భూమివైపు వస్తున్న భారీ గ్రహశకలం... రేపు ఏం జరుగుతుంది?

గంటకు 87వేల కిలోమీటర్ల వేగంతో... అంటే నిమిషానికి 1448 కిలోమీటర్ల వేగంతో... అంటే సెకండ్‌కి 24 కిలోమీటర్ల వేగంతో ఆ గ్రహశకలం భూమి వైపు వస్తోంది.

news18-telugu
Updated: December 17, 2019, 2:13 PM IST
భూమివైపు వస్తున్న భారీ గ్రహశకలం... రేపు ఏం జరుగుతుంది?
ప్రతీకాత్మక చిత్రం (credit - NASA)
  • Share this:
అది చిన్న గ్రహశకలం కాదు. దాని సైజు 426 అడుగుల వెడల్పు. కన్ను మూసి తెరిచేలోపు అది ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. అంత వేగంగా వస్తోంది. ఐతే... మన భూమికి ఎలాంటి సమస్యా రాదు. అసలు అది భూమిని టచ్ చేసే ఛాన్సే లేదు. కాబట్టి నో టెన్షన్. ఐతే... ఆ గ్రహశకలం గత 11 ఏళ్లలో తొలిసారి భూమికి అతి దగ్గరగా వస్తోంది. దాని పేరు 2019 XF. అమెరికా టైమ్ ప్రకారం... డిసెంబర్ 17 రాత్రి 11.13కి (ఇండియాలో డిసెంబర్ 18 మార్నింగ్ టైమ్) భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో అది భూమికి 35 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే భూమికీ, చందమామకీ మధ్య ఉన్న దూరం కంటే... 9.3 రెట్లు ఎక్కువ దూరం అన్న మాట. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఆ గ్రహశకలం సూర్యుడి చుట్టూ ఓసారి తిరిగేందుకు 573 రోజులు పడుతోంది. అంటే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అనుకోవచ్చు. ఈ గ్రహశకలం ఎక్కువగా వీనస్ (శుక్రగ్రహం), మెర్క్యురీ (బుధగ్రహం) మధ్యే తిరుగుతూ ఉంటుంది. బోర్ కొట్టినప్పుడు అలా భూమివైపు వస్తుంది. 2018లో కూడా భూమివైపు వచ్చింది. అప్పటి కంటే... 2008లో భూమికి బాగా దగ్గరగా వచ్చింది. నవంబర్ 25న ఈ రాయి వస్తున్నట్లు నాసా చూసింది. అంటే... శాస్త్రవేత్తలంతా కూర్చొని... ఇది ఎటువైపు వస్తోంది, ఎలా వస్తోంది అన్నీ లెక్కలేసేశారు. మొత్తం 40 సార్లు దాని దిశ, దశను అంచనా వేశారు. అప్పుడర్థమైంది... ఇది భూమిని టచ్ చెయ్యదని. ఇంతకీ ఇది ఎంత సైజ్ ఉంటుందో ఓ అంచనాకి రాలేదు కదూ. ఈజిఫ్టు లోని అతి పెద్ద గిజా పిరమిడ్ ఉంది కదా. దానంత సైజ్ ఉంటుందట. మరోలా చెప్పనా. న్యూయార్క్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా. దాని కంటే... 1.4 రెట్లు పెద్దది. ఈ గ్రహశకలం 2021లో వీనస్ దగ్గరకు వెళ్లి... మళ్లీ 2029లో భూమివైపు వస్తుంది. తర్వాత 2030, 2040లో కూడా వస్తుంది. ఆ విషయాలు అప్పుడు చెప్పుకుందాం.

First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు