్చు.
దగ్గర్లోని ఆధార్ ఎన్రోల్ మెంట్ సెంటర్ లొకేట్ చేయొచ్చు.
దగ్గర్లో ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
ఎంఆధార్ యాప్‌లోని ఆధార్ కార్డును ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లలో ఐడీ ప్రూఫ్‌గా చూపించొచ్చు.
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
Aadhaar Card: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఆన్లైన్లోనే మార్చేయండి ఇలా
ఎంఆధార్ యాప్‌లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటివి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. ఎంఆధార్ యాప్‌లో హోమ్ స్క్రీన్‌లో 'Main Service Dashboard', 'Request Status Services', 'My Aadhaar' లాంటి ఆప్షన్స్ ఉంటాయి. వీటి ద్వారా 35 రకాల సేవలు పొందొచ్చు.