A SURVEY REVEALS ONE IN TEN MILLENNIALS CHOOSE NETFLIX MORE THAN SEX BA
మాకు సెక్స్ వద్దు.. అదే కావాలంటున్న యువత.. ఏంటో తెలిస్తే ఓర్నీ అనుకుంటారు..
ప్రతీకాత్మక చిత్రం
ఇటీవల వోచర్ కోడ్స్ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? సెక్స్ కంటే కూడా కొందరు యువత Netflix వైపు మొగ్గుచూపారు. తమకు సెక్స్ వద్దని నెట్ ఫ్లిక్స్ కావాలని చెప్పారు.
మిలీనియల్స్ అంటే. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారు. ఇలాంటి వారు ఏం కోరుకుంటున్నారో తెలుసా. ప్రపంచంలో చాలా మంది సెక్స్ అంటే పడిచచ్చిపోతారు. రెండు ఆప్షన్లు ఇచ్చి అందులో ఒక ఆప్షన్ సెక్స్ అని ఇస్తే, కచ్చితంగా అంతా దానికే ఓటేస్తారు. సెక్స్‌లో అంత ఆనందం ఉందని భావిస్తారు. కానీ, ఇటీవల వోచర్ కోడ్స్ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? సెక్స్ కంటే కూడా కొందరు యువత Netflix వైపు మొగ్గుచూపారు. తమకు సెక్స్ వద్దని నెట్ ఫ్లిక్స్ కావాలని చెప్పారు. 2200 మంది మిలీనియల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. అందులో ప్రతి 10 మందిలో ఒకరు తమకు సెక్స్ కంటే నెట్ ఫ్లిక్స్ కావాలని చెప్పారు. అంటే, జనం ఏ రేంజ్లో ఈ ఓటీటీ ప్లాట్ ఫాంకు అలవాటుపడ్డారో అర్థం అవుతుంది. కరోనా వల్ల మెజారిటీ వర్గాలు నష్టపోతే నెట్ ఫ్లిక్స్ మాత్రం బాగా లాభపడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావడంతో అంతా నెట్ ఫ్లిక్స్‌కు సబ్‌స్క్రైబ్ చేశారు. అమెరికాలో సగటున 40 శాతం సమయాన్ని జనం టీవీ చూడడమో, లేకపోతే ఆన్ లైన్ వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారని గుర్తించారు.
లాక్డౌన్ కాలంలో బాగా పాపులర్ అయిన వాటిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. అందులో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఇళ్లకే పరిమితం అయినవారు ఎంటర్టైన్మెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్ పైన ఆధారపడ్డారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తరువాత వీడియో స్ట్రీమింగ్ యాప్ లకు ఆదరణ పెరిగింది. థియేటర్లు కూడా మూసివేయడంతో చాలామంది ఇలాంటి యాప్స్‌లోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కార్యక్రమాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. దీంతో సబ్స్క్రిప్షన్స్ సంఖ్యను పెంచుకునేందుకు చాలా కంపెనీలు రకరకాల ప్లాన్లు వేశాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ భారతీయులకు రెండు సార్లు ఉచిత ఆఫర్ కూడా ప్రకటించింది. రెండు రోజుల పాటు ఉచితంగా అన్ని వీడియోలను చూసే సదుపాయం కల్పించింది.
భారతదేశంలో ప్రస్తుతం నాలుగు సబ్‌స్క్రిప్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది. రూ.199 ప్లాన్‌తో కస్టమర్లు 480p రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకున్న కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాప్‌తో మాత్రమే లాగిన్ అవ్వాలి. రూ.499 ప్లాన్ తీసుకున్నవారు మొబైల్, టీవీ, పర్సనల్ కంప్యూటర్‌ల్లో... 480p రిజల్యూషన్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. కానీ ఒక్కసారి ఒక్క డివైజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్కు అనుమతి లభిస్తుంది. ఒక్కసారి ఒక స్క్రీన్కు మాత్రమే స్ట్రీమింగ్‌ను పరిమితం చేశారు. రూ.649 స్టాండర్డ్ ప్లాన్‌తో ఫుల్ HD రిజల్యూషన్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. దీంతోపాటు కస్టమర్లు ఒకేసారి రెండు స్క్రీన్లలో నెట్‌ఫ్లిక్స్ ఐడీతో లాగిన్ కావచ్చు. రూ.799 ప్రీమియం ప్లాన్‌తో 4K + HDR స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు. ఒకేసారి నాలుగు స్క్రీన్లలో లాగిన్ కావచ్చు.