WhatsApp: వాట్సాప్ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా అబద్దమే.. వెలుగులోకి సంచలన విషయాలు..!

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp: వాట్సాప్(WhatsApp) మెసేజెస్ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో చాలా సురక్షితంగా ఉంటాయని ఆ సంస్థ చెబుతోంది. కానీ వాట్సాప్ డేటా నిజంగా ఇతరులు యాక్సెస్ చేయలేరా? అనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.

  • Share this:
వాట్సాప్(WhatsApp) మెసేజెస్ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో చాలా సురక్షితంగా ఉంటాయని ఆ సంస్థ చెబుతోంది. కానీ వాట్సాప్ డేటా నిజంగా ఇతరులు యాక్సెస్ చేయలేరా? అనేది ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. వాట్సాప్ మాత్రం తమ యాప్ యూజర్లు మల్టీ డివైజ్ యూజ్ చేసినప్పటికీ.. వారి మెసేజ్లు సురక్షితంగా ఉంటాయని పదే పదే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒక తాజా రిపోర్ట్ వాట్సాప్ మెసేజ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ కావని తెలిపింది. వాట్సాప్ మెసేజ్ ల కంటెంట్ ను ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌ చూస్తుందని నాన్-ప్రాఫిట్ న్యూస్ రూమ్ ప్రోపబ్లికా (ProPublica) నివేదిక నొక్కి చెప్పడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశం అయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అమలులోకి వచ్చిన 2016 నుంచి ఫేస్‌బుక్.. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఎలా మార్కెటింగ్ చేస్తోందనే దాని గురించి అనేక విషయాలను ప్రోపబ్లికా నివేదిక వెల్లడించింది.

ప్రోపబ్లికా నివేదిక 1,000 మంది వాట్సాప్ కాంట్రాక్ట్ వర్కర్ల పనితీరు పరిశీలనల ఆధారంగా రూపొందింది. మిలియన్ల మంది వాట్సాప్ యూజర్ల కంటెంట్‌ని పరిశీలించి ఈ నివేదిక రూపొందించినట్లు పేర్కొంది.వ్యక్తిగత వాట్సాప్ మెసేజ్​లు, ఫొటోలు, వీడియోలను చెక్ చేసేందుకు వీలుగా ఈ మోడరేటర్లకు ప్రత్యేక ఫేస్‌బుక్ సాఫ్ట్‌వేర్ యాక్సెస్ లభిస్తుందని ప్రోపబ్లికా వెల్లడించింది. అయితే, ఒక యూజర్ రిపోర్ట్ చేసిన మెసేజ్ లను మాత్రమే ఈ మోడరేటర్లు చెక్ చేయగలుగుతారని వివరించింది.

ఈ మోడరేటర్లు తమ తెరపై కనిపించిన ప్రతి దానిని జడ్జ్ చేయగలుగుతారని తెలిపింది. మోసం, స్పామ్, పిల్లల పోర్న్, టెర్రరిస్టు కుట్రలపై ఒక్క నిమిషం తీర్పు చెప్పగల అనుమతి ఈ మోడరేటర్లకు ఉంటుందని నివేదించింది. అయితే, ఒక వాట్సాప్ యూజర్ ఆఖరి 5 మెసేజ్లను మాత్రమే రిపోర్ట్ చేయగలరు కానీ మొత్తం చాటింగ్ హిస్టరీని రిపోర్ట్ చేయలేరు.

కాగా ఈ విషయం గురించి ప్రోపబ్లికా ప్రస్తావించలేదు. వాట్సాప్ కంటెంట్ చెకింగ్ మోడరేటర్లు ఆస్టిన్, డబ్లిన్, సింగపూర్, టెక్సాస్ ప్రాంతాలకు చెందినవారని నివేదిక చెబుతోంది. "వరస్ట్" అబ్యూజర్లను గుర్తించడానికి, తొలగించడానికి మోడరేటర్లు వాట్సాప్ మెసేజ్లను రివ్యూ చేస్తారని వాట్సాప్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కార్ల్ వూగ్ అంగీకరించినట్లు నివేదిక తెలిపింది.

నివేదికపై వివరణ ఇచ్చిన ఫేస్​బుక్​..

ఈ క్రమంలోనే, ఒక యూజర్ రిపోర్ట్ చేస్తే కేవలం రీసెంట్ మెసేజ్ లు మాత్రమే వాట్సాప్ మోడరేటర్లకు వెళ్తాయని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. అలాగే రిపోర్ట్ కి గురైన కాంటాక్ట్ కి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్లదని ఒక స్క్రీన్ షాట్​తో వివరించింది. మరో స్క్రీన్ షాట్ తో ఆఖరి 5 మెసేజ్ లు మాత్రమే వాట్సాప్ కి ఫార్వర్డ్ అవుతాయని స్పష్టం చేసింది. గతేడాది ఇంటర్నల్ మార్కెటింగ్ కోసం వాట్సాప్ ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ గురించి కూడా ప్రోపబ్లికా నివేదిక ప్రస్తావించింది.

ఇది కూడా చదవండి : ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. సునీల్ గవాస్కర్ వరల్డ్ కప్ జట్టులో ఆ ఇద్దరికి నో ఛాన్స్..!

ఫేస్‌బుక్ యాడ్-ట్రాకింగ్ కోసం వాట్సాప్ మెసేజ్లను వినియోగిస్తున్నట్లు నివేదించింది. "వాట్సాప్ కంటెంట్ ఎన్క్రిప్ట్ చేసినందున, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్ని చాట్‌లు, ఫొటోలు, వీడియోలను ఆటోమేటిక్ గా స్కాన్ చేయలేవు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలానే జరుగుతుంది. కానీ, యూజర్లు " రిపోర్ట్ "బటన్‌ని నొక్కినప్పుడు వాట్సాప్ మోడరేటర్లు ప్రైవేట్ కంటెంట్‌ని యాక్సెస్ చేస్తారు. ఇది వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది." అని ప్రోపబ్లికా తననివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి : సౌరవ్ గంగూలీ ఆ రోజు రాత్రి దేన్ని చూసి పారిపోయాడు..వాట్సన్, ధోనీ ఎందుకు వణికిపోయారు..?

ప్రోపబ్లికా నివేదికకు ప్రతిస్పందనగా ఫేస్‌బుక్ స్పందించింది. "బెదిరింపులు, స్పామ్‌కు చెక్ పెట్టడానికి, హింస సృష్టించేవారిని నిషేధించడానికి టూల్స్ తీసుకొచ్చాం. తక్కువ డేటాను సేకరించేలా వాట్సాప్‌ని రూపొందిస్తాము. మా భద్రతా బృందం ప్రపంచానికి ప్రైవేట్ కమ్యూనికేషన్ అందించడంలో నిరంతరంపనిచేస్తుంది" అని తెలిపింది.
Published by:Sridhar Reddy
First published: