ప్రీమియం మోటార్ వెహికల్స్ బ్రాండ్ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) నుంచి కొత్త స్పోర్ట్స్ బైక్(Bike) ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. BMW G 310 RR పేరుతో మరో కొత్త బైక్‌ను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. అత్యంత విజయవంతమైన BMW 310 మోడల్ సిరీస్‌లో ఇది మూడో బైక్. గ్లోబల్ మార్కెట్లలో ఇండియాలోనే ఈ బైక్ మొట్టమొదట రిలీజ్ కావడం విశేషం. ఈ బైక్ జులై 15 నుంచి BMW మోటోరాడ్ ఇండియా డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చింది. కొత్త G 310 RR బైక్‌ను బీఎండబ్ల్యూ మోటరాడ్, TVS మోటార్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత మోడళ్ల మాదిరిగా ఈ కొత్త బైక్‌ను కూడా హోసూర్‌లోని TVS మోటార్ కంపెనీ ప్రొడక్షన్ యూనిట్‌లో తయారు చేస్తున్నారు.
ధర ఎంత?
BMW G 310 RR బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. BMW G 310 RR ధర రూ. 2,85,000 కాగా, BMW G 310 RR స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2,99,000గా (ఎక్స్-షోరూమ్ ధరలు) ఉన్నాయి. ఈ బైక్ కొనుగోలుపై BMW ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. తక్కువ డౌన్ పేమెంట్, రూ. 3,999 నుంచి నెలవారీ పేమెంట్, ఇన్సూరెన్స్, యాక్సెసరీలకు ఫండింగ్ ఆప్షన్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. బీఎండబ్ల్యూ మోటరాడ్ బైక్‌లు మూడు సంవత్సరాల వారంటీతో వస్తాయి. వారంటీని మరో రెండేళ్ల వరకు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. బ్రేక్‌డౌన్, టోయింగ్ పరిస్థితులలో రోడ్-సైడ్ అసిస్టెన్స్ అనే 24×7 365 రోజుల ప్యాకేజీ ద్వారా తక్షణ సేవలను మరింత కచ్చితత్వంతో పొందవచ్చు.
ఇంజిన్ కెపాసిటీ, స్పెసిఫికేషన్లు
BMW G 310 RR బైక్‌లో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన వాటర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఫోర్-స్ట్రోక్ 313-cc ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 9,700 rpm వద్ద గరిష్టంగా 25kW శక్తిని, అలాగే 7,700 rpm వద్ద గరిష్టంగా 27.3 NM టార్క్‌ను అందిస్తుంది. మోటార్‌సైకిల్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 - 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. కొత్త ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది రైడ్-బై-వైర్ థొరెటల్‌తో పాటు అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ ఆప్షన్లతో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఈ బైక్ సెల్ఫ్-రీఇన్‌ఫోర్స్‌మెంట్‌తో కూడిన యాంటీ-హోపింగ్ క్లచ్‌తో వస్తుంది. ఇది ఇంజిన్ బ్రేకింగ్‌ను తగ్గిస్తుంది, రైడింగ్ సేఫ్టీని గణనీయంగా పెంచుతుంది. ఇది క్లచ్ లివర్ వద్ద రెడ్యూస్డ్ ఆపరేటింగ్ ఫోర్స్‌ను కూడా అందిస్తుంది. BMW 310 RR బైక్.. ట్రాక్, అర్బన్, రైన్, స్పోర్ట్ వంటి నాలుగు రైడ్ మోడ్స్‌లో లభిస్తుంది. ఈ బైక్ BMW HP4 లివరీ, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bmw car, EMI, New bikes, Sports bike