గురు గ్రహాన్ని ఢీకొట్టిన తోకచుక్క... భూమిపై నెగెటివ్ ప్రభావం ఉంటుందా?

గురుగ్రహంపై ఉల్క (Image : Chappel Astro - Gizmodo)

ఇటీవలే ఓ 15 కేజీల ఉల్క (బండరాయి)... బీహార్‌లోని ఓ పొలంలో పడి కలకలం రేపింది. అలాంటి ఓ భారీ బండరాయి... గురుగ్రహాన్ని ఢీకొట్టింది. అది చందమామ కంటే పెద్ద సైజులో ఉండొచ్చనే అంచనాలున్నాయి.

  • Share this:
టెక్సాస్‌లోని ఔత్సాహిక గ్రహాన్వేషకుడు ఈథన్ చాప్పెల్... తన టెలిస్కోప్‌కి కెమెరాను సెట్ చేసి... గురుగ్రహాన్ని వీడియో తీయసాగారు. ఇంతలో గుండ్రంగా ఉన్న ఓ ఆకారం... వేగంగా వెళ్లి గురుగ్రహ ఉపరితలాన్ని ఢీకొట్టింది. అది తోకచుక్క అయి ఉండొచ్చని భావిస్తున్నారు. నిజానికి అది ఢీకొట్టిన విషయం వీడియో షూట్ చేస్తున్న సమయంలో ఆయన గమనించలేదు. ఆ ఫీడ్‌ని కంప్యూటర్‌లో చూసినప్పుడు మాత్రమే అతనికి ఆ విషయం తెలిసింది. జూపిటర్... దక్షిణ ధ్రువంలో ఎడమ వైపున అది ఢీకొట్టినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ... ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేశారు. బుధవారం (07-08-2019) తెల్లవారు జాము 4.07కి ఈ ఘటన జరిగిందనీ... రెండు సెకండ్లలోనే తోకచుక్క ఢీకొట్టడం జరిగిపోయిందని వివరించారు.


వీడియోలో చూడటానికి ఆ తోక చుక్క చాలా చిన్నగానే ఉన్నట్లు అనిపిస్తున్నా... నిజానికి అది చాలా పెద్దదే అయివుండొచ్చంటున్నారు చాప్పెల్. దీనిపై శాస్త్రవేత్తలు స్పందించాలనీ, తమ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నారు. 


2010లో ఇలాగే ఓ తోకచుక్క జూపిటర్‌ని ఢీకొట్టింది. కానీ దాని ప్రభావం గురుగ్రహంపై ఏమాత్రం కనిపించలేదు. దీనికి కారణం ఆ గ్రహం వాయువులతో నిండివుండటమే అని తేల్చారు శాస్త్రవేత్తలు. భూమిని తోకచుక్క ఢీకొంటే పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. అదే గురుగ్రహాన్ని ఢీకొంటే... దానిపై ఉండే బురద, వాయువుల్లో అది కూరుకుపోతుందే తప్ప గొయ్యి ఏర్పడదని అంటున్నారు. భూమికి కూడా ఎలాంటి నెగెటివ్ ప్రభావమూ ఉండదని చెబుతున్నారు.
First published: