భారత్‌కి దగ్గరగా తోకచుక్క... కళ్లారా చూడండి... ఇలా చెయ్యండి...

కరోనా టైంలో నాసా ఓ గుడ్ న్యూస్ లాంటిది చెప్పింది. నియోవైజ్ అనే తోకచుక్కను మంగళవారం నుంచి రాత్రివేళ కళ్లారా చూడమంటోంది.

news18-telugu
Updated: July 14, 2020, 6:46 AM IST
భారత్‌కి దగ్గరగా తోకచుక్క... కళ్లారా చూడండి... ఇలా చెయ్యండి...
భూమివైపు కొత్త తోకచుక్క... కళ్లారా చూడండి... (credit - twitter)
  • Share this:
మన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం మన కళ్లకు కనిపించవు. అలాంటిది ఈమధ్యే కనిపెట్టిన నియోవైజ్ అనే తోకచుక్క మాత్రం... ఇప్పుడు భూమికి దగ్గర నుంచి వెళ్లబోతూ... మన కళ్లకు కనిపించనుంది. వారం కిందట అది బుధగ్రహం కక్ష్యను దాటింది. ఇప్పుడు అది భూమిపై నుంచి వెళ్తోంది. ఇది భారతీయులకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. మంగళవారం నుంచి దీన్ని స్పష్టంగా చూడవచ్చు. దాదాపు 20 రోజులపాటూ.. ఇది ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత... 20 నిమిషాలపాటూ... వాయవ్య ఆకాశంలో దీన్ని చూడగలం. జులై 22-23 తేదీల్లో ఇది భూమికి 10.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ రోజుల్లో ఇది మరింత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మిస్సైతే... ఈ తోకచుక్క మళ్లీ కనిపించేది 8786లోనే. అందువల్ల దీన్ని ఇప్పుడే చూసేయాలి. ఇది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA) తెలిపింది.


ఈ తోకచుక్కను అధికారికంగా C/2020 F3 అంటారు. దీన్ని నాసా నియోవైజ్ (NEOWISE) శాటిలైజ్ కనిపెట్టింది. ఆ సమయంలో ఆ తోకచుక్క సూర్యుడికి చేరువవుతూ కనిపించింది. సూర్యుడి వేడి వల్ల తోకచుక్క పని అయిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ... అది సూర్యుడిలోకి వెళ్లకుండా తప్పించుకుంది. తద్వారా ఇప్పుడు భూమివైపు పయనిస్తోంది.


Comet NEOWISE from ISS in real time & 4khttps://t.co/0BY3K54SqRMusic by Jesse Gallagher
( clip is real time x4 ) pic.twitter.com/Sh6K0DEkL7

రోజూ రాత్రి వేళ... వాయవ్యం వైపున ఆకాశంలో సూర్యాస్తమయం తర్వాత ఇది కనిపించనుంది. మళ్లీ తెల్లారే సూర్యుడు రాకముందు కూడా ఇది కనిపిస్తుంది. బైనాక్యులర్ ఉన్న వారు... దానితో... ఈ తోకచుక్కను ఇంకా స్పష్టంగా చూడొచ్చు. ఆగస్టులో ఇది క్రమంగా కనుమరుగవుతుంది.


నాసా శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమ గాములూ... ఈ తోకచుక్కను పరిశోధిస్తున్నారు. ఈసారి దాన్ని కళ్లారా చూడటం ద్వారా... మనమూ దాన్ని పరిశీలించవచ్చు.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 6:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading