Home /News /technology /

A SURVEY REVEALS SHOCKING FACTS MORE THAN SIX IN 10 PEOPLE INCLUDING IN INDIA SEE FALSE OR MISLEADING INFORMATION ON AT LEAST A WEEKLY BASIS GH SRD

Misleading Information: బాప్ రే.. ఇంటర్నెట్‌లో ప్రతి 10 మందిలో ఆరుగురు తెలుసుకుంటుంది ఇదా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

YouGov అనే కంపెనీ భాగస్వామ్యంతో, గూగుల్‌ కంపెనీ సపోర్ట్‌తో పోయింటర్‌(Poynter) ఇన్స్టిట్యూట్ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. దాదాపు పది మంది వినియోగదారుల్లో ఆరుగురు..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
డిజిటల్‌ యుగంలో పెరిగిపోతున్న తప్పుడు సమాచారంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని బడా కంపెనీలను సైతం ఈ అంశంలో ఆయా దేశాల కోర్టులు హెచ్చరించాయి. వినియోగదారులను తప్పుదారి పట్టించే సమాచారాన్ని అడ్డుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సూచించాయి. తప్పుడు సమాచారాన్ని వినియోగదారులు విశ్వసిస్తున్న కారణంతో కొన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. తప్పుడు సమాచారంతో దాదాపు పది మంది వినియోగదారుల్లో ఆరుగురు ప్రభావితమవుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇండియా సహా ప్రతి 10 మందిలో ఆరుగురికి పైగా వారు కనీసం వారానికోసారైనా తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఇంటర్నెట్‌లో చూస్తున్నట్లు భావిస్తున్నారు. గూగుల్(Google) భాగస్వామ్యంతో ఓ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తెలిశాయి.

YouGov అనే కంపెనీ భాగస్వామ్యంతో, గూగుల్‌ కంపెనీ సపోర్ట్‌తో పోయింటర్‌(Poynter) ఇన్స్టిట్యూట్ చేసిన సర్వే ప్రకారం.. Gen X, మిలీనియల్, Gen Z రెస్పాండెంట్స్‌(18 నుంచి 57 సంవత్సరాల వయస్సు గలవారు) దాదాపు 50 శాతం మంది తమ కుటుంబం తప్పుదారి పట్టించే సమాచారం గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాయి.ఈ సంస్థలు యూఎస్‌, బ్రెజిల్, యూకే, జర్మనీ, నైజీరియా, భారతదేశం, జపాన్‌లలో వివిధ వయసుల్లో ఉన్న దాదాపు 8,500 కంటే ఎక్కువ మందిని సర్వేలో భాగంగా పరిశీలించాయి.



* అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్‌లతో సెర్చింగ్‌
పోయింటర్ ఇనిస్టిట్యూట్‌లోని మీడియావైజ్ డైరెక్టర్ అలెక్స్ మహదేవన్ మాట్లాడుతూ..‘సమాచారాన్ని ధృవీకరించడానికి సైలెంట్ జనరేషన్ (68 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) కంటే Gen Zers రెండు రెట్లు ఎక్కువగా సెర్చ్‌ ఇంజిన్‌ ఉపయోగించే అవకాశం ఉంది.

వారు ఆన్‌లైన్‌లో చూసినదాన్ని ధృవీకరించడానికి సోషల్ మీడియా వ్యాఖ్యలను తనిఖీ చేయడానికి బేబీ బూమర్‌ల కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తాము విన్నది లేదా చదివినది నిజమో కాదో నిర్ణయించేటప్పుడు, ఆ వివరాలకు సంబంధించిన సోర్స్‌ లేదా వాస్తవాలను పరిశీలిస్తామని అన్ని వయసుల రెస్పాండెంట్స్‌ అంగీకరించారు.’ అని చెప్పారు.

ఇది కూడా చదవండి : 5జీ నెట్వర్క్ వచ్చేస్తోంది... గ్రామగ్రామానికి డిజిటల్ ఇండియా విస్తరణ... ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
 ఇంటర్నెట్‌లో వివరాల కోసం సెర్చ్‌ చేస్తున్నప్పుడు రివర్స్ ఇమేజ్ సెర్చ్ లేదా ఎంగేజ్‌ ఇన్‌ లేటరల్‌ రీడింగ్‌ వంటి అధునాతన సెర్చ్‌ టెక్నిక్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. అలాంటి సమయంలోనే మల్టిపుల్‌ ట్యాబ్‌లను ఓపెన్‌ చేసి, అనేక అంశాలను సెర్చ్‌ చేస్తారు.

* వారు తప్పుడు సమాచారాన్ని మెరుగ్గా గుర్తించగలరు
సైలెంట్ జనరేషన్ కంటే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించడంలో Gen Z, మిలీనియల్స్, Gen X బూమర్‌లు కొంచెం ఎక్కువ నమ్మకంతో ఉన్నట్లు సర్వేలో కనుగొన్నారు. వారు కాస్తంత మెరుగ్గా తప్పుడు సమాచారాన్ని గుర్తించగలుగుతున్నారని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో సమాచారం కనుగొనడం ఎంత ముఖ్యమో, అది నమ్మదగినదా కాదా అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. వివిధ సోర్స్‌లను పరిశీలించి, లభించిన సమాచారం వాస్తవమా కాదా అని నిర్ధారించుకోవాలి. ఇందుకు గూగుల్‌ సెర్చ్‌ వంటివి ఉపయోగపడతాయి. సమాచారాన్ని నిర్ధారించుకొనే అంశాలపై వినియోగదారులు దృష్టి పెట్టాలని సర్వే సూచిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Google, India, Internet, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు