ఫ్రీ యాప్స్ వాడుతున్నారా? మీ డేటా గల్లంతే...

ఆల్ఫబెట్, ఫేస్‌బుక్ మాత్రమే కాదు... అమెజాన్, ట్విట్టర్, వెరిజాన్, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలకూ డేటాను ఇస్తున్నాయి ఆ యాప్స్. మీ వయస్సు, ఫోన్ మోడల్, లొకేషన్, జెండర్ లాంటి వివరాలన్నీ డేటా కలెక్షన్ ప్రాసెస్‌లో భాగంగా సేకరించి యాడ్ రెవెన్యూ పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నట్టు ఆ నివేదిక సారాంశం.

news18-telugu
Updated: October 29, 2018, 5:22 PM IST
ఫ్రీ యాప్స్ వాడుతున్నారా? మీ డేటా గల్లంతే...
Image: Reuters
  • Share this:
మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే... ఈ యాప్స్‌లో రికార్డ్ అయ్యే మీ డేటా దుర్వినియోగమవుతోందని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్లేస్టోర్‌లోని ఫ్రీ యాప్స్‌లో 90% మీ డేటాను గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫబెట్‌తో పంచుకుంటోంది. మీ ప్రమేయం లేకుండానే ఈ డేటా మార్పిడి జరుగుతోంది. అంతేకాదు... ఫ్రీ యాప్స్‌లోని 43 శాతం ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకుంటున్నాయి. ఆల్ఫబెట్, ఫేస్‌బుక్ మాత్రమే కాదు... అమెజాన్, ట్విట్టర్, వెరిజాన్, మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలకూ డేటాను ఇస్తున్నాయి ఆ యాప్స్. మీ వయస్సు, ఫోన్ మోడల్, లొకేషన్, జెండర్ లాంటి వివరాలన్నీ డేటా కలెక్షన్ ప్రాసెస్‌లో భాగంగా సేకరించి యాడ్ రెవెన్యూ పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నట్టు ఆ నివేదిక సారాంశం.

ఫ్రీ యాప్స్ వాడుతున్నారా? మీ డేటా గల్లంతే..., 90 PERCENT OF ALL FREE ANDROID APPS ON PLAY STORE SHARE USER DATA WITH GOOGLE
ప్రతీకాత్మక చిత్రం


అయితే గూగుల్ మాత్రం ఈ నివేదిక తప్పని వాదిస్తోంది. క్రాష్ రిపోర్టింగ్, అనలిటిక్స్ లాంటి సమాచారం మాత్రమే తమకు వస్తోందన్నది గూగుల్ వాదన. థర్డ్ పార్టీ యాప్స్ విషయంలో డెవలపర్స్‌కు స్పష్టమైన నిబంధనలున్నాయని, యూజర్ పర్మిషన్ తీసుకోవాలని, పారదర్శకంగా ఉండాలని సూచించామని చెబుతోంది గూగుల్. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామంటోంది.

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి...

రేపే వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్: హైలైట్స్ ఏంటో తెలుసా?

మీ బడ్జెట్‌లో ఈ 5 మార్పులు కనిపించాయా? అప్పులపాలవుతున్నట్టే...ఐటీ నోటీస్ వచ్చిందా? ఏం చేయాలో తెలుసా?

ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్: తగ్గిన ఏటీఎం విత్‌డ్రా లిమిట్

Video: అప్పుల ఊబిలోకి ప్రయాణం... ఇవే 5 హెచ్చరికలు

Photos: ఖరీదైన కార్లు, ఫ్లాట్లు... మనసున్న మహారాజు దీపావళి గిఫ్ట్‌లు

Photos: ఇస్తాంబుల్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్ విశేషాలు తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: October 29, 2018, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading