Right to repair: మరమ్మతు హక్కు ఉద్యమం ప్రజల్లోకి వెళ్తుందా? దీనివల్ల ఎవరికి ఏంటి ఉపయోగం?

ప్రతీకాత్మక చిత్రం

Right to repair: టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఉద్యమంలో తొలి అడుగు వేయడానికి సిద్ధమైంది. ఒరిజినల్ యాపిల్ పార్ట్స్, టూల్స్, మాన్యువల్‌లను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు తమ యాపిల్ ఉత్పత్తులను రిపేర్ చేయడానికి వీలుగా సెల్ఫ్-రిపేర్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయాలని యాపిల్ నిర్ణయించింది.

  • Share this:
భారతదేశ ప్రజలు పాడైపోయిన వస్తువులను రిపేర్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఏదైనా పరికరం వర్క్ చేయడం మానేస్తే దానిని రిపేర్ చేసి మళ్లీ పని చేయించడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ స్మార్ట్‌ఫోన్‌ల (Smart Phones) లాంటి డిజిటల్ పరికరాలను రిపేరు చేయడం అసాధ్యంగా మారింది. క్లోజ్డ్ ఆర్కిటెక్చర్స్, ఎకోసిస్టమ్స్ కారణంగా తయారు చేసిన కంపెనీలు తప్ప కొనుగోలుదారులు డిజిటల్ గ్యాడ్జెట్ల (Digital Gadgets) ను బాగు చేయడానికి వీలు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో రైట్ టు రిపేర్ (మరమ్మతు హక్కు) ఉద్యమానికి ప్రాధాన్యత సంతరించుకుంటోంది. కంపెనీలు తమ ఉత్పత్తుల ఆర్కిటెక్చర్‌లు, ఎకోసిస్టంలను ప్రజలు యాక్సెస్ చేసేలా అనుమతించాలని ఈ ఉద్యమం కోరుతోంది. దీనివల్ల ప్రజలు తాము కొనుగోలు చేసిన వస్తువులను రిపేర్ చేయగలరు. అంతేకాక, వాటిని ఎంతకాలమైనా ఉపయోగించగలరు.

టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఈ ఉద్యమంలో తొలి అడుగు వేయడానికి సిద్ధమైంది. ఒరిజినల్ యాపిల్ పార్ట్స్, టూల్స్, మాన్యువల్‌లను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు తమ యాపిల్ ఉత్పత్తులను రిపేర్ చేయడానికి వీలుగా సెల్ఫ్-రిపేర్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయాలని యాపిల్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఊపందుకుంటున్న రైట్ టు రిపేర్ (Right to repair) ఉద్యమం గురించి ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్న వాట్సాప్.. ఆడియో మెసేజెస్ ప్లేబ్యాక్​ స్పీడ్​ని సర్దుబాటు

* రైట్ టు రిపేర్ అంటే ఏంటి?
రైట్ టు రిపేర్ లేదా మరమ్మతు హక్కు అనేది వినియోగదారులకు వారు కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను రిపేర్ చేయడానికి అవసరమైన పార్ట్స్, టూల్స్, సర్వీస్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. కస్టమర్లు తమ ఉత్పత్తులను సొంతంగా రిపేరు చేయాలని మరమ్మతు హక్కు ఎప్పుడూ బలవంత పెట్టదు. ఒక స్మార్ట్ ఫోన్ రిపేర్ కి వస్తే.. దాన్ని బాగు చేయడానికి కంపెనీ సర్వీస్ సెంటర్ భారీ ఎత్తున డబ్బులు అడుగుతుంది. దానికి బదులు కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగకమానదు. కానీ ఇప్పుడు మరమ్మతు హక్కుతో ఎక్కువ మొత్తాల్లో ఖర్చు చేయకుండానే ఒరిజినల్ పార్ట్స్ తో తక్కువ ఖర్చుతో రిపేర్ చేయించుకోవచ్చు. ఈ ఉద్యమం వల్ల కావలసిన పార్ట్స్ అన్నీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆథరైజ్డ్ డీలర్లే కాకుండా కస్టమర్లు కూడా తమ సొంత పరికరాలను రిపేరు చేసుకోగలగాలని.. ఇదే తమ పోరాట ప్రాథమిక సూత్రమని రిపేర్ హక్కు కార్యకర్తలు చెబుతున్నారు.

Vivo V23e 5G: వివో వి23ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. అందుబాటు ధరలో

* మరమ్మతు హక్కు కార్యకర్తల లక్ష్యం ఏంటి?
ప్రతి వినియోగదారుడు, చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను రిపేర్ చేయడానికి అవసరమైన పార్ట్స్, టూల్స్, సర్వీస్ ఇన్ఫర్మేషన్‌కు యాక్సెస్ అందించడమే రిపేర్ హక్కు ప్రచారం లక్ష్యం. తద్వారా వస్తువులను ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు.. వ్యర్థాలను తగ్గించవచ్చని ఉద్యమకారులు చెబుతున్నారు. పరికరాల్లోని సాఫ్ట్‌వేర్‌ను అన్‌లాక్ చేసి జైల్‌బ్రేక్/రూట్ చేసుకోగల సామర్థ్యాన్ని వినియోగదారులకు అందించాలని కోరుతున్నారు. థర్డ్-పార్టీ, ఇండిపెండెంట్ రిపేర్ షాప్‌లు రిపేర్ చేయగల ఉత్పత్తులను కంపెనీలు రూపొందించాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.

రిపేర్ల కోసం యాజమాన్య సమాచారం థర్డ్ పార్టీ వ్యక్తుల చేతిలో పెడితే కస్టమర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం బిగ్ ప్రొడక్ట్స్-మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాడ్జెట్‌లను విప్పడం వల్ల బ్యాటరీలు పేలడం లాంటి ప్రమాదాలు జరగొచ్చని భయపడుతున్నారు. అయితే ఈ ఆందోళనలు నిరాధారమైనవని రిపోర్ట్స్.ఓఆర్‌జీ తేల్చింది. కొత్త ప్రొడక్ట్స్ కొనేలా కస్టమర్లను బలవంతం చేయడానికి కంపెనీలు రిపేర్ కాని ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాయని ఉద్యమకారులు అంటున్నారు. అయితే రిపేర్ హక్కు ప్రచారం అనేది జైల్‌బ్రేకింగ్, ఆటోమోటివ్ రిపేర్ నుంచి సెల్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసే హక్కు వరకు ఇప్పటికే విజయం సాధించిందని చెబుతున్నారు. ఉత్పత్తుల రిపేరింగ్ సాధ్యమైతే వ్యర్థాలు కూడా తగ్గుతాయని మరమ్మతు హక్కు ఉద్యమం ప్రచారకర్తలు చెబుతున్నారు.

instagram: ఇన్‌స్టాలో రీల్స్ చేస్తున్నారా.. ఈ ఫీచ‌ర్ తెలుసుకోండి

* రిపేర్ హక్కుని నిర్ధారించే దిశగా తీసుకుంటున్న చర్యలు ఏంటి?
ఈ ఏడాది జూలైలో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ థర్డ్-పార్టీ ఉత్పత్తి మరమ్మతును సులభతరం చేయడానికి యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వును ఆమోదించారు. ఇండిపెండెంట్ రిపేర్ షాపులను ఉపయోగించుకునే అవకాశాలు లేదా మరమ్మతులు చేసే వ్యక్తుల సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ని జో బైడెన్ ప్రోత్సహిస్తున్నట్లు ఆర్డర్ పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published: