Smartwatches: మన బడ్జెట్‌లో రూ.5000 లోపు మంచి స్మార్ట్ వాచీలు..

Smartwatches: మన బడ్జెట్‌లో రూ.5000 లోపు మంచి స్మార్ట్ వాచీలు..

Amazfit Bip U (Image: Twitter)

ఒకప్పుడు స్మార్ట్ వాచ్ అది ఖరీదైనదని.. కేవలం ధనవంతులు మాత్రమే అలాంటివి ధరిస్తారని అనుకునేవాళ్లం. వాటి ఖరీదు కూడా అలాగే ఎక్కువగా ఉండేది. కానీ స్మార్ట్ వాచ్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న పలు సంస్థలు మధ్యతరగతి వారికి బడ్జెట్ లోనే వీటిని అందిస్తున్నాయి.

  • Share this:
ఒకప్పుడు స్మార్ట్ వాచ్ అది ఖరీదైనదని.. కేవలం ధనవంతులు మాత్రమే అలాంటివి ధరిస్తారని అనుకునేవాళ్లం. వాటి ఖరీదు కూడా అలాగే ఎక్కువగా ఉండేది. కానీ స్మార్ట్ వాచ్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న పలు సంస్థలు మధ్యతరగతి వారికి బడ్జెట్ లోనే వీటిని అందిస్తున్నాయి. దీంతో పిల్లలు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఇలా ఇటీవలి కాలంలో ఎవరి చేతికి చూసినా స్మార్ట్ వాచ్ లు రకరకాల డిజైన్స్ లో, కలర్స్ లో కనిపిస్తున్నాయి. హై ఎండ్ స్మార్ట్ వాచుల్లో ఉండే దాదాపు అన్ని ఫీచర్లను ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ లలోనూ అందుబాటులోకి తేవటంతో మామూలు వాచ్ కంటే స్మార్ట్ వాచ్ కొనటం ట్రెండీగా మారింది. మోడర్న్, స్టైలిష్ లుక్ తెచ్చే ఈ గ్యాడ్జెట్ అంటే కాలేజీ పిల్లలు చాలా ఆసక్తి చూపుతున్నారు కూడా. స్మార్ట్ ఫోన్ కు లింక్ చేసుకుని ఫిట్నెస్ ఫ్రీక్స్ స్మార్ట్ వాచ్ తో అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నారు. అందానికే కాదు ఆరోగ్యానికి పనికొచ్చే ఈ స్మార్ట్ వాచ్ లకు మనదేశం అతిపెద్ద మార్కెట్ గా మారటంతో తరచూ ఏదో కొత్త మోడల్ వాచ్ లాంచ్ అవుతూ, సామాన్యులను ఆకట్టుకుంటోంది. మరోవైపు గిఫ్టుగా ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఆప్షన్ గా మారటంతో 5000 రూపాయల లోపున్న స్మార్ట్ వాచ్ లు హాట్ కేక్స్ గా సేల్ అవుతున్నాయి. మన మార్కెట్లో అందుబాటులో ఉన్న 5వేల లోపు స్మార్ట్ వాచ్ లు, వాటి ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి...

Amazfit Bip U

Flipkartలో ప్రస్తుతం సేల్ నడుస్తోన్న Amazfit Bip U స్మార్ట్ వాచ్ పేరుకు తగ్గట్టే అమేజింగ్ గా ఉంది. కేవలం 3,999 రూపాయలకే లభించే ఈ స్మార్ట్ వాచ్ 1.43 ఇంచ్ HD TFT-LCD కలర్ డిస్ప్లేతో 5ATM రేటింగ్, టూ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్లతో, స్ట్రెస్ మానిటరింగ్ కూడా చేస్తుంది. SpO2 blood Oxygen సాచురేషన్ లెవెల్స్, మెనస్ట్రువల్ సైకిల్స్ కూడా ట్రాక్ చేసేలా ఇది ఉండటం మరో హైలైట్. దీనికి యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కూడా ఉంటుంది. ఇక డైలీ యాక్టివిటీలను ట్రాక్ చేసేలా..స్టెప్స్, క్యాలరీలు, స్లీప్ ట్రాకర్, ట్రావెల్ డిస్టెన్స్ వంటి రెగ్యులర్ ఫీచర్లు ఎలాగూ ఉంటాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 9 రోజుల పాటు దీని బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

Amazfit Bip U (Image: Twitter)


Realme Watch S

బడ్జెట్ లో వచ్చే మరో స్మార్ట్ వాచ్ Realme Watch S. దీని ధర 4,999 మాత్రమే. ఒకసారి చార్జ్ చేస్తే 15 రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కూడా అయిన రియల్ మీ వాచ్ మంచి స్మార్ట్ వాచ్ గా మార్కెట్లో రివ్యూలు రాబట్టింది. 16 స్పోర్ట్ మోడ్స్ తో పాటు క్రికెట్, ఇండోర్ రన్, ఔట్ డోర్ సైక్లింగ్, ఫుట్ బాల్, యోగా వంటివి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. PPG సెన్సార్ ఉండటంతో రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ చేసుకునే సదుపాయం ఈ వాచ్ తో ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మీ సన్నిహితులకు ఈ స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తే వారు ఆశ్చర్యపోవటం ఖాయం.

