హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

A Witness Tree : మీకు తెలుసా... ఆ చెట్టు ట్వీట్ చేస్తోంది... ఇది నిజం..

A Witness Tree : మీకు తెలుసా... ఆ చెట్టు ట్వీట్ చేస్తోంది... ఇది నిజం..

మనుషులు ట్వీట్లు చెయ్యడం కామన్. చెట్టు ట్వీట్ చెయ్యడమేంటి? ఇలాంటి మిస్‌లీడింగ్ చేసే హెడ్‌లైన్ పెట్టడం కరెక్టు కాదు అనుకుంటున్నారా? డోంట్ ఫీల్. ఆ హెడ్ లైన్ కరెక్టే. ఆ చెట్టు ట్వీట్ చేస్తుంది.

ఆమెరికా హార్వార్డ్ యూనివర్శిటీలోని అడవిలో ఉంది ఆ ప్రత్యేకమైన ఓక్ చెట్టు. అది తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ వారానికి ఆరుసార్లు టీట్లు చేస్తుంది. మనకు ఎలాగైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఆ చెట్టుకి కూడా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా వాతావరణం ఎలా ఉంది, భూమిలో నీరు లభిస్తోందా, గాలి బాగా వీస్తోందా ఇలాంటి విషయాలపై అది టీట్లు చేస్తోంది. దాని ట్విట్టర్ అకౌంట్ పేరు @awitnesstree. ఎవరైనా సరే ట్విట్టర్‌లో ఆ అకౌంట్‌లోకి వెళ్లి... చెట్టు ఏం ట్వీట్లు పెడుతోందో చదవొచ్చు. ఇంతకీ చెట్టు ట్వీట్ చెయ్యడమేంటన్న ప్రశ్నకు సమాధానం ఉంది. ఏంటంటే... టిమ్ రాడెమ్షర్ అనే రీసెర్చ్ స్టూడెంట్.. ఈ చెట్టు కాండం, వేర్లు, కొమ్మలకు సెన్సార్లు సెట్ చేశాడు. వాటిని సైన్స్‌లో డెండ్రోమీటర్లు అంటున్నారు. వాటిని ఓ కంప్యూటర్‌కి లింక్ చేశారు.

చెట్టు కాండం ద్వారా ప్రవహించే ద్రవం ఎంత ఉందో, నేలల్లో వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతుందో, వాతావరణం, ఉష్ణోగ్రత ఎలా ఉందో, ఆ సెన్సార్లు గమనిస్తూ ఉంటాయి. ఆ వివరాల్ని కంప్యూటర్‌కి పంపిస్తాయి. వాటి ఆధారంగా ఆ కంప్యూటర్ ఆటోమేటిక్ ట్వీట్లను వేస్తోంది. చిత్రంగా ఉంది కదూ.

జులై 17న తొలి ట్వీట్ నమోదైంది. ఇంటర్నెట్‌లో అతి పురాతన జీవిని నేనే అని చెట్టు రాసుకుంది.

రెండు రోజుల నుంచీ ఎండ దంచేస్తోంది... ఈ వేడి గాలులు ఎప్పుడు తగ్గుతాయో అని జులై 21న మరో ట్వీట్ వేసింది.

నా కాండం, కొమ్మలు వేగంగా పెరుగుతున్నాయి అని జులై 22న మరో ట్వీట్ పెట్టింది. జులై నెల సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉందని ఆగస్ట్ 1న ఇంకో ట్వీట్ వేసింది.

First published:

Tags: VIRAL NEWS

ఉత్తమ కథలు