ఎస్కలేటర్ ఎలా పనిచేస్తోందో తెలుసా... త్రీడీ యానిమేషన్ వీడియో...

ఈ త్రీడీ యానిమేషన్ ద్వారా ఎస్కలేటర్ ఎలా పనిచేస్తోందో చెప్పడమే కాదు... దాని వెనకున్న టెక్నాలజీని పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు.

news18-telugu
Updated: December 1, 2019, 10:05 AM IST
ఎస్కలేటర్ ఎలా పనిచేస్తోందో తెలుసా... త్రీడీ యానిమేషన్ వీడియో...
ఎస్కలేటర్ ఎలా పనిచేస్తోందో తెలుసా... త్రీడీ యానిమేషన్ వీడియో... (credit - YT - Jared Owen)
  • Share this:
మెట్లు, లిఫ్ట్ (ఎలివేటర్) వంటివి మనం రెగ్యులర్‌గా చూసేవే. ఐతే... ఈ రోజుల్లో షాపింగ్ మాళ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు ఇలా చాలా చోట్ల ఎస్కలేటర్లు వచ్చేశాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్లలేనివారికి ఇవి చక్కగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ముసలివారికి, ఎక్కువ సామాన్లు మోసుకెళ్లేవారికి ఎస్కలేటర్ ఉంటే చాలు... దానిపై నిల్చుంటే... అదే పైకీ లేదా కిందికీ తీసుకెళ్లగలుగుతోంది. ఐతే... రోజూ కొన్ని వందల కోట్ల మందికి ఉపయోగపడుతున్న ఈ ఎస్కలేటర్లను ఎలా తయారుచేస్తారో చాలా మందికి తెలియదు. ఏ సమస్యా రాకుండా మెట్లు ఓ పద్ధతిలో ఎలా పైకీ, కిందకూ వెళ్లగలుగుతున్నాయి? అవి అలా పనిచేసేందుకు ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఏయే పరికరాలు ఉపయోగించారు? వంటి ప్రశ్నలకు చాలా మందికి సమాధానం తెలియదు. ఇందుకు సంబంధించి ఓ త్రీడీ యానిమేషన్ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో త్రీడీ యానిమేటర్ జార్డ్ ఓవెన్... ఎస్కలేటర్ ఎలా పనిచేస్తుందో వివరించారు. స్టెప్స్, స్టెప్ చైన్, గేర్స్, హ్యాండ్‌రెయిల్, మోటర్ ఇలా ప్రతీ విభాగం ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్పారు.


తమిళంలో దుమ్మురేపుతున్న వరంగల్ బ్యూటీ ఆనందీఇవి కూడా చదవండి :

భార్యకు యువరాజ్ స్వీట్ పోస్ట్... ఫ్యాన్స్ గ్రీటింగ్స్

సంజయ్‌దత్‌కి ఏమైంది... షాకవుతున్న నెటిజన్లుDiabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన

పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>