Realme Watch S: Image; Twitter)


Amazfit Bip S

రెక్టాంగులర్ డయల్ తో ఉన్నAmazfit Bip S స్మార్ట్ వాచ్ కళ్లు చెదిరేలా ఉంటుంది. TFT డిస్ప్లేతో ట్రాన్ఫెక్టివ్ కలర్ తో ఇది ఆకట్టుకునేలా ఉంది. PPG బయో-ట్రాకింగ్ ఆప్టికల్ సెన్సార్, 3-యాక్సిస్ యాక్సలరేషన్ సెన్సార్, 3-యాక్సిస్ జామెట్రిక్ సెన్సార్, వాటర్ రెసిస్టంట్ రేటింగ్, 10 స్పోర్ట్స్ మోడ్స్ తో Amazfit Bip S స్మార్ట్ వాచ్ చాలా స్మార్ట్ గా ఉంది. మ్యూజిక్ ప్లేయర్ కంట్రోలర్ గా కూడా ఈ వాచ్ ను ఉపయోగించవచ్చు. GPS, GLONASS ను ఇందులో యూజ్ చేసుకుంటూనే, లొకేషన్ ట్రాక్ చేయచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా అమేజ్ ఫిట్ ఆఫర్ చేస్తోంది. తక్కువ బడ్జెట్ లో అత్యధిక ఫీచర్లను Amazfit Bip S స్మార్ట్ వాచ్ గ్యాడ్జెట్ లో మీరు ఉపయోగించుకోవచ్చు. Flipkartలో కేవలం 4,999 కే ఈ స్మార్ట్ వాచ్ సొంతం చేసుకోవచ్చు.

Amazfit Bip S: Image: Twitter


Noise Colorfit Pro 3 

4,499 రూపాయలతో Noise Colorfit Pro 3 స్మార్ట్ వాచ్ ను కొనచ్చు. బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, 14 స్పోర్ట్స్ మోడ్స్, ఆటో స్పోర్ట్స్ రికగ్నిషన్, వాటర్ రెసిస్టంట్ అయిన Noise Colorfit Pro 3 మంచి స్మార్ట్ వాచ్ గా మార్కెట్లో ఫీడ్ బ్యాక్ సంపాదించుకుంది. హెచ్ డీ టచ్ స్క్రీన్ ట్రూ వ్యూ డిస్ప్లే విత్ 320X360 పిక్సెల్స్ రెజల్యూషన్ పీక్ బ్రైట్ నెస్ ఫీచర్లున్న Noise Colorfit Pro 3 గ్యాడ్జెట్ అదిరిపోయేలా ఉంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 10 రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్ ను కూడా మానిటర్ చేసుకునేలా ఈ గ్యాడ్జెట్ ఉంది. మెన్స్ట్రుయేషన్, ప్రెగ్నెన్సీ డేటా ను కూడా ఇది రిమైండర్ గా వుమెన్ యూజర్స్ కు అప్డేట్ చేస్తుంది. నెక్ట్స్ పీరియడ్ ఎప్పుడన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇందుకు మీరు డేటాను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కాల్స్ అటెండ్ అయ్యేందుకు, మెసేజెస్ చదివేందుకు, మొబైల్ నోటిఫికేషన్స్ కోసం కూడా ఈ స్మార్ట్ వాచ్ ను ఉపయోగించుకోవచ్చు.

Noise Colorfit Pro 3 : Image; Twitter


Noise ColofFit NAV

Amazon లో కేవలం 4,499 రూపాయలకే అందుబాటులో ఉన్నNoise ColofFit NAV స్మార్ట్ వాచ్ స్పోర్ట్స్ స్క్వేర్ డిస్ప్లే తో ఉంటుంది. Noise ColofFit Pro2 ను ఇది పోలి ఉంటుంది. ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే విత్ 320X320 పిక్సెల్స్ రెజల్యూషన్ , ఇన్ బిల్ట్ జీపీఎస్, వాటర్ రెసిస్టంట్ రేటింగ్ తో అట్రాక్టివ్ గా ఉంది. 10 స్పోర్ట్స్ మోడ్స్ లో ఉండటంతో పాటు వాకింగ్, సైక్లింగ్, డ్యాన్సింగ్, బ్యాండ్మింటన్, యోగా, రన్నింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి మోడ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువ సేపు కూర్చుంటే వచ్చే సెడెంటరీ అలర్ట్స్ వంటి రెగ్యులర్ ఫీచర్లున్నాయి.
First published: