అంతరిక్షంలోకి చికెన్ నగ్గెట్.. ఎందుకో తెలుసా..?

అంతరిక్షంలోకి శాటిలైట్లను, స్పేస్ స్క్రాఫ్ట్స్ లను, మనుషులను పంపడమే ఇంతవరకు విన్నాం. కానీ, వినూత్నంగా చికెన్ నగ్గెట్ ను అంతరిక్షంలోకి పంపించినట్లు ఎప్పుడైనా విన్నామా? లేదు. అటువంటి వినూత్న ప్రక్రియనే చేపట్టింది సూపర్ మార్కెట్ దిగ్గజం ఐస్లాండ్ ఫుడ్స్.

news18
Updated: October 15, 2020, 12:14 PM IST
అంతరిక్షంలోకి చికెన్ నగ్గెట్.. ఎందుకో తెలుసా..?
  • News18
  • Last Updated: October 15, 2020, 12:14 PM IST
  • Share this:
ప్రముఖ సూపర్ మార్కెట్ దిగ్గజం ఐస్లాండ్ ఫుడ్స్ వినూత్న ప్రక్రియకు నాంది చుట్టింది. సంస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయినందున గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్లో భాగంగా తన ఐకానిక్ చికెన్ నగ్గెట్ (కోడి మాంసం నుంచి తయారుచేసే ఒక పదార్థం) ను భూమి నుండి 1,10,000 అడుగుల ఎత్తుకు పంపింది. అంతరిక్షంలోకి పంపబడిన మొట్టమొదటి చికెన్ నగ్గెట్ గా ఇది రికార్డుకెక్కింది. ఈ చికెన్ నగ్గెట్ అంతరిక్షానికి చేరుకోవడానికి ఒక గంట 45 నిమిషాలు పట్టింది.

ఇది భూమి నుండి 1,10,000 గరిష్ట ఎత్తుకు చేరుకున్న తరువాత, గంటకు 200 మైళ్ళ వేగంతో తిరిగి భూమిపైకి దూసుకొచ్చి పారాచూట్ తో సురక్షితంగా కొండలపై ల్యాండ్ అయింది.  కాగా దీన్ని నార్త్ వేల్స్ లోని డీసైడ్ ఐస్లాండ్ ఫుడ్ హెడ్ ఆఫీస్ కు సమీపంలో ఉన్న ప్రాంతం నుంచి ప్రారంభించారు. 50 సంవత్సరాల చరిత్ర గల ఐస్లాండ్ ఫుడ్స్ చికెన్ నగ్గెట్స్ అమ్మకంలో ప్రసిద్ధికెక్కింది. కేవలం గత వారంలోనే 10 మిలియన్లకు పైగా చికెన్ నగ్గెట్స్ మరియు స్ట్రిప్స్ అమ్ముడయ్యాయి.
చికెన్ నగ్గెట్ ను అంతరిక్షంలోకి పంపించడాన్ని ట్విట్టర్ ద్వారా ఐస్లాండ్ ఫుడ్స్ షేర్ చేసుకుంది. ‘‘ఈ రోజు మేము మొట్టమొదటి చికెన్ నగ్గెట్ ను అంతరిక్షంలోకి పంపించాము. ప్రస్తుతం ఇది ఈ ప్రపంచానికి దూరంగా ఉంది! ” అని పేర్కొంది. కాగా, చికెన్ నగ్గెట్ ప్రయాణం గురించి మరింత తెలుసుకోవటానికి నెటిజన్లు ఆసక్తి కనబర్చారు. ఒక వినియోగదారుడు నగ్గెట్ ఎక్కడ ల్యాండ్ అయింది? అని అడగ్గా దీనిపై ఐస్లాండ్ ఫుడ్ సోషల్ మీడియా గ్రూప్ కు చెందిన రాచెల్ స్పందిస్తూ "ప్రస్తుతం మేం పంపించిన చికెన్ నగ్గెట్ కొండలలోకి దిగి కోలుకుంది, నేను కూడా మీతో పాటు దీని గురించి తెలుసుకోవటానికి ఆసక్తితో ఉన్నాను." అని బదులిచ్చారు.

కాగా, దీన్ని అంతరిక్షంతోకి పంపడానికి ఐస్టాండ్ ఫుడ్స్ స్ట్రాటోస్పియరిక్ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. దీనిపై ఐస్లాండ్ ఫుడ్స్ ట్రేడింగ్ డైరెక్టర్ ఆండ్రూ స్టానిలాండ్ మాట్లాడుతూ ‘‘సంస్థ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయినందున ఎప్పటికైనా గుర్తుండేలా చికెన్ నగ్గెట్ను అంతరిక్షంలోకి పంపించాం. అంతేకాక, కరోనా వైరస్ ప్రజల షాపింగ్ విధానాన్ని మార్చేసింది, దీంతో రెస్టారెంట్ ఫుడ్పై ప్రజల్లో ఆసక్తి తగ్గింది.’’ అని ఆయన పేర్కొన్నారు.
Published by: Srinivas Munigala
First published: October 15, 2020, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading