Home /News /technology /

A TRICK TO GET RID OF WHATSAPP THE APP DISAPPEARS WITHOUT UNINSTALLING IT UMG GH

WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ట్రిక్.. యాప్ అన్‌ఇన్‌స్టాల్ కాకుండానే అదృశ్యం! ఇలా సెట్టింగ్స్ చేశారంటే సూపరో.. సూపర్

 వాట్సాప్ నుంచి అదిరిపోయే ట్రిక్.. యాప్  అన్‌ఇన్‌స్టాల్ కాకుండానే అదృశ్యం !.. ఇలా  సెట్టింగ్స్ చేశారంటే సూపరో.. సూపర్

వాట్సాప్ నుంచి అదిరిపోయే ట్రిక్.. యాప్ అన్‌ఇన్‌స్టాల్ కాకుండానే అదృశ్యం !.. ఇలా సెట్టింగ్స్ చేశారంటే సూపరో.. సూపర్

వాట్సాప్(WhatsApp) యూజర్లు ఒక ట్రిక్ సహాయంతో యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయకుండానే దాని నుంచి మాయం (Disappear) అవ్వచ్చు. మీరు వాట్సాప్ యూజ్‌ చేస్తున్నట్లు ఇతర కాంటాక్ట్స్‌కి తెలియకుండా మెసేజ్ రిసీవింగ్, ఆన్‌లైన్ స్టేటస్, ఇతర అన్ని వివరాలను దాచేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
స్మార్ట్‌ఫోన్ యూజ్‌ చేస్తున్న వారికి మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఒక ముఖ్యమైన అవసరంగా మారిపోయింది. బంధువులు, స్నేహితులు, తెలిసినవారు, కొలీగ్స్, ప్రియమైన వారితో కమ్యూనికేట్ అయ్యేందుకు వాట్సాప్‌పైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. కొందరు వాట్సాప్‌ను బాగా అలవాటు పడి దానిని వాడకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. నోటిఫికేషన్లను ఆఫ్ చేసినా ఏదో ఒక సమయంలో వాట్సాప్ ఓపెన్ చేయకుండా, ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. అటు వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ (Uninstall) చేయడం ఇష్టం లేక.. ఇటు యూజ్‌ చేయకుండా ఉండలేక సతమతమవుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే ఒక ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ సహాయంతో వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయకుండానే ఆ యాప్ నుంచి మాయం (Disappear) అవ్వచ్చు. మీరు వాట్సాప్ యూజ్‌ చేస్తున్నట్లు ఇతర కాంటాక్ట్స్‌కి తెలియకుండా మెసేజ్ రిసీవింగ్, ఆన్‌లైన్ స్టేటస్, ఇతర అన్ని వివరాలను దాచేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

యాప్‌ను డిలీట్ చేయకుండా వాట్సాప్ నుంచి ఎలా అదృశ్యం కావాలి?

ఈ ప్రాసెస్ చాలా ఈజీ. ఈ ట్రిక్ ఫాలో అవ్వడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టదు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్క సెట్టింగ్‌ని మార్చడమే. దీనికోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

స్టెప్ 1: వాట్సాప్ యాప్‌(app)పై లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు 'i' అనే “యాప్ ఇన్ఫో (App Info)” ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి

స్టెప్ 2: ఇప్పుడు మీకు యాప్ ఇన్ఫోలో ”ఫోర్స్ స్టాప్ (Force Stop)” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: తరువాత బ్యాక్‌గ్రౌండ్‌లో వాట్సాప్ యాప్‌ను క్లోజ్ చేయాలి. ఇది పూర్తయిన తర్వాత, మీరు వాట్సాప్ యాప్ డిలీట్ చేసినట్లే మీకు ఎలాంటి మెసేజ్‌లు, నోటిఫికేషన్లు రావు.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

మీరు ఈ ట్రిక్‌(trick)ని ఫాలో అయితే మీకు మెసేజ్ పంపినవారు ఒక టిక్‌ను మాత్రమే చూస్తారు. అంటే ఆ మెసేజ్ మీకు డెలివరీ కాలేదని పంపిన వారికి అర్థమవుతుంది. ఫోర్స్ స్టాప్ చేసినప్పుడు డెలివరీ అయినట్లు డబుల్ టిక్ అనేది అవతల వ్యక్తికి కనిపించదు. అప్పుడు వారు మీరు నిజంగానే వాట్సాప్ డిలీట్ చేశారేమో అని అనుకుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, మీరు వాట్సాప్‌ని ఓపెన్ వెంటనే, అది మళ్లీ పని చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు మీకు మెసేజెస్ వస్తాయి. అవతలి వ్యక్తికి మీరు వాట్సాప్ వాడుతున్నట్లు తెలుస్తోంది. పైన చెప్పిన ట్రిక్ సాయంతో వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయకుండానే దానిని డిలీట్ చేసినట్లు మీరు మీ కాంటాక్ట్స్‌ని నమ్మించవచ్చు. ఎందుకంటే ఈ ట్రిక్ యూజ్‌ చేసినప్పుడు మీకు మెసేజ్ చేసినా అవతలి యూజర్లకు నాట్-డెలివర్డ్ అని ఒకటే టిక్ మార్క్ పడుతుంది.
Published by:Mahesh
First published:

Tags: Smartphones, Tech news, Whatsapp, Whatsapp tricks

తదుపరి వార్తలు