అంతరిక్షంలో వివిధ కదలికలు జరుగుతున్నాయి. అంతరిక్షంలో చాలా ప్రత్యేకమైన విషయాలు చూడవచ్చు. అంతరిక్షంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఇటీవల కనిపించింది. ఇదే తోకచుక్క వచ్చే ఫిబ్రవరి 2న భూమి సమీపంలోకి రాబోతున్నది. ఆ రోజు పగలు అయితే బైనాక్యులర్‌ల సాయంతో, రాత్రిపూట అయితే ఏ పరికరాన్ని ఉపయోగించకుండానే ఈ తోకచుక్కను వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు(Scientists) చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ తోకచుక్క సూర్యునికి దగ్గరగా వెళ్లింది. ఖగోళ శాస్త్ర ప్రియులకు ఇది ఒక ట్రీట్‌గా పరిగణించబడుతుంది.
సుమారు 50 వేల సంవత్సరాల తర్వాత..
50 వేల సంవత్సరాల తరువాత.. ఒక గ్రీన్ కలర్ తోకచుక్క సూర్యునికి సమీపంలోకి వెళ్ళింది. లడఖ్‌లోని హన్లే వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు ఈ గ్రీన్ కలర్ తోకచుక్క యొక్క అద్భుతమైన చిత్రాలను బంధించారు. ఇందుకోసం ప్రత్యేక టెలిస్కోప్‌ను ఉపయోగించారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ ఖచ్చితమైన దృగ్విషయం నియాండర్తల్ మనిషి కాలంలో జరిగిందని పేర్కొన్నారు.
కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలో..
తోకచుక్కకు C/2022 E3 (ZTF) అని పేరు పెట్టారు. కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని శాస్త్రవేత్తలు మార్చి 2022లో కామెట్‌ను కనుగొన్నారు. అప్పటి నుండి కామెట్‌ను ట్రాక్ చేస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ తోకచుక్క సూర్యుని చుట్టూ తిరగడానికి చాలా సమయం పడుతుంది. ఈసారి తోకచుక్క భూమికి దాదాపు 26 మిలియన్ మైళ్ల దూరంలో వెళ్లింది. శాస్త్రవేత్తల ప్రకారం.. గ్రీన్ కలర్ తోకచుక్క సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి వేల సంవత్సరాలు పడుతుంది. ఇంతకు ముందు ఈ తోకచుక్క 50 వేల సంవత్సరాల క్రితం కనిపించింది.
ఎందుకు ఆకపచ్చగా కనిపిస్తోంది..
ఈ తోకచుక్క సూర్యుడికి సమీపానికి వచ్చినప్పుడు దానిలోని పదార్థస్వభావంవల్ల సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగులో కనిపిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. భూమికి సమీపంలోకి రాగానే ఈ ఆకుపచ్చ తోకచుక్కలోని హిమపదార్థం మండటంవల్ల దాని వెనుకలో తెల్లని రంగులో పొడవైన తోక ఏర్పడుతుందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.