సూర్యుడి 10 ఏళ్ల టైమ్‌లాప్స్ వీడియో... అదిరిందంటున్న నెటిజన్లు... నాసాపై హర్షం

మరోసారి నాసా అందర్నీ ఆశ్చర్యపరిచింది. 10 ఏళ్లుగా సూర్యుణ్ని కంటిన్యూగా షూట్ చేసి... ఆ మొత్తాన్నీ టైమ్ లాప్స్ రూపంలోకి మార్చడం మామూలు విషయం కాదు కదా....

news18-telugu
Updated: June 27, 2020, 11:26 AM IST
సూర్యుడి 10 ఏళ్ల టైమ్‌లాప్స్ వీడియో... అదిరిందంటున్న నెటిజన్లు... నాసాపై హర్షం
సూర్యుడి 10 ఏళ్ల టైమ్‌లాప్స్ వీడియో... అదిరిందంటున్న నెటిజన్లు... నాసాపై హర్షం (credit - youtube)
  • Share this:
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా మరోసారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. మనం ఓ గంటపాటూ సూర్యుణ్ని వీడియో షూట్ చేయడం చాలా కష్టం. ఇక రోజుల తరబడి షూట్ చెయ్యాలంటే అదో సాహసమే. అలాంటిది నాసా... ఏకంగా 10 సంవత్సరాలుగా... ప్రతి రోజూ... ప్రతి గంటా సూర్యుణ్ని రికార్డ్ చేస్తూనే ఉంది. నాసాకి చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO)... దశాబ్ద కాలానికి పైగా సూర్యుణ్ని చూస్తోంది. ఇది పదేళ్లలో 42.5 కోట్ల హై రిజల్యూషన్ ఫొటోలు తీసింది. వాటన్నింటినీ ఓ చోటికి చేర్చి... నాసా.. టైమ్‌లాప్స్ వీడియోగా కుదించింది. 10 ఏళ్ల మొత్తం ఫుటేజ్ ఒక గంటకు కుదించింది. ఆ అరుదైన టైమ్ లాప్స్ (Timelapse) వీడియోని యూట్యూబ్‌లో ఉంచింది. దశాబ్దకాలపు సూర్యుడు అనే టైటిల్ పెట్టింది.

ఈ SDO అనేది... ప్రతి 0.75 సెకండ్‌కు ఓసారి సూర్యుణ్ని ఫొటో తీస్తుంది. అంటే సెకండ్ కంటే తక్కువ సమయంలోనే. ప్రతి 12 సెకండ్లకు ఓసారి ఆ ఫొటోలరు... నాసాకి చెందిన అట్మాస్మెరిక్ ఇమేజింగ్ అసెంబ్లీ (AIA)కి చేరతాయి.

ఈ వీడియోలో సూర్యుడిపై భారీ మంటలు, సూర్యకంపాలు, సౌరగాలులు ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి. ఇందులో సూర్యగ్రహణాలు కూడా ఉన్నాయి. మధ్యలో 12.24 నిమిషాల దగ్గర సూర్యుడి ముందు నుంచి శుక్రగ్రహం వెళ్లడాన్ని మీరు చూడొచ్చు. అలాగే... 1.08 నిమిషాల దగ్గర సూర్యకంపం కనిపిస్తుంది. అలాగే... 2.17 నిమిషాల దగ్గర పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది.

జూన్ 24న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడో సెన్సేషన్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 6న్నర లక్షల మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. 7.5వేలకు పైగా లైక్స్ వచ్చాయి. పదేళ్లు అంటే... 87600 గంటలు... అంటే టైమ్ లాప్స్ స్పీడ్... 90వేల రెట్లు ఎక్కువ అని ఓ యూజర్ తెలిపారు.
First published: June 27, 2020, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading