ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) రీల్స్ చేసే వారి కోసం ఇటీవల డ్యుయల్ (Dual), టెంప్లేట్ (Template) అనే అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసింది. రీల్స్ వీడియోలలో ఈ అదిరిపోయే ఫీచర్లను ఉపయోగించి బెస్ట్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. డ్యుయల్ ఫీచర్ యూజ్ చేసి ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో ఒకేసారి రికార్డ్ చేయవచ్చు. మీ ముందు ఏం జరుగుతుందో చూపిస్తూ.. మీ రియాక్షన్స్ కూడా రికార్డ్ చేయడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. టెంప్లేట్ ఫీచర్ యూజ్ చేసి ఇంతకుముందే చేసిన రీల్స్‌ను టెంప్లేట్‌గా ఉపయోగించి కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్లను ఎలా ఉపయోగించాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.
* ఇన్‌స్టాగ్రామ్ డ్యుయల్ రీల్స్
డ్యుయల్ ఫీచర్‌తో యూజర్లు తమ ఫోన్‌లోని బ్యాక్ కెమెరాను ఉపయోగించి వీడియో రికార్డ్ చేస్తూనే.. ఫ్రంట్ కెమెరాతో వారి రియాక్షన్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో బ్యాక్ కెమెరాతో తీసిన కంటెంట్ మెయిన్ వీడియోగా ఉంటే.. ఆ వీడియోలో ఒక పార్టుగా మీ రియాక్షన్స్ చిన్న విండో స్క్రీన్‌లో కనిపిస్తాయి.
* డ్యుయల్ ఫీచర్‌ని ఉపయోగించండిలా..
- మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
- స్క్రీన్‌లో టాప్ రైట్ సైడ్‌లో ఉన్న ప్లస్ ఐకాన్‌పై నొక్కాలి. "రీల్ (REEL)" సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తరువాత స్క్రీన్‌పై మీకు లెఫ్ట్ సైడ్‌లో రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి.
- ఈ ఆప్షన్స్‌లో అన్ని ఆప్షన్స్ చూపించడానికి డౌన్ యారోపై క్లిక్ చేయాలి. "డ్యుయల్" లేబుల్‌తో ఉన్న కెమెరా ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు వీడియో రికార్డింగ్ ప్రారంభించడానికి మధ్యలో ఉన్న రికార్డ్ ఐకాన్‌పై నొక్కాలి.
- రికార్డింగ్ పూర్తి చేసిన తర్వాత ఇతర రీల్స్ వీడియోల మాదిరిగానే ఎఫెక్ట్‌లు, మ్యూజిక్ వంటివి యాడ్ చేసుకోవచ్చు.
* ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ టెంప్లేట్
రీల్స్ టెంప్లేట్ ఫీచర్ సాయంతో ఇతర క్రియేటర్స్ ఇప్పటికే క్రియేట్ చేసిన రీల్స్ ఆధారంగా రీల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు రీల్‌ను చూస్తున్నప్పుడు స్క్రీన్ రైట్ సైడ్ టాప్‌లో ఉన్న కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ రీల్ ఆధారంగా ప్రీ-లోడ్ చేసిన మ్యూజిక్, ప్లేస్‌హోల్డర్ క్లిప్‌లతో రీల్‌కి మీ ఓన్ ఫొటోలు, వీడియోలను యాడ్ చేసుకోవచ్చు.
* డిఫాల్ట్ వీడియో ఫార్మాట్‌గా రీల్స్
త్వరలోనే రానున్న ఫీచర్ వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసే వీడియోలు 15 నిమిషాల కంటే తక్కువ నిడివి ఉంటే అవన్నీ ఆటోమేటిక్‌గా రీల్స్‌గా మారిపోతాయి. ప్రస్తుతం తన ప్లాట్‌ఫామ్‌లో రీల్స్‌ను డిఫాల్ట్ వీడియో ఫార్మాట్‌గా ఇన్‌స్టాగ్రామ్ మార్చేందుకు ట్రై చేస్తోంది. రీల్స్, వీడియోల ట్యాబ్‌ను ఒక ట్యాబ్‌గా ఏకం చేయనుంది. కానీ ఈ మార్పు గతంలో ఆల్ రెడీ చేసిన వీడియోలకు వర్తించదు. గతంలో అప్‌లోడ్ చేసిన అన్ని చిన్న వీడియోలు వీడియోలుగా మిగిలిపోతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram, Instagram reel, New features, Tech news