హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Play Store: హ్యాకర్లకు చెక్ పెట్టే ట్రిక్.. మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే ఎవరు ఏం చేయలేరు !

Google Play Store: హ్యాకర్లకు చెక్ పెట్టే ట్రిక్.. మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే ఎవరు ఏం చేయలేరు !

 హ్యాకర్లకు చెక్ పెట్టే ట్రిక్.. మీ ఫోన్‌లో ఈ   సెట్టింగ్ ఆన్ చేస్తే ఎవరు ఏం చేయలేరు !

హ్యాకర్లకు చెక్ పెట్టే ట్రిక్.. మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే ఎవరు ఏం చేయలేరు !

కస్టమర్ల ఫోన్ల(Phone)ను సురక్షితంగా ఉంచడానికి గూగుల్(Google) వివిధ రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తుంది. హ్యాకర్లకు చెక్ పెట్టేందుకు Google Play Protect అనే సెక్యూరిటీ సెట్టింగ్‌ను ఆన్‌లో ఉంచాలని ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ సలహా ఇస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆపరేటింగ్ సిస్టమ్‌గా (Operating System) నిలుస్తోంది ఆండ్రాయిడ్ (Android). ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది వినియోగదారులు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ OS ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వివిధ కంపెనీ(Company)లు తమ స్మార్ట్‌ఫోన్(Smartphone)లో కొద్దిగా భిన్నమైన ఆండ్రాయిడ్ వెర్షన్‌లను ఉపయోగిస్తున్నాయి. ఈ ఓపెన్ సోర్స్ అనేది చాలా సాధారణం. అయితే దీనివల్ల డివైజ్ హానికరమైన సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది.

కస్టమర్ల ఫోన్లను సురక్షితంగా ఉంచడానికి గూగుల్(Google) వివిధ రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తుంది. అయితే ఎన్ని సెక్యూరిటీ మెజర్స్ ప్రవేశపెట్టినా, వివిధ భద్రతా చర్యలపై గట్టి పట్టు ఉన్నా.. కొన్నిసార్లు కొన్ని హానికరమైన సైబర్ దాడులను ఆపడం అసాధ్యం. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు Google Play Protect అనే సెక్యూరిటీ సెట్టింగ్‌ను ఆన్‌లో ఉంచాలని ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ సలహా ఇస్తుంది.

Google Play Protect అనేది గూగుల్ అందించే ఫ్రీ సెక్యూరిటీ సర్వీస్. కస్టమర్లు ఏవైనా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, ఇది వాటిని తనిఖీ చేస్తుంది. యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ముందే ప్లే ప్రొటెక్ట్, గూగుల్ ప్లే స్టోర్ యాప్స్‌పై సెక్యూరిటీ చెక్ రన్ చేస్తుంది. డివైజ్‌లో ఇతర సోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ప్రమాదకరమైన యాప్స్ ఉన్నాయేమో తనిఖీ చేస్తుంది. మీరు “Improve harmful app detection” సెట్టింగ్‌ను ఆన్ చేస్తే, అన్‌-నోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆటోమెటిక్‌గా గూగుల్‌కు సెండ్ చేస్తుంది. ఇలా ప్రమాదకరమైన యాప్స్‌ను డిటెక్ట్ చేసి, కస్టమర్లను హెచ్చరిస్తుంది.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఎలా ఆన్ చేయాలి..?

సాధారణంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో Google Play Protect సెట్టింగ్ డిఫాల్ట్‌గా ఆన్ చేసి ఉంటుంది. అయితే అనుకోకుండా ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేసి ఉంటే, ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మళ్లీ ఆన్ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ ఓపెన్ చేయండి.

స్టెప్ 2: టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఆ తర్వాత ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసి, సెట్టింగ్స్‌కు వెళ్లండి.

స్టెప్ 4: ఇక్కడ కనిపించే “Improve harmful app detection” సెట్టింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్ మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఏదైనా హానికరమైన యాప్‌ను గుర్తిస్తే.. దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయమని మీకు నోటిఫికేషన్ పంపుతుంది. ఆ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి, సంబంధిత యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసే వరకు ప్లే ప్రొటెక్ట్ ఆటోమెటిక్‌గా దాన్ని డిసేబుల్ చేస్తుంది.

First published:

Tags: Google, Hackers, Playstore, Tech news

ఉత్తమ కథలు